Manchu Family : నిన్నటి నుండి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వార్తల్లో హీరో మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్త ఒకటి. ఇన్ని రోజులు మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటాడు అంటూ వార్తలు వినిపించినా పెద్దగా ఆధారాలు కనిపించలేది అయితే నేడు మౌనిక రెడ్డి తో కలిసి మనోజ్ సీతాఫల్ మండి దగ్గరి వినాయకుణ్ణి దర్శించుకోవడంతో ఇక వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై మంచు మనోజ్ ని మీడియా మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారా అని అడిగితే మంచి రోజు చూసుకుని చెబుతా అంటూ సమాధానం చెప్పడంతో ఈ వార్తలు నిజమే అంటూ అందరూ భావిస్తున్నారు. ఇక మనోజ్ మాట్లాడినదాంట్లో మరో హైలైట్ రాజకీయప్రవేశం త్వరలో చేస్తానంటూ చెప్పడం.
మోహన్ బాబు మొదట ఒప్పుకోక పోయినా చివరికి ఓకే చేస్తాడు…
మనోజ్, మౌనికలు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం స్పష్టం అవడంతో ఈ పెళ్ళికి మోహన్ బాబు ఒప్పుకున్నాడా అనే అనుమానం అందరిలో మొదలయింది. ఇక ఇటీవలే మోహన్ బాబు, చంద్రబాబు నాయుడుతో భేటీ అవడంతో వీరిపై మరిన్ని అనుమానాలు వచ్చాయి. నిజానికి మోహన్ బాబుకి ఇష్టం లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో మంచు కుటుంబంలో చాలా రోజులుగా అభిప్రాయ బేధాలు ఉండటం వల్ల ఆస్తుల విభజన కూడా జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది.
మనోజ్, మౌనిక రెడ్డి ఇప్పటికే రెండేళ్లుగా రిలేషన్ లో ఉన్నారు. ఈ విషయంలో విభేదాల కారణంగా మనోజ్ ఇంటికి దూరంగా, కుటుంబానికి దూరంగా ఉంటున్నాడునే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపైన స్పందిస్తూ ఇమంది రామారావు గారు విశ్లేషించారు. మోహన్ బాబు కి నచ్చకపోవడం వల్ల ఈ విషయం లో ఇన్నిరోజులు విభేదాలు వారి ఇంట్లో నడిచాయి అంటూ చెప్పారు. ఇతే వాళ్లిద్దరూ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాక ఇంకా మోహన్ బాబు అనుమతి ఇవ్వాల్సిందే, ఆయన కూడా మొదట బెట్టు చేసినా చివరికి ఒప్పుకోవాల్సిందే. ఇక విష్ణు ని ఒకలాగా మనోజ్ ని ఒకలాగా చూడటం వల్ల ఆస్తుల విభజన పరిస్థితి వచ్చింది అంటూ అభిప్రాయ పడ్డారు ఇమంది రామారావు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…