Tag Archives: jabardasth

Sujatha: సేవ్ ది టైగర్ సుజాత పాత్రను ఛాన్స్ మిస్ చేసుకున్న జబర్దస్త్ బ్యూటీ ఎవరో తెలుసా?

Sujatha: ఇటీవల కాలంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది ఇలా ఎన్నో వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి వాటిలో సేవ్ ది టైగర్ ఒకటి. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ వెబ్ వెబ్ సిరీస్ ఇప్పటికే సీజన్ వన్ పూర్తి చేసుకుంది. ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమఠం, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని శర్మ, యూట్యూబర్ గంగవ్వ, జబర్దస్త్ రోహిణిలు ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలలో నటించారు.

ఇక ఈ సీరియస్ మొత్తం మొగుడు పెళ్ళాల మధ్య గొడవలు గురించి తెరకెక్కినదని తెలుస్తుంది. ఇక ఇందులో ప్రియదర్శి జోర్దార్ సుజాత జంటగా ప్రేక్షకులను సందడి చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే తాజాగా ఈ సిరీస్ పార్ట్ 2 కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తోంది.

ఇకపోతే ఈ సిరీస్ లో సుజాత పాత్రలో నటించే అవకాశం ముందుగా తనకు రాలేదట వేరే జబర్దస్త్ కమెడియన్ ఈ అవకాశాన్ని రిజెక్ట్ చేయడంతో సుజాతకు వచ్చిందని తెలుస్తోంది. మరి ఈ అవకాశాన్ని వదులుకున్నటువంటి ఆ జబర్దస్త్ కమెడియన్ ఎవరనే విషయానికి వస్తే ఆమె మరెవరో కాదు రోహిణి అని చెప్పాలి.

సుజాత పాత్రలో రోహిణి..
ముందుగా ఈ సిరీస్ కోసం రోహిణి సంప్రదించారట అయితే ప్రియదర్శితో షూటింగ్ చేసే సమయంలో ఈమెకు డేట్స్ ఏ మాత్రం ఖాళీగా లేకపోవడంతో ఈమె స్థానంలో సుజాతను తీసుకున్నారని తెలుస్తుంది. ఇలా సుజాత పాత్రను మిస్ చేసుకున్నటువంటి రోహిణి తిరిగి ఇదే సిరీస్ లో పనిమనిషి పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.

Sowmyarao: జబర్దస్త్ మానేయడానికి అదే కారణం.. అసలు విషయం బయటపెట్టిన సౌమ్య రావు?

Sowmyarao: జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించినటువంటి వారిలో సౌమ్యరావు ఒకరు. ఈమె అనసూయ ఈ కార్యక్రమానికి యాంకర్ గా తప్పకున్న తర్వాత యాంకర్ గా పరిచయమయ్యారు అయితే ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కావడంతో తెలుగు పెద్దగా సరిగా రాకపోయినప్పటికీ పెద్ద ఎత్తున తన మాట తీరుతో అభిమానులను ఆకట్టుకునేవారు.

ఇలా జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతున్నటువంటి ఈమె ఈ కార్యక్రమం నుంచి సడన్ గా తప్పుకోవడంతో ఈమె స్థానంలో బిగ్ బాస్ సిరి యాంకర్ గా కొనసాగుతూ ఉన్నారు. అయితే సౌమ్యరావు ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడానికి గల కారణాలు ఏంటి విషయం గురించి ఈమెను ప్రశ్నించడంతో సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెబుతానని తెలిపారు. అయితే తాజాగా తాను జబర్దస్త్ వదిలేయడానికి కారణాలను తెలిపారు.

జబర్దస్త్ కార్యక్రమం ఒక తెలుగు షో నాకు తెలుగు సరిగా రాదు. ఇలా వచ్చిరాని తెలుగులో మాట్లాడుతూ ఉంటే చాలామంది నన్ను విమర్శలు చేశారు అంతే కాకుండా నాకు డాన్స్ కూడా పెద్దగా రాదు అందుకే డాన్స్ నేర్చుకోవడం కోసం ప్రత్యేకంగా క్లాసెస్ కి కూడా వెళ్తున్నానని తెలిపారు. అసలే తాను చాలా సన్నగా ఉంటానని డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండడంతో మరింత సన్నగా అవుతున్నానని తెలిపారు.

