గత కొద్ది రోజుల నుంచి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కాదని, బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొనే కంటెస్టెంట్ లు వీళ్లేనంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోజుకొక వార్త బిగ్ బాస్ గురించి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
సెప్టెంబర్ ఐదు నుంచి బిగ్ బాస్ ప్రసారం కాబోతుందని పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే బిగ్ బాస్ లోగోను కూడా విడుదల చేయడంతో త్వరలోనే ఈ కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ సారి సీజన్లో పాల్గొనేవారు వీరే అంటూ కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ జస్వంత్, యాంకర్ రవి, శేఖర్ మాస్టర్, వర్షిని, లోబో, ప్రియాంక సింగ్, కార్తీక దీపం భాగ్యం, బుల్లితెర నటి ప్రియా, tv9 ప్రత్యూష, నటి సురేఖ వాణి వంటి వారి పేర్లు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఈసారి సీజన్ లో ఆట సందీప్ కంటెస్టెంట్ గా వెళ్లనుందని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే గత సీజన్ మాదిరిగానే ఈ సీజన్లో కూడా ఓ జంట బిగ్ బాస్ హౌస్ లోనికి పంపించనున్నారు. ఈ క్రమంలోనే ఆట సందీప్ అతని భార్యను బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పంపించినట్లు తెలుస్తోంది.
తాజాగా ఆట సందీప్ చేసిన ట్వీట్ వైరల్ గా మారడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే సందీప్ ఫేస్ బుక్ స్టోరీలో బిగ్ బాస్ షో కి సంబంధించి ఒక పోల్ పెట్టారు. మమ్మల్ని బిగ్ బాస్ హౌస్ లో ఎంత మంది చూడాలనుకుంటున్నారు? అని పోస్ట్ చేయగా దాదాపు 81 శాతం మంది ఈ జంటను బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుని భావించారు.అయితే ప్రస్తుతం సందీప్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి తను కూడా ఈ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొంటున్నారా అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ట్వీట్ బట్టి చూస్తే ఆట సందీప్ అతని భార్య బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…