Movie News

Uday Kiran: రీ రిలీజ్ కి సిద్ధమైన ఉదయ్ కిరణ్ సినిమాలు.. బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే?

Uday Kiran: టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ఒకరు. ఈయనకు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా చిత్రం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈ సినిమా తర్వాత నువ్వు నేను మనసంతా నువ్వే వంటి వరుస హిట్ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయారు. ఒక్కసారిగా ఉదయ్ కిరణ్ గురించి ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి. ఇలా స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి ఉదయ్ కిరణ్ కెరియర్ అమాంతం ఆగిపోయింది. అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు వెంటాడటంతో ఈయన ఆత్మహత్య చేసుకుని మరణించారు.

ఇలా ఉదయ్ కిరణ్ మరణించినప్పటికీ అభిమానులు ఇప్పటికీ ఈయనని మర్చిపోలేదని చెప్పాలి. ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ముఖ్యంగా ఈయన కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అయినటువంటి నువ్వు నేను మనసంతా నువ్వే చిత్రాలు ఎవర్ గ్రీన్ సినిమాలని చెప్పాలి. ఇక ఉదయ్ కిరణ్ మరణించిన తర్వాత మొదటిసారి ఆయన సినిమాలను తిరిగి థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్.

మనసంతా నువ్వే…
ఈ క్రమంలోనే తేజ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను విఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన మనసంతా నువ్వే సినిమాలను తిరిగి మార్చి ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ విడుదల విషయం గురించి ఇంకా అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక చాలా రోజుల తర్వాత ఉదయ్ కిరణ్ సినిమాలను తిరిగి థియేటర్లలో చూడబోతున్నామని తెలిసి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago