Tag Archives: Investigation

Naveen Reddy: ఫోర్జరీ కేసులో నేరాన్ని అంగీకరించిన నటుడు నవీన్ రెడ్డి… విచారణలో బయటపడిన నిజాలు!

Naveen Reddy: ఎన్‌ స్క్వైర్‌ కంపెనీ డైరెక్టర్లు ఫిర్యాదు మేరకు సినీ నటుడు నవీన్ రెడ్డి అట్లూరినీ రెండు రోజుల క్రితం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం మనకు తెలిసిందే. నవీన్ రెడ్డి ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్ స్క్వేర్ కంపెనీలో డైరెక్టర్ గా వ్యవహరించేవారు. అయితే ఈయన ఇతర డైరెక్టర్లకు తెలియకుండా ఫోర్జరీ సంతకాలు చేసి భారీగా డబ్బులను నొక్కేసారని ఇతర డైరెక్టర్లు నవీన్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నవీన్ రెడ్డి ఫోర్జరీ సంతకాలతో దాదాపు 55 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారని ఇతర డైరెక్టర్లు ఈయనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ పోలీసులు తనని అరెస్టు చేసి గత రెండు రోజులుగా విచారణ చేస్తున్నారు. అయితే ఈ విచారణలో భాగంగా నటుడు నవీన్ రెడ్డి నిజాలు అన్నింటిని బయటపెట్టినట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే నవీన్ రెడ్డి డైరెక్టర్ గా బాధ్యతలు వ్యవహరిస్తూ ఇతరులకు తెలియకుండా ఫోర్జరీ సంతకాల ద్వారా 38 కోట్ల రూపాయల డబ్బును నొక్కేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఎన్ స్క్వేర్ కంపెనీకి చెందిన ఆస్తులను కూడా తన పేరు పైకి మార్చుకున్నట్టు తెలుస్తోంది.ఇక ఈ విషయాలన్నీ స్వయంగా నవీన్ రెడ్డికి పోలీసులు ముందు ఒప్పుకున్నారు.

Naveen Reddy: నోబడీ సినిమాలో హీరోగా నవీన్ రెడ్డి..

ఈ కంపెనీ నుంచి భారీగా డబ్బులను స్కామ్ చేసి సొంతంగా తానే హీరోగా హీరోగా నోబడీ అనే సినిమాను చేశారు. అలాగే భారీగా జల్సాలు చేయడంతో అనుమానం వచ్చిన ఇతర డైరెక్టర్స్‌కు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిసిఎస్ పోలీసులు నవీన్ రెడ్డిపై 420, 465,468,471 r/w 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇలా కేసు నమోదు చేసిన అనంతరం విచారణ చేపట్టడంతో నవీన్ రెడ్డి తాను చేసిన నేరాలను అంగీకరించారు.

కేవలం 20 నిమిషాల్లోనే ఆరుగురు రేపిస్టులను పట్టుకున్న శునకం.. ఎక్కడంటే..!

కొన్ని కేసులను ఛేదించే క్రమంలో పోలీసులకు ఏ మాత్రం క్లూ దొరకకుండా ఉంటాయి. అటువంటి సమయంలో వాళ్లు ముందుగా సీసీ కెమెరాల్లో నేరానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు దొరుకుతాయో చూస్తారు. అయినా ఇంకా ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియకపోవచ్చు. అటువంటి సందర్భంలో టెక్నాలజీని ఉపయోగించుకుంటారు.

అయినా నేరస్తుల వివరాలు దొరక్కపోతే డాగ్ స్క్వాడ్స్ ను కూడా ఉపయోగించుకుంటారు. ఈ డాగ్స్ పోలీసుల పర్యవేక్షణలో పూర్తిగా శిక్షణ పొంది ఉంటాయి. నేర పరిశోధనలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తుంటాయి. అయితే ఓ శునకం కేవలం 20 నిమిషాల్లోనే ఆరుగురు రేపిస్టులను పట్టుకుంది. అవును మీరు విన్నది నిజమే..

గుజరాత్ లోని వడోదర పోలీస్ డాగ్ స్క్వాడ్​లోని శునకం 30 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ దుండగులను.. ఆ తర్వాత ఆమెను హత్య చేసిన వారిని ఆ శునకం పట్టుకొని ఆశ్చర్యానికి గురిచేసింది. మొదట ఆ డాగ్ కు నిందితులు పారిపోయిన దిశను చూపించారు. దాన్ని పసిగటట్టిన ఆ డాగ్.. దాదాపు రెండు కిలోమీటర్లు పరుగెత్తి.. అక్కడ ఓ టెంట్ వద్ద ఆగింది.

అక్కడ ఆ డాగ్ మొరగడం మొదలు పెట్టింది. డాగ్ తో పాటు వచ్చిన స్క్వాడ్ అక్కడే ఉన్న రేపిస్టులను పట్టుకున్నారు. ఇలా వారికి నేరస్థులను పట్టుకోవడంలో డాగ్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పోలీసులు చెప్పుకొచ్చారు. ఇలా ఆ రేపిస్టులను పట్టుకోవడంలో ఉపయోగపడిన డాగ్ పేరు ‘జావా’ అని పోలీసులు పేర్కొన్నారు.

వైయస్ వివేకా హత్య కేసులో కొనసాగుతున్న విచారణ!

ఏపీ మాజీ మంత్రి వైయస్ వివేకా హత్యలో సీబీఐ విచారణ 69వ రోజు కొనసాగింది. అధికారులు రెండు బృందాలుగా పులివెందులలో విచారణ చేపట్టారు. తుమ్మలపల్లి కర్మాగారంలో పనిచేసే ఉద్యోగి ఉదయ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన తండ్రి ప్రకాష్ రెడ్డిని అధికారులు ప్రశ్నించారు .

కాగా విచారణలో భాగంగా అధికారులు ఇద్దరు అనుమానితులను విచారించారు. సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్​యాదవ్​తో పాటు అతని సమీప బంధువు భరత్​కుమార్​ యాదవ్​ను ప్రశ్నించారు. వివేకా కుమార్తె సునీత.. తనకు భద్రత కల్పించాలని ఎస్పీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పులివెందుల పోలీసులు వివేకా ఇంటి వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాక ఈనెల 10న పులివెందుల వివేకా ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరిగినా మణికంఠరెడ్డిని ఇవాళ పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పలు విషయాలపై మణికంఠ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అనంతరం… మణికంఠ రెడ్డిపై బైండోవర్ కేసు నమోదైంది. .