Movie News

Rana: నన్ను ఏదైనా అడగాలంటే అవయవాలు దానం చేయాలి… రానా కామెంట్స్ వైరల్!

Rana: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రానా ఒకరు. ఈయన లీడర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. ఇలా దగ్గుబాటి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి రానా ఎన్నో విభిన్న కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఇక తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో నటించడానికి కూడా రానా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే పలు సినిమాలలో విలన్ పాత్రలలో నటించారు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందినటువంటి ఈయన ప్రస్తుతం వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా రానా గుర్గావ్ లో జరిగిన సినాప్స్ వేడుకలలో రానా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ ఆరోగ్యం గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రానా ఇటీవల కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈయన తన అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ..

ప్రకృతికి మించిన వైద్యం లేదు…
ఎవరైనా నా ఆరోగ్యం గురించి ఏదైనా అడగాలి అంటే ముందుగా మీరు అవయవాలు దానం చేస్తానని చెప్పండి. అలాంటి ఆలోచన మీకు ఉంటేనే నన్ను నా ఆరోగ్యం గురించి అడగండి లేదంటే ఆలోచనను విరమించుకోండి అంటూ ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మనిషి చివరిదశలో ఉన్నప్పుడే జీవితాన్ని విభిన్నంగా చూస్తాడు.ఆ క్షణం ఆలోచన విధానం మారిపోతుంది. ఇందుకు నేను మినహాయింపు కాదని తెలిపారు. అనారోగ్య సమస్యల కారణంగా బాహుబలి సినిమా సమయంలో పెరిగిన బరువు పూర్తిగా తగ్గిపోయానని అనంతరం అరణ్య సినిమా కోసం ఏడాది పాటు అడవులలో తిరుగుతూ ఉన్నానని ప్రకృతికి మించిన వైద్యం మరేది లేదంటూ ఈ సందర్భంగా రానా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago