సాధారణంగా మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.అందుకోసమే మనం తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా తగినన్ని పోషకాలు ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది రుచికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వారు తీసుకునే ఆహారంలో ఎలాంటి పోషకపదార్థాలు లేకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.

మన ఆరోగ్యం బాగుండాలంటే తప్పనిసరిగా మన ఆహార పదార్థాలలో పోషక విలువలతో పాటు తాజాకూరలు, ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు ఉండాలి. ముఖ్యంగా మొలకలు వచ్చి ఆకుపచ్చరంగు లో ఉన్నటువంటి గింజలను రోజూ తీసుకోవడం వల్ల మన శరీరంలోని అన్ని జీవ ప్రక్రియలు సక్రమంగా జరుగుతాయి.ఈ విధంగా మొలకెత్తిన గింజలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
మొలకెత్తిన గింజలను ప్రతి రోజు ఉదయం అల్పాహారానికి ముందుగా తీసుకోవడం వల్ల మన శరీరంలో జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.అదే విధంగా శరీర బరువును నియంత్రించడానికి దోహదపడుతుంది.మొలకెత్తిన గింజలను తినడం వల్ల మనకు పూర్తిగా కడుపు నిండిన భావన కలుగుతుంది తద్వారా ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఈ క్రమంలోనే మన శరీర బరువును తగ్గించుకోవచ్చు.
మొలకెత్తిన గింజలలో విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండడంతో పాటు మెగ్నీషియం ,పొటాషియం, ఫైబర్ లు పుష్కలంగా లభిస్తాయి. ఇది మన శరీరానికి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి ముఖ్యంగా మొలకెత్తిన గింజలలో అధికభాగం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. దీని ద్వారా కార్డియో వాస్క్యులర్ సమస్యలు కూడా తగ్గుతాయి. అదేవిధంగా మొలకెత్తిన గింజలలో ఉండే గుణాలు మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను పూర్తిగా తగ్గించి గుండె సమస్యల నుంచి పూర్తిగా మనల్ని రక్షిస్తుంది. కనుక మొలకెత్తిన గింజలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల పది కాలాల పాటు మన గుండెను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
































