రోజుకు మూడు షిఫ్టుల్లో పని చేస్తూ అనేక సినిమాల్లో నటిస్తున్న కృష్ణకు హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. తమ సొంత బ్యానర్లో సినిమాలు తీస్తే ఎలా ఉంటుందని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా తన తమ్ముళ్లు ఆదిశేషగిరిరావు, హనుమంతరావులకు చెప్పడంతో వారిద్దరూ సరే అన్నారు. అలా పద్మాలయా స్టూడియోస్ నిర్మాణంలో ఒక సందేశాత్మక చిత్రం నిర్మించాలనుకున్నారు. ఆ క్రమంలో మొదటగా “అగ్నిపరీక్ష” అనే చిత్రాన్ని నిర్మించారు. సినిమాకి మంచి పేరు అయితే వచ్చింది కానీ కమర్షియల్ గా సినిమా ఆడలేదు.
ఆ తర్వాత పద్మాలయా స్టూడియోస్ సూపర్ హిట్ సినిమాలు నిర్మించింది. మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం లాంటి సూపర్ హిట్ సినిమాలు పద్మాలయ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 1972 ,లక్ష్మీదీపక్ దర్శకత్వంలో “పండంటి కాపురం” సినిమా విడుదల అయ్యింది. కృష్ణ, విజయనిర్మల హీరోహీరోయిన్లుగా నటించారు. రంగారావు, గుమ్మడి ప్రధాన పాత్రలు పోషించారు. కుటుంబ కథా చిత్రం కావడంతో ఆనాటి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించడంతో నిర్మాతలు విజయోత్సవ వేడుకలను నిర్వహించారు.
పండంటి కాపురం విజయోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఎన్టీ.రామారావు విచ్చేశారు. ఆ సందర్భంలో ఎన్టీఆర్ చిత్రాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ పద్మాలయా స్టూడియోస్ నిర్మాణంలో వచ్చిన సినిమాలు ఘన విజయాన్ని సాధిస్తున్నాయి. నేను కూడా ఇదే బ్యానర్ లో ఒక సినిమా చేయాలనుందని తన కోరికను వెలిబుచ్చారు. అలా ఎన్టీఆర్ రామారావు అనడంతో సూపర్ స్టార్ కృష్ణ మల్టీ స్టారర్ మూవీ తీయాలనుకున్నారు. ఆ క్రమంలో 1973 పద్మాలయ స్టూడియోస్, రామచంద్రరావు దర్శకత్వంలో “దేవుడు చేసిన మనుషులు” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో ఎన్టీ రామారావు, కృష్ణ, జయలలిత, విజయనిర్మల హీరో, హీరోయిన్లుగా నటించారు.
రమేష్ నాయుడు అందించిన సంగీతం ప్రేక్షక ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో “మసక మసక చీకటిలో…మల్లె తోట వెనకాలా..” అనే ఐటమ్ సాంగ్ ఆనాటి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అయితే ఈ పాటలో నర్తించిన డాన్సర్ ఎవరో కాదు ఆమె పేరు కాంచన. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు, అక్కినేని, కృష్ణ లాంటి హీరోలతో అనేక చిత్రాల్లో నటించారు. ఆమె చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “అర్జున్ రెడ్డి” సినిమాలో హీరోకు నానమ్మగా ఓ పాత్రను పోషించారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…