జోక్స్ అర్థమయ్యేవి కాదు..
ఇలా నేను సన్నగా అవ్వడం చూసినటువంటి జబర్దస్త్ డైరెక్టర్ డాన్స్ ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు మీరు ప్రాక్టీస్ చేయడం మానేయండి అంటూ నాకు సలహా ఇచ్చారు కానీ ఇలా డాన్స్ చేయలేక సరిగా తెలుగు మాట్లాడలేక స్కిట్ చేసేటప్పుడు ఆ జోక్స్ అర్థం కాక నేను ఎంతో ఇబ్బంది పడ్డానని అందుకే తాను ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నాను అంటూ ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Kiraak Rp: జబర్దస్త్ వదిలేయడానికి నాగబాబు కారణం.. మొత్తానికి నిజం బయటపెట్టిన ఆర్పీ?

Kiraak Rp: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారందరూ కూడా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో కిరాక్ ఆర్పీ ఒకరు. ఈయన నెల్లూరు యాసలో అద్భుతమైన కామెడీ డైలాగులు చెబుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారందరూ వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకుంటు ఉండగా ఈయన మాత్రం జబర్దస్త్ ఆరోపణలు చేస్తూ ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చేశారు మల్లెమాలవారు అక్కడ ఉన్నటువంటి వారికి కనీసం కడుపునిండా భోజనం పెట్టరని తాగడానికి కూడా మంచినీళ్లు ఇవ్వరని తెలిపారు. అంతేకాకుండా మా కష్టాన్ని దోచుకుంటున్నారని తెలిపారు.

మాతో స్కిట్లు చేయించుకొని సరైన విధంగా పేమెంట్లు ఇవ్వరని ఆరోపణలు చేశారు. అయితే ఆర్పీ చేసిన ఈ ఆరోపణలను హైపర్ ఆది సుడిగాలి సుదీర్ వంటి వారందరూ కూడా ఖండించారు. ఇక ఈ కార్యక్రమం వదిలి పెట్టినటువంటి ఈయన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ ప్రారంభించి రెస్టారెంట్ బిజినెస్ లో ఎంతో మంచి సక్సెస్ అయ్యారు.

నాగబాబు మానేయడమే కారణం..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఆర్పీ తను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేయడానికి కారణాలను తెలియజేశారు. జబర్దస్త్ కార్యక్రమంలో తాను పేమెంట్ అలాగే ఫుడ్ విషయం వదిలేయడానికి ఒక కారణం అయితే నాగబాబు కూడా మరో కారణమని తెలిపారు ఆయన ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిపోవడంతో నాకు కూడా అక్కడ ఉండాలి అనిపించడం లేదని తెలిపారు ఆయన అక్కడ ఉంటే మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించేవారు తప్పు చేస్తే మందలిస్తారు. స్కిట్ సరిగా రాకపోతే ప్రోత్సహిస్తారు. ఇలా అక్కడ ఆయన లేకపోవడంతో నాకు ఉండాలనిపించలేదు అంటూ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Hyper Aadi: ఆది ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉండటానికి అదే కారణమా.. దోషం పోవాలంటే అలా చేయాలా?

Hyper Aadi: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో హైపర్ ఆది ఒకరు. ఈయన కమెడియన్ గా జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగారు. అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ ఢీ వంటి కార్యక్రమాలలో సందడి చేశారు ఇలా ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలలోనూ మరోవైపు వెండితెరపై కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా కెరియర్ పరంగా హైపర్ ఆది ఎంతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇప్పటికే సింగిల్ గానే ఉంటున్నారు. హైపర్ ఆది ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. అయితే ఈయన పెళ్లి వయసు దాటిపోయిన ఇంకా పెళ్లి కాకపోవడంతో ఎక్కడికి వెళ్లిన తన పెళ్లి గురించి ప్రస్తావనకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది తనకు ఎందుకు ఇప్పటి వరకు పెళ్లి కాలేదు అనే విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. పెళ్లి బట్టలలో ఈ కార్యక్రమంలో కనిపించినటువంటి ఈయన తాగుబోతు రమేష్ ద్వారా తనకు పెళ్లి కాకపోవడానికి కారణాలను తెలియజేశారు ఇప్పటివరకు తనకు పెళ్లి కాకపోవడానికి కారణం జాతకంలో దోషమేనని తెలిపారు. తన జాతక దోష పరిహారం కోసం తనకు ముందుగా ముసలామెతో పెళ్లి జరిగితే పెళ్లి జరుగుతుంది అంటూ రమేష్ తెలిపారు.

