Tag Archives: home

Shanmukh Jaswanth: ఇంట్లో వీల్ చైర్ కు పరిమితమైన షణ్ముఖ్ జస్వంత్… కంగారులో అభిమానులు!

Shanmukh Jaswanth: యూట్యూబర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో వెబ్ సిరీస్ లతోపాటు కవర్ సాంగ్స్ చేస్తూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ లోకి కూడా అడుగు పెట్టారు.

బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఈయన మరింత పాపులర్ అయ్యారని చెప్పాలి. బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లకు ముందు ఈయన మరొక యూట్యూబర్ దీప్తి సునయనతో ప్రేమలో ఉన్నారు. అయితే బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన తర్వాత కంటెస్టెంట్ సిరితో చాలా చనువుగా ఉన్నారు. ఇలా వీరి వ్యవహారం ఎన్నో వివాదాలకు కారణమైందని చెప్పాలి.

అప్పటికే సిరి కూడా శ్రీహాన్ ప్రేమలో ఉన్నారు. అయితే ఈ విషయాన్ని మరిచిపోయి వీరిద్దరూ చనువుగా వ్యవహరించడంతో వీరి గురించి భారీగా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. ఇక బయటకు వచ్చిన తర్వాత దీప్తి సునయన షన్నుతో కూడా బ్రేకప్ కూడా చెప్పుకున్నారు. ఇలా ఈ ప్రేమలు బ్రేకప్ వ్యవహారంతో కొద్దిరోజుల పాటు వార్తలో నిలిచినటువంటి ఈయన ప్రస్తుతం యధావిధిగా కవర్ సాంగ్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.

Shanmukh Jaswanth: సరదాగా కూర్చున్నాను…


ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే షణ్ముఖ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా వీల్ చైర్ లో కూర్చుని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇది చూసినటువంటి అభిమానులు అసలు షన్నుకి ఏమైంది అంటూ కంగారుపడుతూ కామెంట్ చేశారు. అయితే ఈయన ఈ ఫోటోని షేర్ చేస్తూ తనకు ఏం కాలేదని అది తన తాతయ్య వీల్ చైర్ అని సరదాగా తాను కూర్చున్నాను అంటూ చెప్పుకోచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

Devotional Tips: మీ ఇంట్లో దేవుడికి కనీసం దీపం పెట్టే సమయం కూడా ఉండడం లేదా? అయితే ఇలా చేయండి..!

Devotional Tips: మారుతున్న జనరేషన్ కారణంగా మానవుని జీవన విధానంలో కూడా ఎంతో మార్పు వచ్చింది. ఈ క్రమంలో ప్రజలు గతంలో చేసినట్లుగా దేవుడికి పూజ కార్యక్రమాలు చేయలేకపోతున్నారు. మరి కొందరు ఉద్యోగాల పేరుతో బిజీ పనుల్లో మునిగిపోయి దేవుడి గదిలో కనీసం దీపం కూడా వెలిగించలేక పోతున్నారు.

Devotional Tips: మీ ఇంట్లో దేవుడికి కనీసం దీపం పెట్టే సమయం కూడా ఉండడం లేదా? అయితే ఇలా చేయండి..!

అలాంటి వారు ఈ విధంగా చేయడం మంచిదని తెలుస్తుంది.అదేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. దేవుడి గదిలో దీపం వెలిగించటానికి సమయం లేనివారి కోసం ఒక మార్గం ఉంది. అదేమిటంటే దీపం వెలిగించడానికి బదులుగా అగరవత్తులు వెలిగించుకొని ఇల్లంతా దూపాన్ని చూపించవచ్చు. కొంతమందికి ఉదయం అగరవత్తి వెలిగించడానికి కూడా సమయం ఉండదు.

Devotional Tips: మీ ఇంట్లో దేవుడికి కనీసం దీపం పెట్టే సమయం కూడా ఉండడం లేదా? అయితే ఇలా చేయండి..!

అలాంటి వారు ప్రశాంతంగా సాయంత్ర సమయంలో అయినా అగరవత్తుల దూపాన్ని వెగిలించవచ్చు. ఇక సాయంత్రం కూడా కుదరకపోతే రాత్రి సమయంలో అయినా పెట్ట వచ్చు. ఇక అది కూడా కుదరని వాళ్ళు మార్కెట్లో కొత్తగా దొరికే ధూప్ స్టిక్ ను దేవుడి గదిలో ఉపయోగించడం మంచిది.


