Tag Archives: ariyana glory

Ariyana Glory: తీవ్ర గాయాలపాలైన అరియానా… అవినాష్ కారణమంటూ షాకింగ్ కామెంట్స్!

Ariyana Glory: అరియానా పరిచయం అవసరం లేని పేరు. కెరియర్ మొదట్లో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసినటువంటి ఈమె ప్రస్తుతం సెలెబ్రెటీగా మారిపోయారు. ఎంతోమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసినటువంటి అరియానా సంచలనాత్మక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ కారణంగా ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు.

ఈ బోల్డ్ ఇంటర్వ్యూలో వీరిద్దరూ ఏ మాత్రం తగ్గకుండా చేసినటువంటి ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈమె ఫేమస్ కావడంతో ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో కూడా తనెంటో ప్రూఫ్ చేసుకోవడంతో ఈమెకు మరింత మంది అభిమానులుగా మారిపోయారు. ఇలా రోజురోజుకు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి అరియానా ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాలతోనూ సినిమాలతోనూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్లతో కలిసి స్టార్ మా నిర్వహిస్తున్నటువంటి బిబి జోడి కార్యక్రమంలో భాగంగా ఈమె ముక్కు అవినాష్ తో కలిసి సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ పర్ఫార్మ్ చేస్తున్న క్రమంలో ముక్కు అవినాష్ కారణంగా తన చేతికి గాయం తగిలిందని ఆ గాయాన్ని చూపిస్తూ అరియానా చేసినటువంటి ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Ariyana Glory: పక్క వారి గురించి కూడా పట్టించుకోండి..

ఈ విషయంపై స్పందించిన అరియానా మిస్టర్ ముక్కు అవినాష్ గారు చూడండి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మీ పక్క ఉన్న వారి గురించి కూడా కాస్త పట్టించుకోండి మీరు 100% ఫర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే అవతలి వాళ్లు ఎలా బలవుతారో కాస్త చూడండి. మీ పర్ఫామెన్స్ కారణంగా నా చేతికి దెబ్బ తగిలి ఎలా కమిలిపోయిందో చూడండి దీనిని నేను ఖండిస్తున్నాను అవినాష్ గారు అంటూ ఈ సందర్భంగా ఇమేజ్ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Ariyana Glory: బిగ్ బాస్ బ్యూటీ ఆరీయానా సంపాదన తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Ariyana Glory: సోషల్ మీడియా వేదికగా ఎంతో గుర్తింపు సంపాదించుకొని సెలబ్రిటీలుగా మారిపోయిన వారిలో బిగ్ బాస్ ముద్దుగుమ్మ ఆరీయానా ఒకరు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకుని ఏకంగా రెండుసార్లు బిగ్ బాస్ అవకాశాన్ని అందుకోవడమే కాకుండా ఒకసారి బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి హోస్ట్ గా కూడా వ్యవహరించారు.

ప్రస్తుతం బీబీ కేఫ్ ద్వారా మరోసారి అభిమానులను సందడి చేస్తున్నారు. అదేవిధంగా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేయడం వల్ల ఆరీయానా భారీగా సంపాదిస్తున్నారని చెప్పాలి. ఇక సోషల్ మీడియా వేదికగా ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మొత్తానికి ఒకప్పటి కంటే ప్రస్తుతం ఈమె భారీగానే సంపాదిస్తుందని తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈమె బి బి కేఫ్ ద్వారా భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఒకరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈమె 60 వేల నుంచి లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం ఇది కాకుండా ఇతర కార్యక్రమాలు అలాగే ఇంస్టాగ్రామ్ పోస్టుల ద్వారా కూడా ఈమె భారీగానే సంపాదిస్తుందని తెలుస్తోంది.

Ariyana Glory: భారీగా పెరిగిన సంపాదన..


ఇలా వరుస కార్యక్రమాలతో పాటు యూట్యూబ్ ఛానల్స్ ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా కూడా పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. మొత్తానికి ఆరీయానా నెలకు సుమారు రెండు లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆరీయానా సంపాదన రెండింతలు పెరిగిందని తెలుస్తోంది.

