Tag Archives: bigg boss beauty

Pooja Ramachandran: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ… ఫోటో వైరల్..?

Pooja Ramachandran: నిఖిల్ హీరోగా నటించిన స్వామి రారా సినిమాలో నిఖిల్ స్నేహితురాలు పాత్రలో నటించిన పూజ రామచంద్రన్ ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత త్రిపుర, దోచేయ్, వెంకీ మామ, కాంచన 2 వంటి సినిమాలలో కీలకపాత్రలలో నటించింది. ఇక తమిళ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న పూజా రామచంద్రన్ కి ఆ షో ద్వారా మంచి గుర్తింపు లభించింది.

ఆ తర్వాత ప్రముఖ నటుడు జాన్ కొక్కెన్ ని వివాహం చేసుకుంది. వీరసింహారెడ్డి, కేజిఎఫ్, కబ్జా, వంటి పలు సినిమాలలో జాన్ కొక్కేన్ విలన్ గా నటించి మెప్పించాడు..ఇదిలా ఉండగా పూజ రామచంద్రన్ తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు ఆమె భర్త జాన్ కొక్కెన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.జాన్ కొక్కెన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటాడు.

ఈ క్రమంలో భార్య సీమంతం వేడుకలకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో ఇటీవల షేర్ చేశాడు. ఇక తాజాగా పూజా రామచంద్రన్ మగ బిడ్డకు జన్మనివ్వటంతో ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ బాబు వేలిని పట్టుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Pooja Ramachandran: కొడుకు పుట్టిన సంతోషంలో పూజ రామచంద్రన్.

దీంతో స్నేహితులు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం జాన్ కొక్కేన్ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో తన పట్ల ప్రేమ , అభిమానం చుపినందుకు జాన్ కొక్కెన్ కూడా అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశాడు.

Ariyana Glory: బిగ్ బాస్ బ్యూటీ ఆరీయానా సంపాదన తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Ariyana Glory: సోషల్ మీడియా వేదికగా ఎంతో గుర్తింపు సంపాదించుకొని సెలబ్రిటీలుగా మారిపోయిన వారిలో బిగ్ బాస్ ముద్దుగుమ్మ ఆరీయానా ఒకరు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకుని ఏకంగా రెండుసార్లు బిగ్ బాస్ అవకాశాన్ని అందుకోవడమే కాకుండా ఒకసారి బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి హోస్ట్ గా కూడా వ్యవహరించారు.

ప్రస్తుతం బీబీ కేఫ్ ద్వారా మరోసారి అభిమానులను సందడి చేస్తున్నారు. అదేవిధంగా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేయడం వల్ల ఆరీయానా భారీగా సంపాదిస్తున్నారని చెప్పాలి. ఇక సోషల్ మీడియా వేదికగా ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొత్తానికి ఒకప్పటి కంటే ప్రస్తుతం ఈమె భారీగానే సంపాదిస్తుందని తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈమె బి బి కేఫ్ ద్వారా భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఒకరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈమె 60 వేల నుంచి లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం ఇది కాకుండా ఇతర కార్యక్రమాలు అలాగే ఇంస్టాగ్రామ్ పోస్టుల ద్వారా కూడా ఈమె భారీగానే సంపాదిస్తుందని తెలుస్తోంది.

Ariyana Glory: భారీగా పెరిగిన సంపాదన..


ఇలా వరుస కార్యక్రమాలతో పాటు యూట్యూబ్ ఛానల్స్ ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా కూడా పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. మొత్తానికి ఆరీయానా నెలకు సుమారు రెండు లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆరీయానా సంపాదన రెండింతలు పెరిగిందని తెలుస్తోంది.

Bhanu sree: ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడబోతున్న బిగ్ బాస్ బ్యూటీ భాను శ్రీ.. వైరల్ అవుతున్న న్యూస్!

Bhanu sree: ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది మూడుముళ్ల బంధంతో ఒకటి కాగా తాజాగా బిగ్ బాస్ బ్యూటీ భాను శ్రీ సైతం పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమైందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈమె పెళ్లికి సంబంధించిన ఈ వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

భాను శ్రీ కెరియర్ మొదట్లో యాంకర్ గా అనంతరం పలు సీరియల్స్ లోను పలు బుల్లితెర కార్యక్రమాలలోనూ పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇలా సినిమాలు సీరియల్స్ లో నటించిన రాని గుర్తింపు ఈమెకు బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా వచ్చిందని చెప్పాలి. ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా మంచి గుర్తింపు పొందిన ఈమె అనంతరం బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె పెళ్లి చేసుకోబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భాను శ్రీ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు అని పెద్ద ఎత్తున అభిమానులు ఆరా తీస్తున్నారు.అయితే ఈమె ప్రేమించిన తన స్నేహితుడిని వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది.గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భాను శ్రీ తన స్నేహితుడి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.

Bhanu sree: స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతున్న భాను శ్రీ…

ఈ సందర్భంగా భాను శ్రీ మాట్లాడుతూ తాను ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు గల కారణం తన స్నేహితుడని అతనిని తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అంటూ తన స్నేహితుని గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే అతనితోనే ప్రేమలో పడిన భాను శ్రీ తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్టు వార్తలు వినపడుతున్నాయి. మరి ఈమె పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ!

బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ లలో ఒకరైనా పునర్నవి, బిగ్ బాస్ ద్వారా ఎంతో పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు ఉయ్యాల జంపాల సినిమాలో కనిపించిన పునర్నవి తర్వాత సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత పునర్నవి, బిగ్ బాస్ మరో కంటెస్టెంట్, బిగ్ బాస్ సీజన్ 3 విజేత అయిన రాహుల్ తో ప్రేమ ప్రయాణం కొనసాగించిదో అప్పటి నుంచి ఈమె ఎంతో పాపులర్ అయ్యారు.

పునర్నవి, రాహుల్ ప్రేమ గురించి అప్పట్లో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పాపులర్ అయింది. బిగ్ బాస్ తర్వాత ప్రస్తుతం పునర్నవి వెబ్ సిరీస్ లో నటిస్తూ తన అందంతో అందరికీ మతి పోగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ల ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న పునర్నవి తాజాగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలోని ఓ నెటిజన్ పునర్నవిని మీ న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేయాలనే ప్రశ్నను వేసాడు.ఆ నెటిజెన్ వేసిన ప్రశ్నకు పునర్నవి తనదైన శైలిలో స్పందించారు.

ఆ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానానికి బదులుగా తన చేతి వేళ్ళలో మధ్యవేలును చూపించి అతనికి సమాధానం తెలిపింది. ఈ వేలు ద్వారా రాయకుదని పదానికి అర్థం వచ్చే విధంగా సిగ్నల్ చేస్తూ ఆ నెటిజెన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన సదరు నెటిజన్లు పునర్నవికి ఎక్కడ, ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో బాగా తెలుసు, అంతేకాకుండా ఎక్కడికక్కడ తెగ కొట్టడంలో పునర్నవి స్టైలే వేరంటూ ఆమె పై సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.