Hero Sumanth: అక్కినేని ఫ్యామిలీలో విడాకులపై సుమంత్ సంచలన వ్యాఖ్యలు.. !
Hero Sumanth: సుమంత్.. అక్కినేని బ్రాండ్ ఇమేజ్ తో నాగేశ్వర్ రావు మనవడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా.. అనుకున్నంతగా స్టార్ ఇమేజ్ రాలేదు. ప్రేమకథ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, యువకుడు మూవీతో మెప్పించినా..గౌరీ తో హిట్ కోట్టినా.. స్టార్ స్టేటస్ రాలేదు.
ఆ తరువాత కెరీర్ లో ఓడిదుడుకులు ఎదుర్కొన్నాడు. వరసగా ఫ్లాప్ సినిమాలు పలకరించడంతో అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా సుమంత్ విడాకులు గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు. తనూ హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఆతరువాత విడాకులు తీసుకున్నాడు.
ప్రస్తుతం కీర్తి రెడ్డి రెండో పెళ్లి చేసుకుని కెరీర్ లో సెటిల్ అయిపోయింది. అయితే సుమంత్ మాత్రం ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్నాడు. ప్రస్తుతం విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయిందంటూ … వ్యాఖ్యానించాడు.
నాకు తెలిసిన చాలా మంది విడాకులు తీసుకున్నారన… నా ఫ్యామిలీలో కూడా విడాకులు ఉన్నాయన్నాడు. ఆ తరువాత రెండో పెళ్లి చేసుకున్న వారు కూడా కష్టాలను ఎదుర్కొంటున్నారని.. అయితే రెండో పెళ్లి కూడా ఫెయిల్ అయితే..బ్యాడ్ ఇమేజ్ వస్తుందని దీంతో ఎలాగొలా నెట్టుకొస్తున్నారంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం సుమంత్ ‘ మళ్లీ మొదలైంది’ సినిమాలో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈనెల 11న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో సుమంత్ పక్కన నైనా గంగూలీ, వర్షిణి నటిస్తున్నారు. తన భార్యతో విడాకులు తీసుకునే సమయంలో ఓ లేడీ లాయర్ ప్రేమలో పడే క్యారెక్టర్ లో సుమంత్ నటిస్తున్నాడు. ఈసినిమాకు కీర్తి కుమార్ దర్శకత్వం వహించగా… ఈడీ ఎంటర్టైన్మెంట్ పై రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ మ్యూిజిక్ అందించాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…