Ariyana Glory: బావను ఆ స్థితిలో చూసే సరికి గుండె ముక్కలైంది: అరియానా

Ariyana Glory: తెలుగు బిగ్ బాస్ ఓటీటీలో ప్రసారం అవుతున్న షో రోజు రోజుకీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. విభిన్న టాస్క్ లతో పాటు, కంటెస్టంట్స్ గొడవలు, చిలిపి పనులతో ప్రేక్షకులను కట్టి పడేస్తున్నారు. ప్రతీ సీజన్ లో ఇప్పటి వరకు ది మోస్ట్ బెస్ట్ ఆర్ వరెస్ట్ మూమెంట్స్ చెప్పుకునే అవకాశాన్ని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇస్తారు. అలాగే ఈ సీజన్ లోనూ వారి ఇన్నర్ ఫీలింగ్స్ ను చెప్పుకునే అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్. అందులో భాగంగా ఒక్కో కంటెస్టంట్ తమ తమ భావాలను వెల్లడించారు.

Ariyana Glory: బావను ఆ స్థితిలో చూసే సరికి గుండె ముక్కలైంది: అరియానా

ఆ క్రమంలోనే అరియనా గ్లోరీ కూడా తన మనసులో ఇన్నాళ్లూ దాచుకున్న బాధను తెలుగు సినీ ప్రేక్షకుల ముందు చెప్పుకుని బోరున విలపించింది. అది తనకు, తన బావకు మధ్య సంఘటన అంటూ మొదలు పెట్టిన అరియానా, చిన్న తనంలోనే తండ్రి ప్రేమకు దూరమయ్యానని చెప్పుకొచ్చింది. తొమ్మిదో తరగతిలో తన బావతో ప్రేమాయణం మొదలైందని, తన పట్ల చూపించే ప్రేమా, కేరింగ్ చూసి అతనిపై ప్రేమ క్రమేణా బలపడిందని అరియానా తెలిపింది. అతనికి డిగ్రీ అయిపోయాక ఉద్యోగం వచ్చిందని, ఆ తర్వాత తామిద్దరం హైదరాబాద్ లో కలిసి ఉన్నామని చెప్పింది. మూడు సంవత్సరాలు బాగానే గడిచినా, ఆ తర్వాత తన బావకు తాను బోర్ కొట్టేసానని చాలా లేట్ గా తెలుసుకున్నానంటూ వాపోయింది.

Ariyana Glory: బావను ఆ స్థితిలో చూసే సరికి గుండె ముక్కలైంది: అరియానా

ఒకానొక రోజు తన బావను చెప్పోకొలేని స్థితిలో, ఏ స్థితిలో చూడకూడదు అనుకున్నాననో అలా చూసి గుండె పగిలిపోయింది అంటూ అరియానా ఆవేధన వ్యక్తం చేసింది. కానీ మళ్ళీ అతను ఏదో సర్దిచెప్పే సరికి తానే కన్విన్స్ అయ్యి, మళ్ళీ అతనితో ఒక రెండు సంవత్సారాలు రిలేషన్షిప్ ను కంటిన్యూ చేశానని చెప్పింది.

ఎంతో అనుమానించాడు…

ఇలా రోజులు గడుస్తున్న క్రమంలోనే తనకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడని, కానీ తన బావ దాన్ని కూడా అనుమానించాడని అరియానా తెలిపింది. ఇక తాము ఇద్దరం కలిసి ఉండే ప్రసక్తి లేదని బ్రేకప్ చెప్పుకున్నామని ఆమె చెప్పింది. ఆ తర్వాత తాను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కూడా బావ తనకు గుర్తొచ్చే వాడని, తన తప్పు లేకపోయినా తనను క్షమించమని తప్పైపోయింది అని ఎంత బతిమాలినా అతను సర్దుకో లేదని అరియానా తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు.

Ariyana – Ashu Reddy: ఏందయ్యా ఈ ఛండాలం…. అరియాన నడుముకు ముద్దు పెట్టిన అషు రెడ్డి.. ఫోటోపై ట్రోల్స్!

