Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రభాస్ ఏదైనా సినిమాలో నటిస్తున్నారు అంటే ఆ చిత్ర బృందానికి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తారనే విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకు ప్రభాస్ తో పాటు నటించిన ఎంతోమంది నటీనటులు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభాస్ ఫుడీ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన తినడమే కాకుండా అందరికీ అలాంటి భోజనమే పెడతారంటే ఎంతో మంది ప్రభాస్ ఆతిథ్యం గురించి వెల్లడించారు.
తాజాగా ప్రభాస్ ఏర్పాటు చేసే విందు గురించి అమల శర్వానంద్ అఖిల్ ముచ్చటించారు.శర్వానంద్ అమల నటించినటువంటి ఒకే ఒక జీవితం సినిమా సెప్టెంబర్ 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో అఖిల్ కలిసి ఈ ముగ్గురు అమ్మ చేతి వంట అనే ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రస్తావన వచ్చింది.
ఈ క్రమంలోనే ప్రభాస్ గురించి అఖిల్ మాట్లాడుతూ ఎవరైనా ప్రభాస్ అన్నాను కలిస్తే జాగ్రత్తగా ఉండాల్సిందే అని చెప్పగా వెంటనే శర్వానంద్ అవును అంటూ తనకు వత్తాసు పలికారు. ఈ క్రమంలోనే అఖిల్ మాట్లాడుతూ ప్రభాస్ అన్న వద్దు బాబోయ్ అని మొరపెట్టుకున్న ఆయన మాత్రం తినేవరకు వదిలిపెట్టరు అంటూ అఖిల్ అమలకు చెప్పుకొచ్చారు.
ఇలా ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో మాత్రమే విడుదల కాగా అఖిల్ ప్రభాస్ ఆదిత్యం గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అఖిల్ మాత్రమే కాకుండా ఇదివరకు ఎంతోమంది సెలబ్రిటీలు ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి ఎంతోమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.ఇలా అఖిల్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో ప్రభాస్ అభిమానులు అట్లుంటది మరి మా హీరోతో అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…