Featured

ఖైదీ సినిమాలో హీరోయిన్ గా అవకాశం మిస్ కాకుంటే, ఈ నటి పరిస్థితి మరోలా ఉండేది..!!

గుంటూరులో బి.ఏ ఎకనామిక్స్ పూర్తి చేసిన తర్వాత ఆంధ్ర నాట్యం నేర్చుకుంటానని జయలలిత హైదరాబాద్ వచ్చారు. అక్కడ ఆంధ్రనాట్యం నేర్చుకుంటున్న సమయంలో… తన తండ్రిగారి స్నేహితులు “ఈ పోరాటం మార్పు కోసం” చిత్రం తీస్తున్నారని అందులో ఒక క్లాసికల్ డాన్సర్ పాత్ర ఉందని జయలలితకు చెప్పారు. అప్పుడు జయలలిత పూర్తిగా డాన్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేయడం మూలంగా సినిమా చేయనని చెప్పింది. ఈ ఒక్క సినిమాలో నటించు నీకు నచ్చకపోతే తిరిగి హైదరాబాద్ వచ్చేయని వాళ్ళ నాన్న చెప్పడంతో “ఈ పోరాటం మార్పు కోసం” అనే చిత్రంలో నటించడానికి ఒప్పుకుంది.

అలా ఆ చిత్రానికి సంబంధించిన పాటల షూటింగ్ విజయ గార్డెన్స్ జరుగుతుండగా ఖైదీ నిర్మాతలు నిరంజన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలు జయలలితను చూసి తాము తీయబోయే ఖైదీ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇస్తామని చెప్పారు. అప్పుడు జయలలిత, వారి నాన్న ఎంతగానో సంతోషించారు. వెంటనే హైదరాబాద్ నుండి చెన్నై కి షిఫ్ట్ అవ్వండని చెప్పి మద్రాస్ లో లేక్ ఏరియాలో ఒక గది కూడా చూడడం జరిగింది. 1983, సంయుక్త మూవీస్, ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “ఖైదీ” సినిమా విడుదల అయ్యింది. ఇందులో చిరంజీవి, మాధవి, సుమలత హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే సినిమాలో మొదటి హీరోయిన్ గా మాధవి ఎంపికయ్యారు. ఇక రెండవ హీరోయిన్ గా అవకాశం ఇస్తానని చెప్పిన నిర్మాతలు హఠాత్తుగా ఆ స్థానంలో సుమలత ను తీసుకోవడం జరిగింది.

అలా అవకాశం వచ్చినట్టే వచ్చి చేయి జారడంతో జయలలిత వాళ్ళ నాన్నగారు ఎంతో బాధ పడ్డారు. అవకాశం కోల్పోయానని సందిగ్ధంలో ఉన్న జయలలితకు ఒక మలయాళం రిపోర్టర్ ద్వారా అక్కడి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అలా మొదటిసినిమా (మలయాళం) గ్లామరస్ పాత్ర కావడంతో.. తర్వాత సినిమాల్లో కూడా రొమాంటిక్, వ్యాంప్ క్యారెక్టర్సే ఎక్కువగా జయలలితకు వచ్చాయి. అప్పుడున్న పరిస్థితులలో తన కుటుంబాన్ని ఎలాగో అలాగా నెట్టుకు రావడానికి జయలలిత అలాంటి పాత్రలలో నటించాల్సి వచ్చింది.

ఒకవేళ చిరంజీవి నటించిన ఖైదీ సినిమాలో జయలలిత హీరోయిన్ గా నటించి ఉంటే ఆమె భవిష్యత్తు ఓ బంగారు బాటగా నిలిచుండేది. జయలలిత చిరంజీవి నటించిన “గ్యాంగ్ లీడర్” చిత్రంలో వ్యాంప్ క్యారెక్టర్ లో కనిపించింది. మోహన్ బాబు హీరోగా నటించిన “రౌడీ గారి పెళ్ళాం” చిత్రంలో “యమ రంజు మీద ఉంది పుంజు” అనే పాటలో జయలలిత నటించారు. ఈ మధ్యకాలంలో సినిమాలలో అవకాశాలు వచ్చినప్పటికీ వాటికి అంత ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె కొన్ని సినిమాల్లో మాత్రమే నటించారు. అలా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన “భరత్ అనే నేను” చిత్రంలో ఆమె అసెంబ్లీ స్పీకర్ గా నటించారు. ఆమె ఎక్కువగా బుల్లితెర సీరియల్స్ లోనే కనబడుతున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

7 hours ago

పవన్ కల్యాణ్ కోసం కొండగట్టులో పూజలు.. అభిమానుల ఆరాటం వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

7 hours ago

ట్రంప్‌తో టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…

8 hours ago

బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం.. కేంద్రం అలర్ట్

కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…

8 hours ago

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి షాకింగ్ పని.. టెర్రస్‌పై గంజాయి!

హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…

8 hours ago

ఆయన నమ్మకమే నా కెరీర్ మలుపు.. అజయ్ ఘోష్ ఎమోషనల్..!

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…

8 hours ago