Ariyana – Ashu Reddy: యూట్యూబ్ ఛానల్ యాంకర్లుగా, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అరియాన, అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మను బోల్డ్ ఇంటర్వ్యూ చేయడంతో వీరిద్దరికీ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

Ariyana – Ashu Reddy: ఏందయ్యా ఈ ఛండాలం…. అరియాన నడుముకు ముద్దు పెట్టిన అషు రెడ్డి.. ఫోటోపై ట్రోల్స్!

ఈ క్రమంలోనే వీరిద్దరు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలలో సందడి చేయడమే కాకుండా వెండితెరపై కూడా అవకాశాలను దక్కించుకుంటారు. ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఇద్దరు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటు ఉంటారు.

Ariyana – Ashu Reddy: ఏందయ్యా ఈ ఛండాలం…. అరియాన నడుముకు ముద్దు పెట్టిన అషు రెడ్డి.. ఫోటోపై ట్రోల్స్!

తాజాగా అరియనా ఒక బుల్లితెర కార్యక్రమంలో పాల్గొనగా ఇదే కార్యక్రమానికి అషు రెడ్డి కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అషు రెడ్డి అరీయాన నడుముకు ముద్దు పెడుతూ ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ ఫోటో పై స్పందిస్తూ ఏందయ్యా ఈ చండాలం అంటూ కామెంట్లు చేయగా… మరికొందరు ఏదో… తేడాగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటో వైరల్ గా మారింది.

తప్పుగా అనుకుంటారే…

అషు రెడ్డి షేర్ చేసిన ఈ ఫోటో పై ఆరియాన స్పందిస్తూ… నీకు నీ క్రేజీనెస్ కి దండం తల్లి.. జనాలు తప్పుగా అనుకుంటారే… జడ్జిమెంట్ అవుతున్నాం అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ కామెంట్ పై అషు రెడ్డి స్పందిస్తూ… జనాలు మంచిచెడులను జడ్జిమెంట్ చేస్తారు మనం వాటన్నింటిని వదిలేయాలి. ఇతరుల కన్నా మనం ప్రత్యేకంగా కనిపించాలనేది రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను అంటూ కామెంట్ చేశారు. మొత్తానికి ఈ ఫోటో వైరల్ గా మారింది.

Geetha Madhuri: తన రెండో పెగ్నేన్సీ గురించి క్లారిటీ ఇచ్చిన సింగర్ గీతా మాధురీ!

Geetha Madhuri: యూట్యూబ్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అరియానా ఇదే గుర్తింపుతో బిగ్ బాస్ అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇలా బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్న అరీయానా ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

Geetha Madhuri: తన రెండో పెగ్నేన్సీ గురించి క్లారిటీ ఇచ్చిన సింగర్ గీతా మాధురీ!

ఈ క్రమంలోనే సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా అరియానా వరుస సినిమాలు, షోలలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అరియానా ఓ ఫంక్షన్ లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా సింగర్ గీతామాధురి కూడా పాల్గొన్నారు. ఇలా గీత మాధురి అరియానా తనని పలకరిస్తూ తనని ఇంటర్వ్యూ చేశారు.

Geetha Madhuri: తన రెండో పెగ్నేన్సీ గురించి క్లారిటీ ఇచ్చిన సింగర్ గీతా మాధురీ!

గీతామాధురి మొహం లావుగా ఉబ్బి ఉండగా బుగ్గలు ఇలా ఉబ్బి ఉన్నాయి ఏంటని ప్రశ్నించారు. దీంతో ఐదు రోజుల నుంచి పది గంటల పాటు బాగా నిద్ర పోతున్నాను అందుకే నా బుగ్గలు ఉబ్బాయి. ఇవి తగ్గడానికి ఏదైనా సజెషన్ అంటే చెప్పండి అంటూ అడిగారు. దీంతో అరియానా అంతేనా ఏదైనా గుడ్ న్యూస్ ఉందా అంటూ ఇండైరెక్ట్గా తన ప్రెగ్నెన్సీ గురించి అడిగారు.

