Tag Archives: high earnings

Ariyana Glory: బిగ్ బాస్ బ్యూటీ ఆరీయానా సంపాదన తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Ariyana Glory: సోషల్ మీడియా వేదికగా ఎంతో గుర్తింపు సంపాదించుకొని సెలబ్రిటీలుగా మారిపోయిన వారిలో బిగ్ బాస్ ముద్దుగుమ్మ ఆరీయానా ఒకరు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకుని ఏకంగా రెండుసార్లు బిగ్ బాస్ అవకాశాన్ని అందుకోవడమే కాకుండా ఒకసారి బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి హోస్ట్ గా కూడా వ్యవహరించారు.

ప్రస్తుతం బీబీ కేఫ్ ద్వారా మరోసారి అభిమానులను సందడి చేస్తున్నారు. అదేవిధంగా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేయడం వల్ల ఆరీయానా భారీగా సంపాదిస్తున్నారని చెప్పాలి. ఇక సోషల్ మీడియా వేదికగా ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొత్తానికి ఒకప్పటి కంటే ప్రస్తుతం ఈమె భారీగానే సంపాదిస్తుందని తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈమె బి బి కేఫ్ ద్వారా భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఒకరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈమె 60 వేల నుంచి లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం ఇది కాకుండా ఇతర కార్యక్రమాలు అలాగే ఇంస్టాగ్రామ్ పోస్టుల ద్వారా కూడా ఈమె భారీగానే సంపాదిస్తుందని తెలుస్తోంది.

Ariyana Glory: భారీగా పెరిగిన సంపాదన..


ఇలా వరుస కార్యక్రమాలతో పాటు యూట్యూబ్ ఛానల్స్ ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా కూడా పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. మొత్తానికి ఆరీయానా నెలకు సుమారు రెండు లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆరీయానా సంపాదన రెండింతలు పెరిగిందని తెలుస్తోంది.

అదిరిపోయే బిజినెస్ ఐడియా.. తక్కువ పెట్టుబడితో రూ.2 లక్షలు సంపాదించే ఛాన్స్..?

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల దేశంలో కొన్ని కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఉపాధి లేక సొంతూళ్లకు వచ్చి ఆదాయం లేకపోవడం వల్ల చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. చాలామందికి వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నా రోజురోజుకు పెరుగుతున్న ఖర్చుల వల్ల వ్యాపారం చేయాలంటే టెన్షన్ పడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఒక బిజినెస్ ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం సులభంగా సంపాదించవచ్చు.

రోజురోజుకు మార్కెట్ లో పుట్టగొడుగులకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. పోషకాలు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మార్కెట్ లో కూడా పుట్టగొడుగులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇంటి దగ్గరే సులువుగా పుట్టగొడుగులను పెంచి ఆదాయం పొందవచ్చు. మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉండే పుట్టగొడుగులు కిలో 200 రూపాయల నుంచి 300 రూపాయల వరకు ధర పలుకుతాయి.

మనకు శరీరానికి అవసరమైన విటమిన్లు అన్నీ పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉంటాయి. కంపోస్ట్ సహాయంతో ఇంటి దగ్గరే సులభంగా పుట్టగొడుగులను పెంచడం సాధ్యమవుతుంది. క్వింటాల్ కంపోస్ట్ సహాయంతో సులువుగా కేజిన్నర పుట్టగొడుగులను పెంచవచ్చు. కేజీ 120 నుంచి 170 మధ్య అమ్మినా పెట్టుబడి పోతే రెండు లక్షల రూపాయల నుంచి రెండున్నర లక్షల రూపాయలు మిగులుతుంది.

ట్రేలలో సాగు చేసే పుట్టగొడుల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ఆసక్తి ఉన్నవాళ్లు ఈ వ్యాపారం చేయడం ద్వారా తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో కళ్లు చెదిరే లాభాలను పొందే అవకాశం ఉంటుంది.