Tag Archives: god father movie

God Father Movie: మలయాళం సినిమాని రీమేక్ చేసి మళ్ళీ అక్కడే విడుదల కానున్న గాడ్ ఫాదర్ ! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయబ్బా?

God Father Movie: సాధారణంగా ఒక భాషలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకొని తిరిగి ఆ సినిమా ఇతర భాషలలో డబ్ అవుతూ విడుదల కావడం సర్వసాధారణం.అయితే ఒక భాషలో హిట్ అయిన సినిమాని తిరిగి వేరే భాషలో రీమేక్ చేస్తూ ఇక్కడ కూడా మంచి విజయాలను అందుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి ఎన్నో రీమేక్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఇకపోతే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా మలయాళ రీమేక్ చిత్రం అనే విషయం మనకు తెలిసిందే.మలయాళంలో సూపర్ హిట్ అయినటువంటి లూసీ ఫర్ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేసి గాడ్ ఫాదర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఈ సినిమాని కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ తమిళ భాషలలో కూడా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాని మలయాళంలో కూడా విడుదల చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్స్ ఆశ్చర్యపోతున్నారు.

God Father Movie: మలయాళ హిట్ సినిమాని తిరిగి మలయాళంలో విడుదల చేయడం…

ఇది తెలిసిన ప్రేక్షకులు ఇలాంటి ఐడియాలన్నీ ఎలా వస్తాయి.. మలయాళంలో హిట్ అయిన సినిమాని తెలుగులో రీమేక్ చేసి తిరిగి ఆ సినిమాని మలయాళం లో డబ్ చేసి విడుదల చేయడం ఏంటి? ఏది ఏమైనా ఇలాంటి ఐడియా ఇచ్చిన వారికి హ్యాట్సాఫ్ అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి మలయాళంలో కూడా విడుదలైన గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

వామ్మో చిరు సినిమా కోసం రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్న లేడీ సూపర్ స్టార్..!

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సౌత్ ఇండియాలోని అన్ని భాషాలలో నటిస్తూ అదరగొడుతోన్న అందాల రాశి నయనతార. దక్షిణాది సినీపరిశ్రమలో స్టార్ హీరోయిన్ లలో ఈమె కూడా ఒకరు. ఈమె తన అందం,అభినయంతో తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా భారీ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ టాప్ హీరోయిన్‏గా దూసుకెళ్తుతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా నయనతార మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న గాడ్ ఫాదర్ సినిమాలోనూ నటిస్తోంది. ఈ సినిమాను మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ సినిమాకు తెలుగులో రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీలో నయనతార చిరు చెల్లెల్లి పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఒరిజినల్ వెర్షన్ లో మంజు వారియర్ పాత్రలో నయనతార కనిపించబోతున్నట్లుగా సమాచారం. అయితే చిరు చెల్లెలిగా నటించేందుకు లేడీ సూపర్ స్టార్ భారీగానే డిమాండ్ చేసిందట. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు నయన్ ఏకంగా రూ. 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. తెలుగులో ఇప్పటి వరకు ఏ హీరోయిన్ ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోలేదని టాక్.

ఇందులో నయనతార పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని,గతంలో లేని విధంగా ఆమె పవర్ ఫుల్ లుక్ లో కనిపించబోతోందట.ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ హీరో సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సైతం ఒక అతిథి పాత్ర పోషిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

చిరు గాడ్ ఫాదర్ లో సల్మాన్ క్లారిటీ ఇచ్చిన తమన్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే ఆచార్య సినిమాను పూర్తి చేసుకున్న మెగాస్టార్ అనంతరం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా దీన్ని రూపొందిస్తున్నారు.

ఈ గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ ని ఊటీలో పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిరు చేతికి స్వల్ప గాయం అవడంతో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మలయాళ వెర్షన్ లో పృథ్విరాజ్ సుకుమారన్ పోషించిన పాత్ర కోసం తెలుగులో ఎవరిని తీసుకుంటారు అన్న విషయం ఫై ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే ఈ పాత్ర కోసం చాలా మంది పేర్లు వినిపించగా, ఆ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ విషయం పై దర్శక నిర్మాతల నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. అంతే కాకుండా ఇందులో ఒక పాట కోసం హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్ కూడా సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి.

ఈ విషయాలపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాడ్ ఫాదర్ సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి డ్యాన్స్ చేసిన పాట కాబట్టి ఆ స్థాయికి తగ్గట్టు గానే ఉండాలని బ్రిట్నీ స్పియర్ తో పాడించేందుకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఆమెతో ఇంగ్లీష్ ట్రాక్ పాడించాలా మరేదైనా అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇక తమన్ చెప్పిన ప్రకారం చూసుకుంటే ఇందులో సల్మాన్ ఖాన్ కూడా నటించబోతున్నాడని తెలుస్తోంది.