ఈ ప్రశ్నకు గీతమాధురి స్పందిస్తూ ఛీ అలాంటిదేమీ లేదు అంటూనే తన తప్పు మాట్లాడానని చెంపలు వేసుకుంది. ప్రస్తుతానికైతే ఎలాంటి గుడ్ న్యూస్ లేదు ఏ క్షణానైనా ఏమైనా జరగవచ్చు అని చెప్పగా ఆ క్షణానికి ముందుగానే కంగ్రాట్స్ అంటూ అరియానా చెప్పుకొచ్చారు. అంత వరకు వెయిట్ చేయండి ఏదైనా ఉంటే నేనే చెప్తాను. అలా ఏమైనా ఉంటే సిక్స్త్ లేదా సెవెంత్ మంత్ లో నేనే చెబుతా అంటూ గీత మాధురి చెప్పుకొచ్చారు.

తన ప్రెగ్నెన్సీ గురించి క్లారిటీ ఇచ్చిన గీతా మాధురి..

కాగా వీడియోలో అరియనా డబల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడగా.. తాజాగా అరియనా ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలిగించింది. ఇదే విషయంపై గీతా మాధురి ఇంస్టాగ్రామ్ లో క్లారిటీ ఇచ్చింది.. ఫన్నీగా చేస్తే ఇలా జరిగింది అంటూ క్లారిటీ ఇచ్చారు.. దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అరియానా గ్లోరీ పిచ్చెక్కించిందిగా.. వామ్మో.. సమంతను మించిపోయిందిగా!

అరియానా గ్లోరీ మొన్నటి వరకు ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ పుణ్యమా అని అందరికీ ఈ పేరు బాగానే పరిచయం అయింది. పైగా అందులో కాస్త ఎక్స్ ట్రాలు కూడా బాగానే చేస్తుందంటూ ఓవర్ యాక్షన్ అరియానా అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు కూడా.

ఈమె బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో పదో కంటెస్టెంట్‌గా యాంకర్‌ అరియానా గ్లోరీ అడుగు పెట్టి.. టాప్ 4 లో ఒక కంటెస్టెంట్ గా నిలిచారు. టెలివిజన్ యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన అరియానా 25 జ‌న‌వ‌రి 1993 హైదరాబాద్ లో జన్మించింది. 2015లో ఆమె యాంక‌ర్‌గా కెరీర్‌గా ప్రారంభించింది. ఆ త‌ర్వాత‌ ప‌లు టీవీ ఛానళ్ల‌లోనూ ఎన్నో కార్య‌క్ర‌మాల‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించింది.

జెమిని కెవ్వు కామెడీ యాంకర్‌గా అరియానా ఫేమస్‌ అయ్యారు. ఈమె పేరు ఎక్కువగా పాపులర్ అవ్వడానికి మరో కారణం కూడా ఉంది.. అదే రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ. బోల్డ్ యాంకర్ గా ఆ రోజు నుంచే పేరు తెచ్చుకున్నారు. ఇక తాజాగా పుష్ప సినిమాలో విడుదలైన ఐటెం సాంగ్ ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మామా పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇన్ స్టాగ్రామ్ లో అయితే చాలా మంది ఈ పాటపై రీల్స్ చేశారు. అందులో అరియాన గ్లోరీ కూడా ఒకరు. బీట్‌కి తగ్గట్లు రొమాంటిక్ మూమెంట్స్‌తో మత్తెక్కించింది అరియానా. ఇక ఆమె అందాల ఆరబోత అయితే పీక్స్ అని చెప్పుకోవాలి. ఈ వీడియోను ఆమె ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారిపోయింది. దీనిపై నెటిజన్లు వెరీ వెరీ హాట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా అరియనా ఈ సాంగ్ లో అందాలు ఆరబోసిందనే చెప్పాలి.

