బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా అత్యంత ప్రజాదరణ సంపాదించుకున్న వారిలో ఆరియానా ఒకరు. యూట్యూబ్ యాంకర్ గా పలువురితో ఇంటర్వ్యూలు నిర్వహించే ఆరియానా రామ్ గోపాల్ వర్మ తో ఇంటర్వ్యూ చేసింది.ఈ ఇంటర్వ్యూ తన జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అయ్యిందని చెప్పవచ్చు.ఈ ఇంటర్వ్యూ ద్వారా రాంగోపాల్ వర్మ చేసిన సంచలన వ్యాఖ్యలు ఆమెకు ఎంతో క్రేజ్ తెచ్చి పెట్టాయి.
ఈ క్రేజ్ వల్ల ఆరియానా ఏకంగా బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చింది.బిగ్ బాస్ హౌస్ లో ఎంతో చురుకుగా తన తెలివితేటలను ప్రదర్శించి పలు టాస్క్ లను పూర్తి చేసిన ఈ బ్యూటీకి విశేషమైన ప్రేక్షకాదరణ పెరిగింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమెకు పలు అవకాశాలు వెల్లువెత్తాయి.ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ లో పలు సినిమాలలో కీలక పాత్రలు దక్కించుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
కెరీర్ పరంగా బిజీగా ఉండటమే కాకుండా తనకు ఈ లైఫ్ ఇచ్చినటువంటి రాంగోపాల్ వర్మ మరోసారి ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉండగా ఆరియానా నిత్యం తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను మరింత సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆరియానా ఓ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోలో తాను మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్నటువంటి సినిమాలో హీరో చెల్లెలు పాత్ర పోషిస్తున్నట్లు అసలు విషయాన్ని బయటపెట్టారు. అదే విధంగా ఈ వీడియోలో ఈ సినిమా దర్శకుడు శ్రీధర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆరియానా మాట్లాడుతూ ఈ సినిమాలో ఇంత మంచి అవకాశం తనకు కల్పించినందుకు డైరెక్టర్ శ్రీధర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ శ్రీధర్ కూడా ఆరియానా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తను ఏ పోస్ట్ పెట్టినా కూడా తన అభిమానులు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారంటూ ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీధర్ తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…