Tag Archives: habit

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అలవాటు కారణంగా బెంబేలెత్తిపోయిన చిరంజీవి?

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పొందినటువంటి చిరంజీవి అనంతరం తన ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఒక్కొక్కరిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వచ్చారు. ఇలా మెగా కాంపౌండ్ నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

ఇకపోతే చిరంజీవి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్న సమయంలోనే పవన్ కళ్యాణ్ ఇంకా ఇండస్ట్రీలోకి రాలేదు. ఆ సమయంలో చిరంజీవి ఎక్కడికి వెళ్లినా కుటుంబ సభ్యులకు వివిధ రకాల వస్తువులను తీసుకొని వచ్చేవారట ఈ క్రమంలోనే తాను ఆ సినిమా షూటింగ్లో నిమిత్తం విదేశాలకు వెళ్ళినప్పుడు ఏదైనా కావాలా అంటూ పవన్ కళ్యాణ్ ని అడిగితే తాను మాత్రం డమ్మీ గన్నులు తీసుకొని రా అన్నయ్య అంటూ చెప్పే వారట.

ఇలా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం కావాలి అని అడిగిన తనకోసం గన్ తీసుకొని రా అని చెప్పడంతో ఒక్కసారిగా చిరంజీవిలో ఏదో తెలియని భయం మొదలైందని చిరు పలు సందర్భాలలో తెలియజేశారు. వీడు ఎక్కడికెళ్లిన గన్ను తీసుకొని రమ్మంటున్నారు ఏంటి కొంపతీసి వీడు నక్సలైట్లలోకి కనక కలిసిపోతాడా అనే భయం నాలో పట్టుకుందని చిరంజీవి తెలిపారు.

ప్రజలు మెచ్చిన నాయకుడు…
ఇలా గన్నులు అంటే ఎంతో ఇష్టం చూపడంతో తనకు భయం వేసిందని కానీ నక్సలైట్లలోకి వెళ్లిపోతాడు అనుకున్న తన తమ్ముడు కాస్త ప్రజలు మెచ్చిన నాయకుడు అవుతున్నారు అంటూ చిరంజీవి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Health: కూర్చున్నప్పుడు కాళ్లు ఊపే అలవాటు మీకు ఎక్కువగా ఉందా..! ఈ చిట్కాలు పాటించండి.. !

Health: కొంతమందికి కొన్ని అలవాట్లు వాళ్ల జీవితంతో మర్చిపోలేరు. ఎంత ప్రయత్నించినా అవి మన నుంచి దూరం కావు. మరి కొన్ని అయితే ఎవరు చెప్పినా వినకుండా.. వాటిని ఫాలో అవుతూ ఉంటారు. ఇదే దినచర్యలో ఒక ప్రక్రియగా మారిపోతుంది.

Health: కూర్చున్నప్పుడు కాళ్లు ఊపే అలవాటు మీకు ఎక్కువగా ఉందా..! ఈ చిట్కాలు పాటించండి.. !

అలాంటి వాటిళ్లో ఒకటి కూర్చున్న సమయంలో.. పడుకునే సమయంలో కాళ్లు ఊపడం. అయితే ఇలా చేయడం మంచిదేనా.. ఆ అలవాటు ఎందుకు వస్తుందో తెలుసుకుందాం.. కూర్చొని స్నేహితులుతో మాట్లాడుతున్న సమయంలో.. ఫోన్ ను అదేపనిగా చేస్తున్న సమయంలో కొంత మంది కాళ్లు ఊపుతారు.

Health: కూర్చున్నప్పుడు కాళ్లు ఊపే అలవాటు మీకు ఎక్కువగా ఉందా..! ఈ చిట్కాలు పాటించండి.. !

ఇలా చేయడం అనేవి.. ఆందోళన, పని ఒత్తిడికి కారకాలుగా నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ పని చేస్తున్న సమయంలో ఇంట్లోని ఎవరైనా చూసి అలా చేయడం మంచిది కాదని చెప్పినా వారి మాట వినరు. వారి మాటలు పెడచెవిన పెడతారు.

అరటిపండ్లు, బీట్ రూట్ వంటి వాటిని..