ఆహా.. ఫెమ్ వచ్చిందో లేదో అప్పుడే టి.ఆర్.ఎస్ ప్రభుత్వంపై సీరియస్ అవుతున్న అరియనా

బిగ్ బాస్ సీజన్ 4 లో అడుగుపెట్టకముందు ఆమె ఒక యాంకర్ గా ఓ ఛానల్ లో పనిచేసింది. అక్కడ రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ సంచలనంగా మారింది. దీంతో ఆమె బోల్డ్ ఉమెన్ గా పేరు తెచ్చుంకుంది. ఆ ఇంటర్వ్యూ ద్వారానే ‘అరియానా’ ఎక్కువగా పాలపులారిటీ తెచ్చుకుందని చెప్పవచ్చు. దాని కారణంగానే ఆమె బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టింది.

తర్వాత హౌస్ లో ఎన్నో గొడవలు, ఏడుపులతో టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరుగా నిలిచింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమెకు అవకాశాలు ఏమి తగ్గలేదు. రోజుకు రెండు ప్రోగ్రాంలో, మూడు ఇటర్వ్యూలు అన్నట్లు సాగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ బజ్ లో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేస్తోంది. దీనిలో కూడా ఆమె మంచి ప్రావీణ్యం సంపాదించిందనే చెప్పాలి. ఏదేనా ముక్కు సూటిగా ప్రశ్నించేతత్వం ఉన్న అరియానా.. ముక్కు అవినాష్ తో బాగా క్లోజ్ అయింది.

కాంట్రవర్సీలకు, వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్న అరియానా.. ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వంపై మండిపడింది. దానికి కారణం ఏంటంటే.. దానికి సంబంధించి ఓ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం మణికొండలో రహదారులు అత్యంత దారుణంగా ఉన్నాయని.. ఒక్క కిలోమీటర్ దూరం వెళ్లడానికి కొన్ని గంటల సమయం పడుతుందని.. తెలంగాణ ప్రభుత్వం, స్థానిక కార్పొరేటర్ ఏం చేస్తుంన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక్కడ ఇంత అధ్వాన్నంగా ఉన్న రోడ్లు మరెక్కడా ఉండవేమో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీస్ లకు, షూటింగ్ లకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారంటూ చెప్పింది. దయచేసి సమస్యను పరిష్కరించండి అంటూ వేడుకుంది. ఈ వీడియో వైరల్ గా మారింది.

మెగా కుటుంబంలో కలిసిపోయిన బిగ్ బాస్ ఆరియానా.. సెల్ఫీ వీడియోతో బయటపడిన సీక్రెట్స్!

బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా అత్యంత ప్రజాదరణ సంపాదించుకున్న వారిలో ఆరియానా ఒకరు. యూట్యూబ్ యాంకర్ గా పలువురితో ఇంటర్వ్యూలు నిర్వహించే ఆరియానా రామ్ గోపాల్ వర్మ తో ఇంటర్వ్యూ చేసింది.ఈ ఇంటర్వ్యూ తన జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అయ్యిందని చెప్పవచ్చు.ఈ ఇంటర్వ్యూ ద్వారా రాంగోపాల్ వర్మ చేసిన సంచలన వ్యాఖ్యలు ఆమెకు ఎంతో క్రేజ్ తెచ్చి పెట్టాయి.

ఈ క్రేజ్ వల్ల ఆరియానా ఏకంగా బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చింది.బిగ్ బాస్ హౌస్ లో ఎంతో చురుకుగా తన తెలివితేటలను ప్రదర్శించి పలు టాస్క్ లను పూర్తి చేసిన ఈ బ్యూటీకి విశేషమైన ప్రేక్షకాదరణ పెరిగింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమెకు పలు అవకాశాలు వెల్లువెత్తాయి.ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ లో పలు సినిమాలలో కీలక పాత్రలు దక్కించుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

కెరీర్ పరంగా బిజీగా ఉండటమే కాకుండా తనకు ఈ లైఫ్ ఇచ్చినటువంటి రాంగోపాల్ వర్మ మరోసారి ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉండగా ఆరియానా నిత్యం తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను మరింత సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆరియానా ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోలో తాను మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్నటువంటి సినిమాలో హీరో చెల్లెలు పాత్ర పోషిస్తున్నట్లు అసలు విషయాన్ని బయటపెట్టారు. అదే విధంగా ఈ వీడియోలో ఈ సినిమా దర్శకుడు శ్రీధర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆరియానా మాట్లాడుతూ ఈ సినిమాలో ఇంత మంచి అవకాశం తనకు కల్పించినందుకు డైరెక్టర్ శ్రీధర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ శ్రీధర్ కూడా ఆరియానా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తను ఏ పోస్ట్ పెట్టినా కూడా తన అభిమానులు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారంటూ ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీధర్ తెలియజేశారు.

