Tag Archives: gharana mogudu

#HBDMegastarChiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి ముఖ్యమంత్రి పదవిపై ఆశ కల్పించిన సినిమా ఏదో తెలుసా… అప్పట్లో రికార్డులు సృష్టించిన సినిమా ఇదే?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఘరానా మొగుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా కోసం అప్పట్లో చిరంజీవి ఏకంగా 1.25 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోవడం విశేషం.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఆయన అభిమానులందరూ చిరంజీవి రాజకీయాలలోకి వస్తారంటూ వార్తలు సృష్టించారు.ఇండస్ట్రీలో ఈయనకున్న ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని ఇతను కనక పార్టీ పెడితే ఎన్టీఆర్ లాగే ఇతను కూడా ముఖ్యమంత్రి అవుతారంటూ భావించారు.చిరంజీవి రాజకీయాల ఎంట్రీ గురించి ఇలాంటి వార్తలు వస్తున్న సమయంలోనే చిరంజీవి మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ముఠామేస్త్రి.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరంజీవి ముఖ్యమంత్రిగా ఎలివేట్ చేసిన తీరుకు ఆయన అభిమానులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో మెగాస్టార్ స్టైల్ ఆయన నటనకు డాన్సులకు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో కూరగాయల మార్కెట్లో ఉన్న వారి సమస్యలను పరిష్కరిస్తూ చివరికి రాజకీయాలలోకి వెళ్లడం ఈ సినిమా అప్పటి రాష్ట్ర రాజకీయాలలో కూడా బాగా కాకరేపింది.

Chiranjeevi:సినీ పరిశ్రమకు అంకితమైన మెగాస్టార్…

అప్పటికే మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలలోకి వస్తే ఎలా ఉంటుంది అనే భావన ఉన్న అభిమానులు ఈయన కనుక ముఖ్యమంత్రి అయితే ఇక తిరుగు ఉండదని భావించారు.ఇలా ఈ రెండు సినిమాలు చిరంజీవిని రాజకీయాలలోకి తీసుకురావడానికి మూల స్తంభాలుగా నిలిచాయని ఈ సినిమాల వల్లే తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశ కల్పించారని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈయన ప్రజారాజ్యం పార్టీ పేరుతో రాజకీయాలలోకి వచ్చిన అనంతరం తనకు సినిమాలే సెట్ అవుతాయని తిరిగి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి అంకితమయ్యారు.

Chiranjeevi Birthday Special: చిరంజీవి బర్త్ డే స్పెషల్ మరోసారి వెండితెరపై విడుదల కానున్న ఆ బ్లాక్ బస్టర్ చిత్రం?

Chiranjeevi Birthday Special:సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన పోకిరి సినిమాని తిరిగి విడుదల చేయడంతో ఏకంగా 1. 73 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇలా పోకిరి సినిమా మంచి వసూలను రాబట్టడంతో మిగతా హీరో అభిమానులు సైతం తమ హీరోల పుట్టినరోజు వేడుక కోసం ఇలా వారి కెరియర్ లో బ్లాక్ బస్టర్ సినిమాలను తిరిగి విడుదల చేయాలని పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం ఇలా సినిమాలు తిరిగి విడుదల చేయడం ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ అవుతుంది. అయితే సెప్టెంబర్ రెండవ తేదీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఆయన నటించిన జల్సా సినిమాని విడుదల చేయడానికి అభిమానులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆగస్టు 22వ తేదీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాని కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలో విడుదల చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాలలో ఒకటైనటువంటి ఘరానా మొగుడు సినిమాని తిరిగి ఆయన పుట్టినరోజు సందర్భంగా థియేటర్లో విడుదల చేయడం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలియడంతో అభిమానులు సైతం ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.

Chiranjeevi Birthday Special: వరుస సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్…

అయితే ఇలా పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందని అర్థమవుతుంది.ఏది ఏమైనా ఇలా తిరిగి సినిమాలు విడుదలవుతున్నప్పటికీ ప్రేక్షకులు ఆ సినిమాలను పెద్ద ఎత్తున థియేటర్ కి వెళ్లి చూడటం గమనార్హం. ఇక ప్రస్తుతం చిరంజీవి సినిమాల విషయానికొస్తే ఈయన గాడ్ ఫాదర్ , భోళా శంకర్, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ఘరానా మొగుడు సినిమా రీ రిలీజ్ గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Flash Back : “ఘరానా” టైటిల్ తో వచ్చిన రాఘవేంద్రరావు మూడు చిత్రాలలో ఒక సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. !!

“ఘరానా దొంగ “1980 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో కృష్ణ, మోహన్ బాబు, శ్రీదేవి ముఖ్యపాత్రల్లో నటించారు. విజయ లక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.

