Health News

మొలకెత్తిన గింజలు తింటున్నారా… అయితే ఈ సమస్యలు మీ దరిచేరవు?

సాధారణంగా మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.అందుకోసమే మనం తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా తగినన్ని పోషకాలు ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది రుచికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వారు తీసుకునే ఆహారంలో ఎలాంటి పోషకపదార్థాలు లేకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.

మన ఆరోగ్యం బాగుండాలంటే తప్పనిసరిగా మన ఆహార పదార్థాలలో పోషక విలువలతో పాటు తాజాకూరలు, ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు ఉండాలి. ముఖ్యంగా మొలకలు వచ్చి ఆకుపచ్చరంగు లో ఉన్నటువంటి గింజలను రోజూ తీసుకోవడం వల్ల మన శరీరంలోని అన్ని జీవ ప్రక్రియలు సక్రమంగా జరుగుతాయి.ఈ విధంగా మొలకెత్తిన గింజలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

మొలకెత్తిన గింజలను ప్రతి రోజు ఉదయం అల్పాహారానికి ముందుగా తీసుకోవడం వల్ల మన శరీరంలో జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.అదే విధంగా శరీర బరువును నియంత్రించడానికి దోహదపడుతుంది.మొలకెత్తిన గింజలను తినడం వల్ల మనకు పూర్తిగా కడుపు నిండిన భావన కలుగుతుంది తద్వారా ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఈ క్రమంలోనే మన శరీర బరువును తగ్గించుకోవచ్చు.

మొలకెత్తిన గింజలలో విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండడంతో పాటు మెగ్నీషియం ,పొటాషియం, ఫైబర్ లు పుష్కలంగా లభిస్తాయి. ఇది మన శరీరానికి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి ముఖ్యంగా మొలకెత్తిన గింజలలో అధికభాగం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దీని ద్వారా కార్డియో వాస్క్యులర్ సమస్యలు కూడా తగ్గుతాయి. అదేవిధంగా మొలకెత్తిన గింజలలో ఉండే గుణాలు మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను పూర్తిగా తగ్గించి గుండె సమస్యల నుంచి పూర్తిగా మనల్ని రక్షిస్తుంది. కనుక మొలకెత్తిన గింజలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల పది కాలాల పాటు మన గుండెను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago