Tag Archives: hero sumanth

Hero Sumanth : కీర్తి నేను విడిపోవడానికి కారణం అదే.. హీరో సుమంత్ షాకింగ్ కామెంట్స్!

Hero Sumanth: అక్కినేని కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి వస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే అక్కినేని కుటుంబం నుంచి ఇప్పటికీ నలుగురు యంగ్ హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. ఇకపోతే వీరిలో సుమంత్ గురించి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈయన సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.

ఇకపోతే తాజాగా ఈయన తిరిగి ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు.సుమంత్ కెరీర్ మంచి పొజిషన్లో ఉన్న సమయంలో కీర్తి రెడ్డిని ప్రేమించి సుమంత్ ఎంతో ఘనంగా పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన రెండు సంవత్సరాలకి వీరిద్దరి మధ్య పలు మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. దీంతో సుమంత్ అప్పటినుంచి ఒంటరిగా గడుపుతుండగా, కీర్తి రెడ్డి మాత్రం తిరిగి మరో వివాహం చేసుకున్నారు.

Hero Sumanth: కీర్తి నేను విడిపోవడానికి కారణం అదే.. హీరో సుమంత్ షాకింగ్ కామెంట్స్!

ఈ క్రమంలోనే ఈ విషయం గురించి సుమంత్ స్పందిస్తూ కీర్తి రెడ్డితో విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటో బయటపెట్టారు. కీర్తి రెడ్డి తాను పెళ్లి కాకముందు మంచి స్నేహితులమని, ఇద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని తెలిపారు. అయితే ఒక జంట విడాకులు తీసుకున్నారు అంటే అది ఇద్దరి వైపుల నుంచి మనస్పర్ధలు ఉంటేనే విడాకుల వరకు వెళ్తాయని సుమంత్ తెలిపారు.

Hero Sumanth: కీర్తి నేను విడిపోవడానికి కారణం అదే.. హీరో సుమంత్ షాకింగ్ కామెంట్స్!

ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉంది..

స్నేహితులుగా మాఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది కాని, భార్యాభర్తలుగా మా ఇద్దరి మధ్య రిలేషన్ వర్కవుట్ కాలేదని అందుకే విడాకులు తీసుకున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు.తనకి నేను విడాకులు ఇచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా తను నాతో మంచి స్నేహితురాలిగా ఉంటుంది. ప్రస్తుతం తను తిరిగి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తన జీవితం ఎంతో ఆనందంగా ఉందని తన కుటుంబం కూడా నన్ను తన ఫ్యామిలీ మెంబర్ గా చూస్తారని ఈ సందర్భంగా సుమంత్ కీర్తి రెడ్డి గురించి తెలియచేశారు.

Hero Sumanth: అక్కినేని ఫ్యామిలీలో విడాకులపై సుమంత్ సంచలన వ్యాఖ్యలు.. !

Hero Sumanth: సుమంత్.. అక్కినేని బ్రాండ్ ఇమేజ్ తో నాగేశ్వర్ రావు మనవడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా.. అనుకున్నంతగా స్టార్ ఇమేజ్ రాలేదు. ప్రేమకథ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, యువకుడు మూవీతో మెప్పించినా..గౌరీ తో హిట్ కోట్టినా.. స్టార్ స్టేటస్ రాలేదు.

Hero Sumanth: అక్కినేని ఫ్యామిలీలో విడాకులపై సుమంత్ సంచలన వ్యాఖ్యలు.. !

ఆ తరువాత కెరీర్ లో ఓడిదుడుకులు ఎదుర్కొన్నాడు. వరసగా ఫ్లాప్ సినిమాలు పలకరించడంతో అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా సుమంత్ విడాకులు గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. తనూ హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఆతరువాత విడాకులు తీసుకున్నాడు.
ప్రస్తుతం కీర్తి రెడ్డి రెండో పెళ్లి చేసుకుని కెరీర్ లో సెటిల్ అయిపోయింది. అయితే సుమంత్ మాత్రం ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్నాడు. ప్రస్తుతం విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయిందంటూ … వ్యాఖ్యానించాడు.

Hero Sumanth: అక్కినేని ఫ్యామిలీలో విడాకులపై సుమంత్ సంచలన వ్యాఖ్యలు.. !

రెండో పెళ్లి చేసుకున్న వారు కూడా..

నాకు తెలిసిన చాలా మంది విడాకులు తీసుకున్నారన… నా ఫ్యామిలీలో కూడా విడాకులు ఉన్నాయన్నాడు. ఆ తరువాత రెండో పెళ్లి చేసుకున్న వారు కూడా కష్టాలను ఎదుర్కొంటున్నారని.. అయితే రెండో పెళ్లి కూడా ఫెయిల్ అయితే..బ్యాడ్ ఇమేజ్ వస్తుందని దీంతో ఎలాగొలా నెట్టుకొస్తున్నారంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.  ప్రస్తుతం సుమంత్ ‘ మళ్లీ మొదలైంది’ సినిమాలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈనెల 11న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో సుమంత్ పక్కన నైనా గంగూలీ, వర్షిణి నటిస్తున్నారు. తన భార్యతో విడాకులు తీసుకునే సమయంలో ఓ లేడీ లాయర్ ప్రేమలో పడే క్యారెక్టర్ లో సుమంత్ నటిస్తున్నాడు. ఈసినిమాకు కీర్తి కుమార్ దర్శకత్వం వహించగా… ఈడీ ఎంటర్టైన్మెంట్ పై రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ మ్యూిజిక్ అందించాడు.