జాతకంలో దోషమే కారణమా..
ఇలా జాతకంలో దోషం తొలగిపోవడానికి వృద్ధురాలితో పెళ్లి చేయాలని చెప్పారు. అయితే తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు అంటూ హైపర్ ఆది తెలిపారు. ఇలా తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరు రాకపోవడంతోనే జాతకంలో దోషం అలాగే ఉండిపోయిందని అందుకే నాకు ఇప్పటికీ పెళ్లి కాలేదు అంటూ హైపర్ ఆది తెలిపారు. అయితే ఇది నిజం కాదని కేవలం స్కిట్ లో భాగమని తెలుస్తుంది.

Shanmukh Jaswanth: షణ్ముఖ్ అరెస్టుపై స్పందించిన రూమార్డ్ గర్ల్ ఫ్రెండ్ సిరి హనుమంత్.. అస్సలుహించలేదంటూ?

Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ పరిచయం అవసరం లేని పేరు అయితే ఇటీవల ఈయన గంజాయిని సేవిస్తూ ఉండటంతో పోలీసులు తనని అరెస్టు చేసిన సంగతి మనకు తెలిసిందే. తన ఇంట్లోనే ఈయన గంజాయి సేవిస్తూ పోలీసులకు దొరికిపోయారు అంతేకాకుండా ఇతను దగ్గర నుంచి మరికొంత మొత్తంలో గంజాయిని పోలీసులు సేకరించారు.

ఈ విధంగా షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడటంతో ఆయన డిప్రెషన్ కారణంగానే తాను గంజాయి తీసుకున్నానని ఆత్మహత్య కూడా చేసుకోవాలని భావించాను అంటూ కారణాలను కూడా తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఈయన బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ విధంగా షణ్ముఖ్ గంజాయి తీసుకోవడానికి కారణం దీప్తి సునయనతో తనకు బ్రేకప్ అవ్వడమేనని, బ్రేకప్ కారణంగా ఆయన డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే షణ్ముఖ్ అరెస్ట్ కావడం గురించి తన రూమార్డ్ గర్ల్ ఫ్రెండ్ సిరి హనుమంత్ స్పందించారు. వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో చాలా చనువుగా ఉండడంతోనే దీప్తి సునయన తనకు బ్రేకప్ చెప్పింది అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి అయితే బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరూ కలిసి కనిపించిన సందర్భాలు లేవు అలాగే కెరియర్ పరంగా ఎవరికి వారు బిజీ అయ్యారు.

తనని కలవడం కరెక్ట్ కాదు…

ఇకపోతే తాజాగా సిరి షణ్ముఖ్ అరెస్టు గురించి స్పందిస్తూ.. అతని పర్సనల్ లైఫ్ ఇలా అవుతుందని నేను అసలు ఊహించలేదని ఈమె తెలిపారు. ఇక తనని కలవక పోవడానికి కారణం లేదని తనకు బ్రేకప్ అయిన తర్వాత తిరిగి తనతో కలవడం కరెక్ట్ కాదనిపించి తనకు దూరంగా ఉన్నాను అంటూ ఈ సందర్భంగా సిరి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Rashmi: రష్మీ బుల్లితెర సీరియల్స్ లో నటించినదా.. ఏ సీరియల్స్ అంటే?

Rashmi: బుల్లితెర యాంకర్ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో యాంకర్ రష్మీ ఒకరు. ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మీ వెండితెరపై కూడా సినిమాలలో హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.

పలు సినిమాలలో నటించినటువంటి ఈమెకు పెద్దగా సినిమాలలో అవకాశాలు రాలేదు పైగా ఈమె నటించిన సినిమాలు కూడా సక్సెస్ కాకపోవడంతో వెండితెరకు గుడ్ బై చెప్పి బుల్లితెరపై తన కెరియర్ కొనసాగిస్తున్నారు. ఇలా బుల్లితెర యాంకర్ గా ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి రష్మీ బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించారు.

ఇలా ఈమె రెండు సీరియల్స్ లో మాటీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లో చేశారని తెలుస్తుంది ఈమె లవ్ అనే సీరియల్ తో పాటు యువ అనే సీరియల్ లో కూడా నటించారు. ఇలా బుల్లితెరపై ఈమె నటించిన ఈ సీరియల్స్ మంచి ఆదరణ రావడంతో తనుకు సినిమా అవకాశాలు వచ్చాయి అయితే సినిమాలలో సక్సెస్ కాకపోవడంతో తిరిగి బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

వెండితెర సక్సెస్ ఇవ్వలేదా..

ఇలా వెండితెరపై ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేని రష్మీ బుల్లితెరపై మంచి సక్సెస్ కావడంతో ఈమె బుల్లితెరకు మాత్రమే పరిమితం అయ్యారని తెలుస్తోంది. ఇక ఇటీవల కాలంలో మనకు సినిమాలలో అవకాశాలు వచ్చినప్పటికీ హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Hyper Aadi: అమ్మాయిని అల్లరి చేసిన హైపర్ ఆది.. చితకబాదిన ఒంగోలు ప్రజలు!

