Featured

Ariyana Glory: బావను ఆ స్థితిలో చూసే సరికి గుండె ముక్కలైంది: అరియానా

Ariyana Glory: తెలుగు బిగ్ బాస్ ఓటీటీలో ప్రసారం అవుతున్న షో రోజు రోజుకీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. విభిన్న టాస్క్ లతో పాటు, కంటెస్టంట్స్ గొడవలు, చిలిపి పనులతో ప్రేక్షకులను కట్టి పడేస్తున్నారు. ప్రతీ సీజన్ లో ఇప్పటి వరకు ది మోస్ట్ బెస్ట్ ఆర్ వరెస్ట్ మూమెంట్స్ చెప్పుకునే అవకాశాన్ని బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఇస్తారు. అలాగే ఈ సీజన్ లోనూ వారి ఇన్నర్ ఫీలింగ్స్ ను చెప్పుకునే అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్. అందులో భాగంగా ఒక్కో కంటెస్టంట్ తమ తమ భావాలను వెల్లడించారు.

Ariyana Glory: బావను ఆ స్థితిలో చూసే సరికి గుండె ముక్కలైంది: అరియానా

ఆ క్రమంలోనే అరియనా గ్లోరీ కూడా తన మనసులో ఇన్నాళ్లూ దాచుకున్న బాధను తెలుగు సినీ ప్రేక్షకుల ముందు చెప్పుకుని బోరున విలపించింది. అది తనకు, తన బావకు మధ్య సంఘటన అంటూ మొదలు పెట్టిన అరియానా, చిన్న తనంలోనే తండ్రి ప్రేమకు దూరమయ్యానని చెప్పుకొచ్చింది. తొమ్మిదో తరగతిలో తన బావతో ప్రేమాయణం మొదలైందని, తన పట్ల చూపించే ప్రేమా, కేరింగ్ చూసి అతనిపై ప్రేమ క్రమేణా బలపడిందని అరియానా తెలిపింది. అతనికి డిగ్రీ అయిపోయాక ఉద్యోగం వచ్చిందని, ఆ తర్వాత తామిద్దరం హైదరాబాద్ లో కలిసి ఉన్నామని చెప్పింది. మూడు సంవత్సరాలు బాగానే గడిచినా, ఆ తర్వాత తన బావకు తాను బోర్ కొట్టేసానని చాలా లేట్ గా తెలుసుకున్నానంటూ వాపోయింది.

Ariyana Glory: బావను ఆ స్థితిలో చూసే సరికి గుండె ముక్కలైంది: అరియానా

ఒకానొక రోజు తన బావను చెప్పోకొలేని స్థితిలో, ఏ స్థితిలో చూడకూడదు అనుకున్నాననో అలా చూసి గుండె పగిలిపోయింది అంటూ అరియానా ఆవేధన వ్యక్తం చేసింది. కానీ మళ్ళీ అతను ఏదో సర్దిచెప్పే సరికి తానే కన్విన్స్ అయ్యి, మళ్ళీ అతనితో ఒక రెండు సంవత్సారాలు రిలేషన్షిప్ ను కంటిన్యూ చేశానని చెప్పింది.

ఎంతో అనుమానించాడు…

ఇలా రోజులు గడుస్తున్న క్రమంలోనే తనకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడని, కానీ తన బావ దాన్ని కూడా అనుమానించాడని అరియానా తెలిపింది. ఇక తాము ఇద్దరం కలిసి ఉండే ప్రసక్తి లేదని బ్రేకప్ చెప్పుకున్నామని ఆమె చెప్పింది. ఆ తర్వాత తాను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో కూడా బావ తనకు గుర్తొచ్చే వాడని, తన తప్పు లేకపోయినా తనను క్షమించమని తప్పైపోయింది అని ఎంత బతిమాలినా అతను సర్దుకో లేదని అరియానా తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago