Tag Archives: green tea

‘టీ’ లలోఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా.. వాటి ప్రయోజనాలు తెలుసుకోండి..

సాధారణంగా చాలా మంది టీ తాగుతారు. కానీ మరికొంతమందికి ఎలా ఉంటుందంటే.. భోజనం చేయపోయినా పర్వాలేదు కానీ.. ఓ కప్పు టీ తాగందే వాళ్లకు పూట గడవదు. ప్రతీ రోజు మద్యం సేవించే వాడు.. ఒకరోజు మద్యం లేకపోతే ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తాడో.. ఒక్క పూట టీ లేకుండా వాళ్లు కూడా అలానే చేస్తారు. అయితే టీ అనేది నిత్యవజీవితంగా భాగంగా మారింది.

టీ లో కూడా చాలా రకాలు ఉంటాయి. అవేంటంటే.. టీ పొడిలో కొన్ని పలుకుల్లా, కొన్ని మెత్తటి పొడిలా, మరికొన్ని ఆకుల్లా ఉండడం గమనించే ఉంటారు. టీ పొడి అనేది తేయాకు కెమల్లియా అనే మొక్క నుంచి వస్తుంది. ఈ మొక్కను ప్రాసెస్ చేసి.. తుది ఉత్పన్నంగా టీ పొడి తయారు చేస్తారు. ఏడు రకాల ప్రాసెస్ లు చేయబడతాయి. కొన్ని రకాల తేయాకును చైనాలో ఏళ్ల తరబడి నిల్వ ఉంచుతారు. పాత వైన్ కు డిమాండ్ ఉన్నట్టే పాత తేయాకుకు కూడా ఇక్కడ ఎక్కువగా డిమాండ్ ఉంటుంది.

అయితే టీలో కూడా అనేక రకాలుగా ఉంటాయి. అవన్నీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీవక్రియ రేటును పెంచి.. శరీర బరువును తగ్గించడంలో ఉపకరిస్తాయని చెబుతున్నారు. శరీరంలోని మంటను తగ్గించడానికి ‘బ్లాక్ టీ’ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ అన్నది ప్రపంచ వ్యాప్తంగా చాలా పాపులర్. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే దీన్ని ఆరోగ్యప్రదాయినిగా భావిస్తుంటారు.

తేయాకులకు కొన్ని పరిమళాలు జోడించి తయారు చేస్తారు. ఒరిజినల్ గ్రీన్ టీ అనేది పరిశుభ్రంగా, రుచికరంగా ఉంటుంది. ఊలాంగ్ టీ అనేది కూడా టీ రకాల్లో ఒకటి. ఈ టీ తామర వంటి చర్మ సమస్యలను నయం చేస్తుంది. వైట్ టీలో.. ధర అధికం. కాకపోతే చైనా తయారీకి, ఇతర దేశాల తయారీకి మధ్య వైవిధ్యం ఉంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇంకా మనం ఇంటి రెమిడీస్ లో పుదీనా, అల్లం టీ వంటివి కూడా తయారు చేస్తారు.

షుగర్ ఉంటే గ్రీన్ టీ తాగొచ్చా.. ఆరోగ్యానికి మంచిదా?

ప్రపంచంలో ఎక్కువ మంది బాధపడే సమస్యలలో మధుమేహ సమస్య ఒకటి. రోజురోజుకు మధుమేహంతో బాధపడే వారి సంఖ్య అధికమవుతుంది. ఈ క్రమంలోనే మన శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవాలంటే చాలామంది వారి ఆహారంలో ఎన్నో నియమాలను పాటిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తీయని పదార్థాలు తగ్గించడం. కాఫీ టీ లను తగ్గించడం వంటివి చేస్తుంటారు. కాఫీ లేదా టీ లను అధికంగా తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయని భావన ఉండటం వల్ల పూర్తిగా కాఫీ టీలను పక్కన పెడుతుంటారు. ఈ క్రమంలోనే షుగర్ వ్యాధితో బాధపడే వారు గ్రీన్ టీ తాగవచ్చా? ఇది తాగడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదకరం ఉండదా? అనే సందేహాలు తలెత్తుతుంటాయి.

షుగర్ తో బాధపడేవారికి గ్రీన్ టీ ఒక మంచి పానీయం అని చెప్పవచ్చు. ప్రతిరోజు మూడు కప్పులు గ్రీన్ టీ తాగడం వల్ల మన శరీరంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచడమే కాకుండా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధికభాగం యాంటిఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇవి మన శరీరానికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తాయి. అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపించడంలో యాంటీఆక్సిడెంట్లు దోహదపడతాయి.

ఈ గ్రీన్ టీ తాగటం వల్ల మన శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఈ క్రమంలోనే టైప్ 2 డయాబెటిస్ వల్ల వచ్చే సమస్యలు పూర్తిగా తగ్గుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.కనుక మధుమేహ సమస్యతో బాధపడేవారు గ్రీన్ టీ నిస్సంకోచంగా తాగ్గొచ్చని చెప్పవచ్చు.

గ్రీన్ టీ తాగటం వల్ల కేవలం మన శరీరంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచడమే కాకుండా, అధిక రక్తపోటు గుండె సమస్యలను దరిచేరనివ్వదు. అదేవిధంగా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ని మొత్తం కరిగిస్తుంది. గ్రీన్ టీ లో అధిక భాగం యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదపడుతుంది.

మద్యం తాగినా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చేయాల్సిన పనులివే..?

దేశంలో మద్యం సేవించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. మద్యం తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. అయితే మద్యం తాగడం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మొత్తంలో మద్యం తీసుకుంటే నష్టమని మితంగా మద్యం తీసుకుంటే లాభమని వెల్లడిస్తున్నారు.

తగినంత భోజనం చేస్తే ఏ విధంగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయో మితంగా మద్యం తాగితే అదే స్థాయిలో లాభాలు కలుగుతాయి. దేశంలో అబ్బాయిలతో పాటు మద్యం తాగే అమ్మాయిల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే దేశంలో ఎక్కువమంది చీప్ లిక్కర్ ను తాగుతూ ఉండటంతో అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. రోజూ మద్యం తాగేవాళ్లు గ్రీన్ టీని అలవాటు చేసుకుంటే మంచిది.

మద్యం తాగేవాళ్లు గ్రీన్ టీ అలవాటు చేసుకోవడం వల్ల గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మద్యం సేవించే వాళ్లు రోజూ ఆపిల్ ను తీసుకుంటే మంచిది. యాపిల్ ను తీసుకోవడం వల్ల జీర్ణాశయంలోని మంట తగ్గుతుంది. ఆపిల్ లో ఉండే పెప్టిన్ జీర్ణాశయం మంట నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. అయితే మితంగా మద్యం తాగితేనే ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

గ్రీన్ టీలో ఉండే తన్నిన్స్, కటేచిన్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్య సమస్యల బారిన పడము. అయితే తక్కువ మోతాదులో మద్యం తీసుకుంటే మాత్రమే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఎక్కువ మోతాదులో మద్యం తీసుకుంటే మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకున్నా ఇబ్బందులు తప్పవు.