వినాయకుడిని స్మరించుకోవాలి…

ఇక అంతే కాకుండా దేవుడి గదిలో దీపం పెట్టడానికి సమయం కుదరని వాళ్ళు వినాయకుని స్మరించి దీపారాధన చేస్తే మంచి ఫలితం దక్కుతుందని తెలుస్తుంది. ఇక దీంతోపాటు కుదిరినప్పుడల్లా వారానికి ఒకసారి దేవుడి గదిని శుభ్రంగా నీటుగా కడగడం మంచిది. ఇంకా గణనాథుడు సంబంధించిన కొన్ని శ్లోకాలు ఖాళీ సమయం దొరికినప్పుడు స్మరించడం మంచిది.

Booster Dose: ఒక్క ఫోన్ కాల్ తో..! ఇంటికి వ్యాక్సిన్.. !

Booster Dose: కరోనా కాలంలో ఎంతమంది ఇబ్బంది పడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇలా గత రెండు సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు. అయితే దీనికి శాశ్వత పరిష్కారం అయితే కనుక్కోలేదు కానీ.. వ్యాక్సిన్లు మాత్రం తీసుకొచ్చారు.

Booster Dose: ఒక్క ఫోన్ కాల్ తో..! ఇంటికి వ్యాక్సిన్.. !

మన దేశంలో కోవాగ్జిన్, కోవీషీల్డ్ వంటి వ్యాక్సిన్లు తీసుకొచ్చారు. అయితే మొదట రెండు డోసుల వరకు చాలు అని చెప్పిన అధికారులు బూస్టర్ డోసు కూడా వేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం బూస్టర్ డోసులను కూడా ఉచితంగానే అందిస్తోంది.

Booster Dose: ఒక్క ఫోన్ కాల్ తో..! ఇంటికి వ్యాక్సిన్.. !

అయితే రెండో డోసు వేసుకొని 9 నెలల తర్వాత మాత్రమే బూస్టర్ డోసు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే దీనిని 9 నెలలు కాకుండా.. 6 నెలలకు తగ్గించాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదు. ఇక బూస్టర్ డోస్ తీసుకోవాలని అనుకునే వారికి జీహెచ్ఎంసీ తాజాగా ప్రకటన వెలువరించింది. ఒక్క ఫోన్‌ కాల్‌ చేయండి.. మీ ఇంటికి వచ్చి బూస్టర్‌ డోస్‌ వేస్తాం అనే నినాదంతో ముందకు వచ్చింది. ప్రస్తుతం 60 ఏళ్ల దాటిన వాళ్లకు, అనారోగ్య సమస్యలు ఉన్న వారు జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 040-2111 1111 కు ఫోన్‌ చేస్తే ఇళ్ల వద్దకే వచ్చి సిబ్బంది బూస్టర్‌ డోస్‌ ఇస్తారని అధికారులు పేర్కొన్నారు.


ప్రతీ ఒక్కరు ఈ అవకాశాన్ని ..

థర్డ్ వేవ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇప్పటి వరకు బూస్టర్‌ డోస్‌ తీసుకోని వారు ఆ సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హైల్ప్‌లైన్‌ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే.. మొబైల్‌ వాహనంలో ఇంటికి వచ్చి వ్యాక్సిన్‌ ఇస్తారు. ప్రతీ ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు.

మద్యం తాగేవారికి షాక్.. ఇంట్లో ఎక్కువ మద్యం ఉంటే లైసెన్స్ ఉండాల్సిందే..?

దేశంలో మద్యం ప్రియుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. చాలామంది ఎక్కువ మొత్తంలో మద్యం కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ ఉంచుకుంటున్నారు. అయితే ఎక్కువ మొత్తంలో లైసెన్స్ లేకుండా మద్యం నిల్వ ఉంచుకున్నా ఇబ్బందులు పడక తప్పదు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యం కొనుగోలు చేసి ఇంట్లో దాచుకునే వారికి భారీ షాక్ ఇచ్చింది.

ఎక్సైజ్ శాఖ నిబంధనలలో కీలక సవరణలు చేసి మార్గదర్శకాలను విడుదల చేసింది. నూతన మార్గదర్శకాల ప్రకారం పరిమితికి మించి మద్యం రవాణా చేయడానికి, కొనుగోలు చేయడానికి వీలు లేదు. నూతన మార్గదర్శకాల ప్రకారం కేవలం ఆరు లీటర్ల మద్యానికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఆరు లీటర్ల కంటే ఎక్కువ మొత్తం మద్యం నిల్వ చేయాలని అనుకుంటే మాత్రం లైసెన్స్ ను తప్పనిసరిగా తీసుకోవాలి.

