Director Shankar: సౌత్ క్రేజీ డైరెక్టర్ శంకర్ తో సినిమా అంటే ఏ హీరో అయినా ఎగిరిగంతేస్తారు. శంకర్ తో ఒక సినిమా చేయాలని ప్రతీ హీరో అనుకుంటారు. జెంటిల్ మెన్ తో మొదలైన శంకర్ సినిమాల పరంపర రోబో దాకా సాగింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు.

అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు చేస్తాడని…తన సినిమాలో కొత్త కొత్త టెక్నాలజీ వాడుతాడని శంకర్ కు పేరుంది. తను సినిమాలు కూడా బడ్జెట్ కు తగ్గట్టుగానే భారీ వసూళ్లు వసూలు చేశాయి. అంతటి శంకర్ పిలిచి సినిమా చేస్తా అంటే..ఏ హీరో కాదనడు కానీ ఓ హీరో మాత్రం శంకర్ తో సినిమాతో చేయడానికి సిద్దపడలేదు.

అతనెవరో కాదు ‘అబ్బాస్’. ‘ప్రేమదేశం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ సినిమా అటు తమిళం, ఇటు తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది. 90 ల్లో ప్రేమ దేశం మానియా లేని యూత్ లేదంటే అతిశయోక్తి కాదు. అంతలా పేరు తెచ్చుకుంది.

అజిత్ వద్దకు వెళ్లిన ఈ కథ..
ఈ సినిమాలోని ‘ముస్తాఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తాఫా’ అప్పట్లో ఎంతో సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఆ తరువాత వరసగా అబ్బాస్ కు సినిమా ఆఫర్లు వచ్చాయి. ఇదిలా ఉంటే భారతీయుడు తీసిని తర్వాత శంకర్ సినిమాలు పెద్దగా ఆడింది లేదు. ఈ క్రమంలోనే ‘జీన్స్’ సినిమా కథ శంకర్ సిద్దం చేసుకున్నాడు. ఈ సినిమాకు ముందుగా అబ్బాస్ ను అనుకున్న శంకర్..కథను వినిపించాడు. అప్పటికి భారతీయుడు తప్పితే పెద్దగా హిట్ లేని శంకర్ తో సినిమా చేసేందుకు అబ్బాస్ నిరాకరించాడు. మరోవైపు ప్రేమదేశం హిట్ తో వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉండటం కాల్షీట్లు సర్ధుబాటు కాకపోవడం కూడా ఇందుకు కారణమైంది. ఆతరువాత అజిత్ వద్దకు వెళ్లిన ఈ కథ.. కాల్షీట్ల కారణంగా చేయలేకపోయాడు. చివరకు ప్రశాంత్ కు కథ వినిపిస్తే ఓకే చేశాడు. అప్పటికే ప్రేమికుడు, ప్రేమదేశం ఆఫర్లు మిస్ చేసుకున్న ప్రశాంత్ శంకర్ జీన్స్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో ఒకే అమ్మాయిని ఇద్దరు అన్నదమ్ములు ప్రేమించడం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఐశ్వర్యారాయ్ హీరోయిన్ గా చేసింది. ఈసినిమా తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది.