Hyper Aadi: హైపర్ ఆది పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఆది ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ ఢీ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ కార్యక్రమాలతో పాటు వెండితెర సినిమా అవకాశాలను కూడా అందుకున్న ఆది కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక ఆది చేసే కామెడీ స్కిట్లు కనక చూస్తే ఈయన అమ్మాయిలపై డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతూ ఉంటారు. ఇలా అమ్మాయిలపై డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ వారిపై సెటైర్స్ వేసి ఒంగోలులో ఓ అమ్మాయిపై ఇలాంటి కామెంట్లు చేస్తూ అల్లరి పాలు చేయబోయారట దీంతో హైపర్ ఆది నుంచి అప్పట్లో ఒక వార్త ఈ వార్తలపై స్పందించారు.

ఆది జోర్దార్ సుజాతగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న డయల్ న్యూస్ ఛానల్ లో జోర్దార్ పార్టీ విత్ సుజాత పేరుతో టాక్ షో ప్రసారం అవుతుంది. ఈ షోకి హైపర్ ఆది గెస్ట్ గా వచ్చాడు దీంతో సుజాత ఒంగోలులో ఓ అమ్మాయిని అల్లరి చేయబోతే మస్తు కొట్టారంటగా అంటూ ఈయనని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు ఆది స్పందిస్తూ నేను స్కిట్లలో తప్ప అమ్మాయితో బయట మాట్లాడను ఆ స్కిట్ అయిపోతే నేను అమ్మాయిలతో అసలు మాట్లాడానని నాకు అలవాటు లేదని ఈయన తెలిపారు.

అమ్మాయిలతో నేను అసలు మాట్లాడను..

అమ్మాయిలను అల్లరి చేస్తుంటే నన్ను కొట్టారు అంటూ వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని అది క్లారిటీ ఇచ్చారు. హైపర్ ఆది ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలంలో గల చిన్న గ్రామంలో పుట్టాడు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో చదువుకున్నాడు. ఆ రోజుల్లో హైపర్ ఆది ఓ అమ్మాయి కారణంగా తన్నులు తిన్నారనే వాదన రావడంతో ఈయన క్లారిటీ ఇచ్చారు.

Pavitra: వాలెంటైన్స్ డే రోజే కాబోయే భర్తకు బ్రేకప్ చెప్పిన జబర్దస్త్ కమెడియన్?

Pavitra: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి వారిలో పవిత్ర ఒకరు. ఈమె జబర్దస్త్ కార్యక్రమంలో మాత్రమే కాకుండా యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి తరచు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇదిలా ఉండగా గతంలో ఈమె తన ప్రియుడు సంతోష్ అనే మరో యూట్యూబర్ ను అందరికీ పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

వీళ్ళిద్దరూ మళ్లీ పెళ్లి అంటూ ఒక పెళ్లి వీడియోని చేసి అందరికీ షాక్ ఇచ్చారు అయితే ఇది ప్రాంక్ అని చెప్పారు. ఇక ఈ వీడియో చేసిన కొన్ని నెలలకే ఈమె సంతోష్ ను ప్రేమిస్తున్నానని తన ప్రేమ విషయాన్ని అందరికీ తెలియజేశారు. ఇక గత ఏడాది నవంబర్ నెలలో ఈమె తనతో నిశ్చితార్థం జరుపుకొని తన ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక వాలెంటెన్స్ డే రోజు ప్రతి ఒక్కరు కూడా తమ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉండగా పవిత్ర మాత్రం అందరికీ షాక్ ఇచ్చారు. ఈమె తన ప్రియుడు సంతోష్ కు బ్రేకప్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పవిత్ర సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తామిద్దరం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ఈ సమయంలో మాకు సపోర్ట్ చేయండి అంటూ ఈమె కోరారు.

నిజమేనా లేక ప్రాంక్ నా..

ఇలా తమ బ్రేకప్ న్యూస్ సోషల్ మీడియా వేదికగా తెలియజేయడమే కాకుండా కామెంట్ బాక్స్ కూడా ఈమె క్లోజ్ చేశారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో సంతోష్ తో కలిసి దిగినటువంటి ఫోటోలు అన్నింటిని కూడా డిలీట్ చేశారు.దీనితో ఈ వార్తలు కాస్త వైరల్ కావడంతో నిజంగానే తనకు బ్రేకప్ చెప్పారా లేకపోతే ఇది కూడా ప్రాంకేనా అంటూ అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

https://www.instagram.com/p/C3VK8e_pxEF/?utm_source=ig_embed&ig_rid=64f16ca7-e277-44b2-b3c1-389af841a6d0

Avinash: బిడ్డను కోల్పోవడంపై మరోసారి స్పందించిన అవినాష్.. ది బెస్ట్ రాబోతుందంటూ?