ఎవరైనా ప్రభుత్వ లైసెన్స్ ను పొందాలని భావిస్తే వారు 51 వేల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించడంతో పాటు 12 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గతంతో పోలిస్తే రిటైలర్స్ కు కూడా 7.5 శాతం లైసెన్స్ ఫీజును పెంచింది. అదే సమయంలో బీరుపై గతంతో ఉన్న సుకంతో పోలిస్తే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. తక్కువ ఆల్కహాల్ పానీయాలను ప్రోత్సహించే దిశగా యూపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

గతేడాది లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయడం వల్ల ఆదాయం తగ్గిన నేపథ్యంలో యూపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. రాష్త్రంలో ఉత్పత్తి అయ్యే పండ్లతో వైన్ తయారు చేసేవారికి ఐదు సంవత్సరాల పాటు ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది.

రైలు ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో ఇంటి ముంగిటకు సామాన్లు..!

భారతీయ రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది . ప్రయాణికుల రవాణా కష్టాలకు చెక్ పెట్టే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ప్రయాణికుల సౌకర్యార్థం బ్యాగ్ ఆన్ వీల్ సేవలను రైల్వే శాఖ ప్రారంభించనుంది. భారతీయ రైల్వే ప్రారంభించబోయే ఈ సరికొత్త సర్వీసుల ద్వారా ప్రయాణికులకు వారి సామాన్లు ఇంటి నుంచి రైల్వే స్టేషన్ కు, రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి రవాణా చేయబడతాయి.

దేశంలో ప్రముఖ రైల్వే స్టేషన్లలో రైల్వే శాఖ మొదట ఈ సర్వీసులను ప్రారంభించనుంది. అనంతరం ఇతర ప్రాంతాల్లో సైతం ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. రైల్వే శాఖ మొదట ఢిల్లీ. గురుగావ్, ఘజియాబాద్ ప్రాంతాలలో ఈ రైలు సర్వీసులను ప్రారంభించనుంది. ప్రస్తుతం ఢిల్లీ డివిజన్ యాప్ సహాయంతో ఈ సర్వీసులను ప్రారంభంచనుంది. భవిష్యత్తులో దేశమంతటా ఈ సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఢిల్లీలోని వివిధ రైల్వే స్టేషన్ల ప్రయాణికులు ఈ సర్వీసులను వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. రైల్వే అధికారులు బ్యాగ్ ఆన్ వీల్స్ సర్వీసుల గురించి మాట్లాడుతూ ఈ సర్వీసుల కోసం నామమాత్రపు ఛార్జీలనే వసూలు చేయనున్నట్టు వెల్లడించారు. నార్త్ సెంటర్ రైల్వే మేనేజర్ రాజీవ్ చౌదరి మాట్లాడుతూ ఇలాంటి సర్వీసులను ప్రారంభించడం ఇదే తొలిసారి అని చెప్పారు.

మరోవైపు కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలోనే రైళ్లు తిరుగుతున్నాయి. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో రైల్వే శాఖ పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతుండగా భవిష్యత్తులో రైలు ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతుండటం గమనార్హం.

ఎస్బీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. సులభంగా కొత్త ఇల్లు..?

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వినియోగదారులకు గత కొన్నిరోజులుగా వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. కరోనా, లాక్ డౌన్ వల్ల ప్రజల ఆదాయం భారీగా తగ్గిన నేపథ్యంలో వడ్డీరేట్లను తగ్గిస్తూ ఎస్బీఐ బ్రహ్మాండమైన ఆఫర్లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తుంది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఎస్బీఐ కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకునేవారికి బ్రహ్మాండమైన ఆఫర్లను ప్రకటించింది.

గృహ రుణాల వడ్డీ రేటుపై ఏకంగా 25 బేసిక్ పాయింట్ల రాయితీని ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ పొందాలంటే కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. ఎవరైతే ఎస్బీఐ యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారో వారికి ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. అయితే ఎస్బీఐ రుణం తీసుకున్న వారి సిబిల్ స్కోరును సైతం పరిశీలిస్తోంది. అయితే 75 లక్షల రూపాయలకు పైగా హోం లోన్ తీసుకున్న వారికి మాత్రమే ఈ బేస్ రేటు వర్తింపు జరుగుతుంది.

గతంలో మధ్య తరగతి వర్గాల ప్రజలకు సైతం ప్రయోజనం చేకూరేలా పది నుంచి 20 బేసిక్ పాయింట్ల వరకు వడ్డీ రాయితీ ప్రకటించిన ప్రధాన నగరాలతో పాటు మెట్రో నగరాల్లో ఈ రాయితీ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాలను వెల్లడించింది. ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వినియోగదారులు ప్రశంసిస్తున్నారు.

ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 30 లక్షల రూపాయలకు పైగా 7 శాతం వడ్డీని.. 30 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉంటే 6.9 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎస్బీఐ వినియోగదారులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తుండటం గమనార్హం.