NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్లో దసరా పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ ఒక సినిమా చేయాలి అంటే కచ్చితంగా ఆయన ఒప్పుకొనే సినిమాలలో రెండు అంశాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలని ముందుగానే దర్శక నిర్మాతలకు సూచిస్తారట మరి ఎన్టీఆర్ సినిమాలలో తప్పనిసరిగా ఉండాల్సిన ఆ అంశాలు ఏంటి అనే విషయానికి వస్తే..
డాన్స్… యాక్షన్ సీక్వెన్స్..
ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా డాన్స్ చేస్తారనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తన సినిమాలు డాన్స్ చేసే విధంగా పాటలకు స్కోప్ ఉండాలని ఈయన కండిషన్ పెడతారట అదే విధంగా ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉండాలని ఈయన దర్శక నిర్మాతలకు చెబుతారట. ఈ రెండు తన సినిమాలలో తప్పనిసరిగా ఉండేలా ఎన్టీఆర్ జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ డాన్స్ అంటే ఇష్టపడేవారు ఎంతోమంది ఉన్నారనే సంగతి మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…