Avinash: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ముక్కు అవినాష్ ఇటీవల బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల అవినాష్ తండ్రి కాబోతున్నారు అంటూ ఈ శుభవార్త అందరికీ తెలియజేసిన సంగతి తెలిసిందే.

ఇలా తన భార్య అనూజ బేబీ బంప్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే కొన్ని కారణాలవల్ల అవినాష్ బిడ్డ పురటిలో మరణించింది. ఈ విషయాన్ని ఈయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. కొన్ని కారణాలవల్ల నా బిడ్డను కోల్పోయాము దయచేసి ఎవరూ కూడా ఈ విషయం గురించి ప్రశ్నలు వేస్తూ మమ్మల్ని బాధ పెట్టకండి నాకు సంతోషం కలిగిన బాధ కలిగిన మీతో పంచుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది అందుకే ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను అంటూ ఈయన అసలు విషయం వెల్లడించారు.

ఇక అవినాష్ ఎవరు దీని గురించి ప్రశ్నలు అడగద్దు అంటే ఈ విషయాన్ని అందరూ కూడా మర్చిపోయారు కానీ తాజాగా మరోసారి అవినాష్ ఈ విషయం గురించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కూడా మా బాధను అర్థం చేసుకొని ఈ విషయం గురించి మమ్మల్ని ప్రశ్నించలేదని తెలిపారు. అయితే చాలామంది సినిమా వాళ్లు ఇతర నటీనటులు ఫోన్లు చేస్తూనే ఉన్నారని అవినాష్ తెలిపారు.

కరిగిపోయిన మేఘం..

తల్లిదండ్రులు కాబోతున్నామని ఆరోజు కోసం ఎంతో ఎదురు చూశాము కానీ బిడ్డను కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన నుంచి మేము కూడా త్వరగానే కోలుకున్నాము ఇది మా జీవితంలో కరిగిపోయిన మేఘం లాంటిదని తెలిపారు. ఇలా బిడ్డను కోల్పోగా ఫ్యూచర్లో మాకు ఇంకా ది బెస్ట్ రాబోతుందేమో అనుకుంటున్నాము అంటూ ఈ సందర్భంగా ఆమెనా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Venkatesh: ఆ జబర్దస్త్ కమెడియన్ ను లాగిపెట్టి కొట్టిన వెంకటేష్… ఏం జరిగిందంటే?

Venkatesh: తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి విక్టరీ వెంకటేష్ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సైందవ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జనవరి 13వ తేదీ విడుదల కాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వెంకటేష్ తాజాగా ఈటీవీలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రసారమవుతున్నటువంటి స్పెషల్ ఎపిసోడ్ అల్లుడా మజాకా అనే కార్యక్రమానికి గెస్ట్ గా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సీనియర్ హీరోయిన్స్ అయినటువంటి మీనా కుష్బూ వంటి వారు కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్స్ ఎప్పటిలాగే తమ కామెడీ పంచ్ డైలాగ్స్ తో అందరిని మెప్పించారు.

ఇకపోతే జబర్దస్త్ కమెడియన్ సుధాకర్ పై వెంకటేష్ చేయి చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఎందుకు సుధాకర్ పై వెంకటేష్ చేయి చేసుకున్నారనే విషయానికి వస్తే ఒక స్కిట్ లో భాగంగా ఈయన ఘర్షణ సినిమాలోని ఏసీపీ రామచంద్ర పాత్రలో నటించారు. పాట పాడమని వెంకటేష్ చెప్పగా రింగ రింగా అనే పాట పాడారు.

నిర్లక్ష్యంగా సమాధానం…

సుధాకర్ పాట పాడిన తర్వాత వెంకటేష్ ఏంట్రా అది అని అడగగా వెంటనే సుధాకర్ పాట అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో వెంకటేష్ లాగి చెంపపై ఒకటి కొట్టారు. అనంతరం పొట్టి నరేష్ ను నిన్ను ఎక్కడ కొట్టాలి రా అంటూ వెంకటేష్ కామెడీ పండించారు. మొత్తానికి ఈ కార్యక్రమంలో వెంకటేష్ భారీ స్థాయిలోనే ప్రేక్షకులను సందడి చేశారని తెలుస్తుంది.