Featured

Abbas : డైరెక్టర్ శంకర్ పిలిచి ఆఫర్ ఇస్తే.. ఆ హీరో అక్కర్లేదని చెప్పాడు..! కట్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్..!

Director Shankar: సౌత్ క్రేజీ డైరెక్టర్ శంకర్ తో సినిమా అంటే ఏ హీరో అయినా ఎగిరిగంతేస్తారు. శంకర్ తో ఒక సినిమా చేయాలని ప్రతీ హీరో అనుకుంటారు. జెంటిల్ మెన్ తో మొదలైన శంకర్ సినిమాల పరంపర రోబో దాకా సాగింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు.

Director Shankar: డైరెక్టర్ శంకర్ పిలిచి ఆఫర్ ఇస్తే.. ఆ హీరో వద్దని చెప్పాడు..! కట్ చేస్తే బంపర్ హిట్..!

అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు చేస్తాడని…తన సినిమాలో కొత్త కొత్త టెక్నాలజీ వాడుతాడని శంకర్ కు పేరుంది. తను సినిమాలు కూడా బడ్జెట్ కు తగ్గట్టుగానే భారీ వసూళ్లు వసూలు చేశాయి. అంతటి శంకర్ పిలిచి సినిమా చేస్తా అంటే..ఏ హీరో కాదనడు కానీ ఓ హీరో మాత్రం శంకర్ తో సినిమాతో చేయడానికి సిద్దపడలేదు.

Director Shankar: డైరెక్టర్ శంకర్ పిలిచి ఆఫర్ ఇస్తే.. ఆ హీరో వద్దని చెప్పాడు..! కట్ చేస్తే బంపర్ హిట్..!

అతనెవరో కాదు ‘అబ్బాస్’. ‘ప్రేమదేశం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ సినిమా అటు తమిళం, ఇటు తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది. 90 ల్లో ప్రేమ దేశం మానియా లేని యూత్ లేదంటే అతిశయోక్తి కాదు. అంతలా పేరు తెచ్చుకుంది.


అజిత్ వద్దకు వెళ్లిన ఈ కథ..

ఈ సినిమాలోని ‘ముస్తాఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తాఫా’ అప్పట్లో ఎంతో సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఆ తరువాత వరసగా అబ్బాస్ కు సినిమా ఆఫర్లు వచ్చాయి. ఇదిలా ఉంటే భారతీయుడు తీసిని తర్వాత శంకర్ సినిమాలు పెద్దగా ఆడింది లేదు. ఈ క్రమంలోనే ‘జీన్స్’ సినిమా కథ శంకర్ సిద్దం చేసుకున్నాడు. ఈ సినిమాకు ముందుగా అబ్బాస్ ను అనుకున్న శంకర్..కథను వినిపించాడు. అప్పటికి భారతీయుడు తప్పితే పెద్దగా హిట్ లేని శంకర్ తో సినిమా చేసేందుకు అబ్బాస్ నిరాకరించాడు. మరోవైపు ప్రేమదేశం హిట్ తో వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉండటం కాల్షీట్లు సర్ధుబాటు కాకపోవడం కూడా ఇందుకు కారణమైంది. ఆతరువాత అజిత్ వద్దకు వెళ్లిన ఈ కథ.. కాల్షీట్ల కారణంగా చేయలేకపోయాడు. చివరకు ప్రశాంత్ కు కథ వినిపిస్తే ఓకే చేశాడు. అప్పటికే ప్రేమికుడు, ప్రేమదేశం ఆఫర్లు మిస్ చేసుకున్న ప్రశాంత్ శంకర్ జీన్స్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో ఒకే అమ్మాయిని ఇద్దరు అన్నదమ్ములు ప్రేమించడం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఐశ్వర్యారాయ్ హీరోయిన్ గా చేసింది. ఈసినిమా తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago