లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సౌత్ ఇండియాలోని అన్ని భాషాలలో నటిస్తూ అదరగొడుతోన్న అందాల రాశి నయనతార. దక్షిణాది సినీపరిశ్రమలో స్టార్ హీరోయిన్ లలో ఈమె కూడా ఒకరు. ఈమె తన అందం,అభినయంతో తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా భారీ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ టాప్ హీరోయిన్గా దూసుకెళ్తుతుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా నయనతార మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న గాడ్ ఫాదర్ సినిమాలోనూ నటిస్తోంది. ఈ సినిమాను మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. మలయాళం సూపర్ హిట్ లూసిఫర్ సినిమాకు తెలుగులో రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీలో నయనతార చిరు చెల్లెల్లి పాత్రలో నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఒరిజినల్ వెర్షన్ లో మంజు వారియర్ పాత్రలో నయనతార కనిపించబోతున్నట్లుగా సమాచారం. అయితే చిరు చెల్లెలిగా నటించేందుకు లేడీ సూపర్ స్టార్ భారీగానే డిమాండ్ చేసిందట. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు నయన్ ఏకంగా రూ. 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. తెలుగులో ఇప్పటి వరకు ఏ హీరోయిన్ ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోలేదని టాక్.
ఇందులో నయనతార పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని,గతంలో లేని విధంగా ఆమె పవర్ ఫుల్ లుక్ లో కనిపించబోతోందట.ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ హీరో సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సైతం ఒక అతిథి పాత్ర పోషిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…