ఇక నిద్ర సరిగ్గా పట్టకపోవడం.. హర్మోన్ల సమతుల్యత కారణంగా ఇలా జరుగుతందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే వాటికి ఎలా చెక్ పెట్టొచ్చంటే.. ముందుగా వైద్యులను సంప్రదించి ఐరన్ మాత్రలు వేసుకోవాలని సలహా ఇస్తున్నారు. అంతే కాదు.. అరటిపండ్లు, బీట్ రూట్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలట. టీ, కాఫీలు ఎక్కువగా అలవాటు చేసుకుంటే మంచిదని.. ఉదయం కన్నా రాత్రి ఎక్కువగా నిద్రపోయే సమయంలో ఫోన్ అస్సలు చూడకూడదంటున్నారు. సాధ్యమైనంతగా.. టీవీ, ఫోన్ చూడటం తగ్గిస్తే మంచిది. ఈ చిట్కాలు పాటిస్తే కాళ్లు ఊపే అలవాటు తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు.

Hot Water: వేడి నీరు తాగే అలవాటు ఉందా..? అయితే ఈ 5 ప్రయోజనాల గురించి తెలుసుకోండి..

Hot Water: ప్రాణకోటికి నీరే జీవనాధారం అలాంటి నీరు తాగితేనే శరీర క్రియలు సక్రమంగా జరుగుతాయి. ఇది జీవక్రియలను మెరుగు పరచడం కాకుండా శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. శరీరంలోని మలినాలను బయటికి పంపించేస్తుంది. సాధారణంగా ప్రజలు ఉదయాన్నే లేవగానే వేడి నీరు తాగడం మనం చూస్తూనే ఉంటాం. ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే రాత్రిపూట కూడా వేడి నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Hot Water: వేడి నీరు తాగే అలవాటు ఉందా..? అయితే ఈ 5 ప్రయోజనాల గురించి తెలుసుకోండి..

ముఖ్యంగా రాత్రి పూట వేడి నీళ్లు తాగడం వల్ల 5 ప్రయోజనాలు ఉన్నాయి.

జీవక్రియలను మెరుగుపరుస్తుంది..
వేడి నీళ్లు తాగడం వల్ల జీవక్రియను వేగవంతం అవుతాయి. బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. సాధారణంగా వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని కొవ్వు అణువులు విచ్ఛిన్నమై బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. రాత్రిపూట అన్నం తిన్న తర్వాత ఒక గ్లాసు వేడినీరు తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయి.

Hot Water: వేడి నీరు తాగే అలవాటు ఉందా..? అయితే ఈ 5 ప్రయోజనాల గురించి తెలుసుకోండి..

మానసిక స్థితి మెరుగుదల..
రాత్రిపూట గోరువెచ్చని నీరు తాగడం వల్ల మానసిక స్థితి సరిగా ఉంటుంది. శరీరంలో నీటి శాతం తక్కువ అయితే మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా ఎక్కువ నీరు తాగే వారి మానసిక స్థితి బాగుంటుంది. భోజనం చేసిన తర్వాత వేడి నీళ్లు తాగడం వల్ల జీవక్రియ మెరుగవుతుంది. రక్తప్రవాహాన్ని పెంచడంతోపాటు కండరాల కదలికలకు శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోవడానికి మంచిగా ఉపయోగపడుతుంది.

అసిడిటీకి చెక్..
అదేవిధంగా రాత్రి పూట వేడి నీళ్లు తాగితే అసిడిటీ కూడా తగ్గుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

నిద్రలేమి దూరం..
నిద్రలేమితో బాధపడుతున్న వారు రాత్రిపూట పడుకునే ముందు ఓ గ్లాసు వేడి నీళ్లు తాగితే సమస్య దూరమవుతుంది వేడి నీళ్లు తాగడం వల్ల డిప్రెషన్ స్ట్రెస్ దూరంగా ఉంచుకోవచ్చు.

ఊబకాయం తగ్గించుకోవచ్చు..

ప్రస్తుతం ఉన్న కాలంలో అడ్డమైన జంక్ ఫుడ్ తినడం వల్ల బరువు పెరుగుతున్నారు దీని తగ్గించుకోవాలంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు వేడి నీటిని తీసుకుంటాయి శరీరంనుంచి కొవ్వులను తగ్గించుకోవచ్చు