Tag Archives: guava health problems

మీకు ఈ సమస్యలు ఉన్నాయా.. అయితే జామకాయ తినకపోవడం మంచిది.. !

జామకాయలో ముఖ్యంగా విటమిన్ – సి అనేది పుష్కలంగా ఉంటుంది. సామాన్యుడికి ఎక్కువగా అందుబాటులో ఉంటుంది కనుక దీనిని ‘సామాన్యుడి యాపిల్’ గా పిలుస్తారు. దీని ధర కూడా అతి తక్కువగా ఉంటుంది. సామాన్యుడు కూడా కొనే స్థితిలో ఉంటుంది కనుకనే దానిని సామాన్యుడి యాపిల్ గా పిలుస్తారు.

అందులో ఉండే పోషకాలకు మాత్రం విలువ కట్టలేమని అంటారు వైద్యులు. జామ పండుతో పాటు జామ ఆకులు, బెరడులో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిద్రలేమితో ఇబ్బంది పడుతున్న వారు రాత్రి సమయంలో దీనిని తీసుకోవటం వల్ల సమస్య మరింత జఠిలమయ్యే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో జామపండు తినటం వల్ల కడుపు ఉబ్బరంతో నిద్ర సరిగా పట్టని పరిస్ధితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

షుగర్ వ్యాధి గ్రస్తులు ఈ కాయను ఎంత మితంగా తింటే అంత మంచిది. గ్యాస్ సమస్యలతో బాధపడే వారు జామ పండును తినకపోవటమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే జామ పండులో ఉండే విటమిన్ సి ప్రక్టోస్ లు ఎక్కవగా ఉండటం వల్ల కడుపులో ఉబ్బరంగా ఉండే భావన కలుగుతుంది. దంత సమస్యలతో బాధపడే వారు ఈ జామకాయను తినకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
జామపండ్లలో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్స్, కెరోటిన్, పొటాషియం ఉంటాయి. అరటిలో ఎంత పొటాషియం ఉంటుందో… జామలోనూ అంతే ఉంటుంది. అందువల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పై సమస్యలు లేని వారు ఎంచక్కా జామకాయను తినొచ్చు.