గతంలో రామ్ గోపాల్ వర్మని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ అరియాన అతని ఇంటర్వ్యూ ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయింది. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ నువ్వంటే నాకిష్టం, నిన్ను బికినీలో చూడాలని ఉంది అంటూ కామెంట్లు చేయడంతో ఒక్కసారిగా ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది. ఈ పాపులారిటీ ద్వారానే ఈ బ్యూటీ బిగ్ బాస్ లో అవకాశం దక్కించుకుంది.
బిగ్ బాస్ లోకి ఎంటర్ అయిన అరియాన బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపును సంపాదించుకొని ఎన్నో అవకాశాలను దక్కించుకున్నారు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న అరియాన తాజాగా మరోసారి రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. గత కొన్ని రోజుల క్రితం రామ్ గోపాల్ వర్మతో కలిసి జిమ్ లో దిగిన హాట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఈ ఇంటర్వ్యూ పై ఆసక్తిని రేకెత్తించింది.
తాజాగా రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోను విడుదల చేయగా ఈ వీడియో చూసిన నెటిజన్లు వీరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూ పై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అరియాన స్పందించారు. రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేయడం నాకు ప్లస్ అవుతుందేమో కానీ.. ఆయనకు మామూలే అంటూ ఒక మాటలో చెప్పేశారు.
అదేవిధంగా ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్కరూ బోల్డ్ ఇంటర్వ్యూ అని చెబుతున్నారు. అసలు ఇందులో బోల్డ్ ఏముందో నాకు అర్థం కాలేదు… ఒకవేళ ఆర్జివి గారికి అమ్మాయిలను వేధించే అలవాటే ఉంటే మీటూ ఉద్యమంలో అతని పేరు ఎందుకు బయటకు రాలేదంటూ అరియాన ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమలో ఎవరైనా నిలదొక్కుకోవాలన్న, వారి కెరియర్ మంచిగా ఉండాలంటే కొన్ని విషయాలలో తప్పకుండా కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఈ పరిశ్రమలో ఉన్నప్పుడు కోపం, అసహనం తెచ్చుకుంటే వారికి జీవితం ఉండదు.ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ పై తనని కామెంట్ చేస్తున్నవారు అందరూ కూడా తనను ఫేమస్ కావడం కోసమే కామెంట్లు చేస్తున్నారంటూ అరియాన కామెంట్ చేయడం విశేషం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…