ఈ చిత్రం 1980 మార్చి 29 న మద్రాసులోని సెన్సార్ బోర్డ్ ప్రాంతీయ కార్యాలయం నుండి యు సర్టిఫికేట్ అందుకుంది; సర్టిఫికేట్ 27 మార్చి 1980 నాటిది.భలే కృష్ణుడు తర్వాత దర్శకుడు రాఘవేంద్రరావు కృష్ణతో కలిసి పనిచేసిన రెండవ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

“ఘరానా మొగుడు” 1992లో విడుదలైన ఒక తెలుగు సినిమా. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి,నగ్మా‌ ముఖ్యపాత్రలు పోషించారు.10 కోట్లకు పైగా వసూలు చేసిన మొదటి తెలుగు చిత్రంగా ఈ సినిమాకు గుర్తింపు ఉంది. ఇందులో డిస్కోశాంతి, చిరంజీవిలపై చిత్రించిన “బంగారు కోడిపెట్ట” పాట బాగా హిట్టయిన చిరంజీవి డాన్స్ పాటలలో ఒకటి. కన్నడంలో విజయవంతమైన “అనురాగ అరళితు” అనే సినిమాకు ఈ సినిమా తెలుగు పునర్నిర్మాణం. కథలోకి వెళితే…

విశాఖపట్టణం పోర్టులో పని చేస్తున్న రాజు (చిరంజీవి) తోటి ఉద్యోగులకి సహాయపడుతూ అందరి మెప్పు పొందుతుంటాడు. తన తల్లి (శుభ) కి పక్షవాతం రావటంతో హైదరాబాదుకి తిరిగివచ్చి అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటాడు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన పారిశ్రామికవేత్త అయిన బాపినీడు (రావు గోపాలరావు) ని రాజు రక్షిస్తాడు. అతని మంచితనాన్ని మెచ్చిన బాపినీడు తన సంస్థలోని ఒక ఉద్యోగానికి సిఫారసు పత్రాన్ని రాజుకి ఇస్తాడు. పొగరుబోతు అయిన బాపినీడు కుమార్తె ఉమాదేవి (నగ్మా) వ్యక్తిత్వం రాజుకి మొదటి నుండి నచ్చదు… అయినా ఆమెను ఎలా పెళ్లి చేసుకున్నాడు అన్నదే మిగతా కథ అంశం.

“ఘరానా బుల్లోడు” 1995 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా. నాగార్జున, రమ్యకృష్ణ, ఆమని ఇందులో ప్రధాన పాత్రధారులు.ఈ సినిమాను ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ పతాకంపై కె. కృష్ణమోహనరావు నిర్మించాడు.ఎం. ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
రాఘవేందర్రావు దర్శకత్వంలో వచ్చిన ఘరానదొంగ, ఘరానా బుల్లోడు చిత్రాలు విజయవంతం కాగా.. 1992లో వచ్చిన “ఘరానా మొగుడు” చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Flash Back : లిప్ లాక్ తెచ్చిన తంటా… దర్శకేంద్రుడు చేసిన పనికి తల పట్టుకున్న చిరంజీవి.. చిరు లిప్ లాక్ వెనుక ఉన్న అసలు కథ..

Gharana Mogudu : 90 దశకాల్లో చిరంజీవి మెగాస్టార్ అయిన రోజులు, మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండి చిరు చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే రేంజ్. ఏ దర్శకుడైనా చిరుతో సినిమా అంటే ఖచ్చితంగా హిట్ కొట్టొచ్చు అనే ధీమా ఉండేది. అపుడు చిరు కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరు తీసిన సినిమా ఘరానా మొగుడు. ఈసినిమాలో చిరు కి జోడిగా నగ్మా నటించింది.

అప్పట్లోనే లిప్ లాక్, సంశయించిన చిరు…

రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన తొలి సినిమా మోసగాళ్లు. ఈసినిమాలో హీరో శోభన్ బాబు, విలన్ గా చిరంజీవి, ఇక హీరోయిన్ గా శ్రీదేవి ద్విపాత్రాభినయం చేసింది. ఇక ఆ తరువాత చిరంజీవి నటించిన చిత్రం తిరుగులేని మనిషి. ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగాను చిరు సెకండ్ హీరోగాను నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. ఇక చిరు, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అడవి దొంగ, ఆ తరువాత కొండవీటి దొంగ, యుద్ధ భూమి, మంచి దొంగ లాంటి సూపర్ హిట్లను తీశారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి అప్పటి వరకు ఉన్న చిరు రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను సృష్టించింది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఘరానా మొగుడు సినిమాలో నగ్మా హీరోయిన్. ఇక ఈ సినిమాలో రాఘవేంద్రరావు చిరుకి నగ్మాకి లిప్ లాక్ ప్లాన్ చేసారు. ఇక ఈ విషయంలో నగ్మా డైరెక్టర్ అడుగగానే ఓకే చేసారు.

