బిగ్ బాస్ సీజన్ 4 లో అడుగుపెట్టకముందు ఆమె ఒక యాంకర్ గా ఓ ఛానల్ లో పనిచేసింది. అక్కడ రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ సంచలనంగా మారింది. దీంతో ఆమె బోల్డ్ ఉమెన్ గా పేరు తెచ్చుంకుంది. ఆ ఇంటర్వ్యూ ద్వారానే ‘అరియానా’ ఎక్కువగా పాలపులారిటీ తెచ్చుకుందని చెప్పవచ్చు. దాని కారణంగానే ఆమె బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టింది.
తర్వాత హౌస్ లో ఎన్నో గొడవలు, ఏడుపులతో టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరుగా నిలిచింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమెకు అవకాశాలు ఏమి తగ్గలేదు. రోజుకు రెండు ప్రోగ్రాంలో, మూడు ఇటర్వ్యూలు అన్నట్లు సాగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ బజ్ లో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేస్తోంది. దీనిలో కూడా ఆమె మంచి ప్రావీణ్యం సంపాదించిందనే చెప్పాలి. ఏదేనా ముక్కు సూటిగా ప్రశ్నించేతత్వం ఉన్న అరియానా.. ముక్కు అవినాష్ తో బాగా క్లోజ్ అయింది.
కాంట్రవర్సీలకు, వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్న అరియానా.. ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వంపై మండిపడింది. దానికి కారణం ఏంటంటే.. దానికి సంబంధించి ఓ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం మణికొండలో రహదారులు అత్యంత దారుణంగా ఉన్నాయని.. ఒక్క కిలోమీటర్ దూరం వెళ్లడానికి కొన్ని గంటల సమయం పడుతుందని.. తెలంగాణ ప్రభుత్వం, స్థానిక కార్పొరేటర్ ఏం చేస్తుంన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక్కడ ఇంత అధ్వాన్నంగా ఉన్న రోడ్లు మరెక్కడా ఉండవేమో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీస్ లకు, షూటింగ్ లకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారంటూ చెప్పింది. దయచేసి సమస్యను పరిష్కరించండి అంటూ వేడుకుంది. ఈ వీడియో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…