Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పొందినటువంటి చిరంజీవి అనంతరం తన ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఒక్కొక్కరిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వచ్చారు. ఇలా మెగా కాంపౌండ్ నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఇకపోతే చిరంజీవి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్న సమయంలోనే పవన్ కళ్యాణ్ ఇంకా ఇండస్ట్రీలోకి రాలేదు. ఆ సమయంలో చిరంజీవి ఎక్కడికి వెళ్లినా కుటుంబ సభ్యులకు వివిధ రకాల వస్తువులను తీసుకొని వచ్చేవారట ఈ క్రమంలోనే తాను ఆ సినిమా షూటింగ్లో నిమిత్తం విదేశాలకు వెళ్ళినప్పుడు ఏదైనా కావాలా అంటూ పవన్ కళ్యాణ్ ని అడిగితే తాను మాత్రం డమ్మీ గన్నులు తీసుకొని రా అన్నయ్య అంటూ చెప్పే వారట.
ఇలా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం కావాలి అని అడిగిన తనకోసం గన్ తీసుకొని రా అని చెప్పడంతో ఒక్కసారిగా చిరంజీవిలో ఏదో తెలియని భయం మొదలైందని చిరు పలు సందర్భాలలో తెలియజేశారు. వీడు ఎక్కడికెళ్లిన గన్ను తీసుకొని రమ్మంటున్నారు ఏంటి కొంపతీసి వీడు నక్సలైట్లలోకి కనక కలిసిపోతాడా అనే భయం నాలో పట్టుకుందని చిరంజీవి తెలిపారు.
ప్రజలు మెచ్చిన నాయకుడు…
ఇలా గన్నులు అంటే ఎంతో ఇష్టం చూపడంతో తనకు భయం వేసిందని కానీ నక్సలైట్లలోకి వెళ్లిపోతాడు అనుకున్న తన తమ్ముడు కాస్త ప్రజలు మెచ్చిన నాయకుడు అవుతున్నారు అంటూ చిరంజీవి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…