ఇక చిరంజీవి మాత్రం ససేమిరా అన్నాడు. కానీ రాఘవేంద్రరావు పట్టుబట్టడంతో మొహమాట పడిన చిరు చివరకు ఒప్పుకున్నాడు. కానీ ఎక్కడో ఇంకా సంశయం అలానే ఉంది. ఇక సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయిన తరువాత కూడా ఇంకా ఆ లిప్ లాక్ గురించి చిరు ఆలోచించారట. ఈ సీన్ను నా అభిమానులు ఎలా తీసుకుంటారో అని అనుకున్నారట. ఇక ఏమైనా సరే రాఘవేంద్ర రావుతో మాట్లాడి ఆ సీన్ తొలగించాలి అని నిర్ణయించుకున్నారు. చివరికి రాఘవేంద్రరావు గారిని ఒప్పించి ఆ లిప్ లాక్ సీన్ ను సినిమాలో తొలగించారట చిరు. ఆ సీన్ సినిమాలో ఉండుంటే ఎలా ఉండేదో తెలియదు కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పటి సినిమాల్లో లిప్ లాక్స్ మామూలే కానీ అప్పట్లో మాత్రం అది పెద్ద విషయమే కదా….

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన”డబుల్ హ్యాట్రిక్” ఇండస్ట్రీ హిట్ మూవీస్.. ఇది సినీ చరిత్రలో ఓ అరుదైన రికార్డ్.!!

1978 మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం… ప్రాణంఖరీదు, మనఊరి పాండవులు, శుభలేఖ, అభిలాష, చాలెంజ్, ఖైదీ, అడవి దొంగ, కొండవీటిరాజా లాంటి విజయవంతమైన చిత్రాలతో దూసుకు వెళ్తున్న..

ఆయన సినీ ఖాతాలో 1987 మొదలుకొని 1992 వరకు నిరాటంకంగా ఆరు సంవత్సరాలు ‘డబుల్ హ్యాట్రిక్ ‘ ఇండస్ట్రీహిట్స్ సినీపరిశ్రమకు అందించడం జరిగింది.

1987 గీతా ఆర్ట్స్ నిర్మాణం, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘పసివాడి ప్రాణం’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. మొదటగా ఈ చిత్రాన్ని మలయాళంలో రూపొందించగా గీతాఆర్ట్స్, రీమేక్ హక్కులు తీసుకొని పసివాడి ప్రాణం చిత్రాన్ని రూపొందించారు. ఇది ఆ సంవత్సరానికి ఇండస్ట్రీహిట్ గా నిలిచింది.

1988 జి.వి.నారాయణ రావు అండ్ ఫ్రెండ్స్ నిర్మాణం, రవిరాజాపినిశెట్టి దర్శకత్వంలో ‘యముడికి మొగుడు’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి, రాధ హీరో, హీరోయిన్లుగా నటించారు. యముని కథతో కూడిన చిత్రం కావడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. రాజ్ కోటి ఇచ్చిన సంగీతం ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. ఆ సంవత్సరానికి గాను యముడికి మొగుడు ఇండస్ట్రీహిట్ గా నిలిచింది.

1989 గీతాఆర్ట్స్ నిర్మాణం, ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “అత్తకి యముడు అమ్మాయికి మొగుడు” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. అత్తా అల్లుళ్ళసవాల్, ప్రతి సవాల్ లతో కూడిన చిత్రం కావడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

1990 అశ్వినీదత్ నిర్మాణం, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో “జగదేక వీరుడు అతిలోక సుందరి ” చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించారు. చిరంజీవి ఇంతకుముందు తీసిన చిత్రాలకు భిన్నంగా ఒక సోషియో ఫాంటసీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఆ సంవత్సరానికి ఈ చిత్రం బాక్సాఫీస్ ని చెడుగుడు లాడించింది.

1991 మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాణం, విజయబాపినీడు దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్ ‘చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, కాస్ట్యూమ్స్ తో మెగాస్టార్ అభిమానులను అలరించారు. బప్పిలహరి సంగీతం ఆనాటి కుర్రకారును కుర్చీలోనే డాన్స్ వేసేలా చేసింది. ఈ సినిమా అప్పటివరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేసింది.

1992 దేవి ఫిలిమ్ ప్రొడక్షన్స్ నిర్మాణం,కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఘరానా మొగుడు’ చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, నగ్మా హీరో, హీరోయిన్లుగా నటించారు. గర్వంతో ఫ్యాక్టరీ యజమానురాలుగా ఉన్న నగ్మాను పెళ్లిచేసుకొని ఆమెకు గుణపాఠం చెప్పే పాత్రలో చిరంజీవి నటించారు. ఎం.ఎం.కీరవాణి అందించిన పాటలు ప్రేక్షకులను నిలకడగా కూర్చోకుండా చేశాయి. ఈ సినిమా ఆ సంవత్సరానికి ఇండస్ట్రీహిట్ గా నిలిచింది. ఈ విధంగా ఆర్డర్ తప్పకుండా మెగాస్టార్ నటించిన 6 చిత్రాలు ఇండస్ట్రీహిట్ గా నిలవడం సినీ చరిత్రలో ఒక రికార్డుగా మిగిలిపోయింది.