ఇలాంటి విషయాలలో కాంప్రమైజ్ తప్పదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ?

గతంలో రామ్ గోపాల్ వర్మని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ అరియాన అతని ఇంటర్వ్యూ ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయింది. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ నువ్వంటే నాకిష్టం, నిన్ను బికినీలో చూడాలని ఉంది అంటూ కామెంట్లు చేయడంతో ఒక్కసారిగా ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. ఈ పాపులారిటీ ద్వారానే ఈ బ్యూటీ బిగ్ బాస్ లో అవకాశం దక్కించుకుంది.

బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిన అరియాన బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపును సంపాదించుకొని ఎన్నో అవకాశాలను దక్కించుకున్నారు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న అరియాన తాజాగా మరోసారి రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. గత కొన్ని రోజుల క్రితం రామ్ గోపాల్ వర్మతో కలిసి జిమ్ లో దిగిన హాట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ ఇంటర్వ్యూ పై ఆసక్తిని రేకెత్తించింది.

తాజాగా రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోను విడుదల చేయగా ఈ వీడియో చూసిన నెటిజన్లు వీరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ పై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అరియాన స్పందించారు. రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేయడం నాకు ప్లస్ అవుతుందేమో కానీ.. ఆయనకు మామూలే అంటూ ఒక మాటలో చెప్పేశారు.

అదేవిధంగా ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరూ బోల్డ్ ఇంటర్వ్యూ అని చెబుతున్నారు. అసలు ఇందులో బోల్డ్ ఏముందో నాకు అర్థం కాలేదు… ఒకవేళ ఆర్జివి గారికి అమ్మాయిలను వేధించే అలవాటే ఉంటే మీటూ ఉద్యమంలో అతని పేరు ఎందుకు బయటకు రాలేదంటూ అరియాన ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమలో ఎవరైనా నిలదొక్కుకోవాలన్న, వారి కెరియర్ మంచిగా ఉండాలంటే కొన్ని విషయాలలో తప్పకుండా కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఈ పరిశ్రమలో ఉన్నప్పుడు కోపం, అసహనం తెచ్చుకుంటే వారికి జీవితం ఉండదు.ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ పై తనని కామెంట్ చేస్తున్నవారు అందరూ కూడా తనను ఫేమస్ కావడం కోసమే కామెంట్లు చేస్తున్నారంటూ అరియాన కామెంట్ చేయడం విశేషం.

అరియనా పర్సనల్ సీక్రెట్స్ అన్ని లీక్.. ఆ విషయాలు తెలిస్తే మీరు కూడా?

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుణ్యమా అని ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అరియనా ఆ తర్వాత బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫోర్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న అరియాన హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న అరియనా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు.ఇదివరకే తను కొత్త ఇంటికి మారినట్లు అభిమానులతో పంచుకున్న అరీయాన ప్రస్తుతం ఉన్న ఈ క్లిష్ట పరిస్థితులలో ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడాలని తాజాగా తన అభిమానులను కోరారు.

ఈ క్రమంలోనే అరియాన తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ నిర్వహించగా తన ఫాలోవర్స నుంచి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే కొందరు ఈమెకు ప్రపోజల్స్ పెట్టడంతో సతమతమయ్యారు. అదేవిధంగా మరికొందరు నెటిజన్లు అరియాన వ్యక్తిగత విషయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు నెటిజన్లు తన వాట్సప్ డీపీ, ఫోన్ వాల్ పేపర్ వంటి సీక్రెట్ విషయాలను అడగడంతో అరియాన వాటిని సైతం షేర్ చేశారు. అరియాన వాట్సప్ డీపీ, వాల్ పేపర్‌గా తన ఫోటోలను పెట్టుకున్నట్లు స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయగా ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.