Kiraak Rp: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారందరూ కూడా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో కిరాక్ ఆర్పీ ఒకరు. ఈయన నెల్లూరు యాసలో అద్భుతమైన కామెడీ డైలాగులు చెబుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారందరూ వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకుంటు ఉండగా ఈయన మాత్రం జబర్దస్త్ ఆరోపణలు చేస్తూ ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చేశారు మల్లెమాలవారు అక్కడ ఉన్నటువంటి వారికి కనీసం కడుపునిండా భోజనం పెట్టరని తాగడానికి కూడా మంచినీళ్లు ఇవ్వరని తెలిపారు. అంతేకాకుండా మా కష్టాన్ని దోచుకుంటున్నారని తెలిపారు.
మాతో స్కిట్లు చేయించుకొని సరైన విధంగా పేమెంట్లు ఇవ్వరని ఆరోపణలు చేశారు. అయితే ఆర్పీ చేసిన ఈ ఆరోపణలను హైపర్ ఆది సుడిగాలి సుదీర్ వంటి వారందరూ కూడా ఖండించారు. ఇక ఈ కార్యక్రమం వదిలి పెట్టినటువంటి ఈయన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ ప్రారంభించి రెస్టారెంట్ బిజినెస్ లో ఎంతో మంచి సక్సెస్ అయ్యారు.
నాగబాబు మానేయడమే కారణం..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఆర్పీ తను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేయడానికి కారణాలను తెలియజేశారు. జబర్దస్త్ కార్యక్రమంలో తాను పేమెంట్ అలాగే ఫుడ్ విషయం వదిలేయడానికి ఒక కారణం అయితే నాగబాబు కూడా మరో కారణమని తెలిపారు ఆయన ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిపోవడంతో నాకు కూడా అక్కడ ఉండాలి అనిపించడం లేదని తెలిపారు ఆయన అక్కడ ఉంటే మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించేవారు తప్పు చేస్తే మందలిస్తారు. స్కిట్ సరిగా రాకపోతే ప్రోత్సహిస్తారు. ఇలా అక్కడ ఆయన లేకపోవడంతో నాకు ఉండాలనిపించలేదు అంటూ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…