Tag Archives: Jayalalithaa

Kangana Ranaut: ఉత్తమ నటిగా సైమా అవార్డు అందుకున్న కంగనా.. అవార్డు ఇస్తూ నవ్వులపాలైన సైమా నిర్వాహకులు!

Kangana Ranaut: ప్రతి ఏడాది చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తూ వివిధ భాషల నుంచి కొన్ని సినిమాలను సెలెక్ట్ చేసి సైమా అవార్డులను ప్రధానం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే 2021 సంవత్సరానికి గాను సైమా అవార్డు వేడుకలను బెంగళూరులో ఎంతో ఘనంగా నిర్వహించారు. వివిధ భాషల నుంచి బెస్ట్ సినిమాలను ఎంపిక చేసి ఈ అవార్డులను ప్రధానం చేశారు.

ఇకపోతే తమిళంలో తెరకెక్కిన తలైవి సినిమాలో నటించినందుకుగాను ఉత్తమ నటిగా కంగనా రనౌత్ సైమా అవార్డు అందుకున్నారు.అయితే ఈమెకు సాయి
సైమా అవార్డు ఇవ్వడంతో సైమా నిర్వాహకులు పెద్ద ఎత్తున నవ్వుల పాలయ్యారు. ముఖ్యంగా తలైవి సినిమాలో జయలలిత పాత్రకు కంగనా ఏమాత్రం సరిపోలేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి అదేవిధంగా ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది.

Kangana Ranaut: డబ్బు పెట్టినోళ్లే అవార్డు ఇవ్వడం ఏంటి..

ఇలా మిశ్రమ స్పందన దక్కించుకున్న ఈ సినిమాలో నటించిన కంగనాకు సైమా అవార్డు ఇవ్వడం ఏంటి అని అందరూ నవ్వుకున్నారు. ఇక్కడ మరొక ట్విస్ట్ ఏమిటంటే తలైవి సినిమాను నిర్మించినది మరెవరో కాదు సైమా వేడుకలను నిర్వహించే వాళ్లే నిర్మాతలుగా వ్యవహరించారు. ఇలా డబ్బు పెట్టిన వాళ్ళే తిరిగి ఆ సినిమాకి అవార్డు ఇవ్వడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడమే కాకుండా నవ్వుల పాలయ్యారు.

అయితే తమిళంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు సైమా నామినేషన్ లో ఉన్నప్పటికీ కంగనాకు ఈ అవార్డు రావడం పట్ల నిజంగానే ఆడియన్స్ పోల్ ద్వారానే ఈ అవార్డులు ఇస్తున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సైమ నామినేషన్ లో భాగంగా తమిళంలో నిలిచినటువంటి సినిమాలు ఏంటి అనే విషయానికి వస్తే..నెట్రికన్‌’ నుండి నయనతార, ‘జై భీమ్‌’ నుండి లియోమోల్‌ జోజ్‌, ‘అన్‌బిర్‌కినియాల్‌’ నుండి కీర్తి పాండియన్‌, ‘తిట్టమ్‌ ఇరండు’ నుండి ఐశ్వర్య రాజేష్‌ పోటీలో ఉన్నప్పటికీ కంగనాకు అవార్డు రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

NTR -Chiranjeevi: ఎన్టీఆర్ చిరంజీవి మధ్యలో సొంత రాజకీయ పార్టీని స్థాపించిన తెలుగు హీరో ఎవరో తెలుసా?

NTR -Chiranjeevi: సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉంది.రాజకీయాలలో కొనసాగిన వారు సినిమాలలోకి రావడం సినిమాలలో కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు రాజకీయాలలోకి వెళ్లడం సర్వసాధారణంగా జరిగే అంశం. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులుగా గుర్తింపు సంపాదించుకొని రాజకీయ నాయకులుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు ఉన్నారు. అలాంటి వారిలో ఎన్టీఆర్, ఎంజీఆర్ జయలలిత వంటి వారు ఒకరు.

ఈ నటీనటులను ఆదర్శంగా తీసుకొని కమల్ హాసన్ చిరంజీవి వంటి తదితరులు కూడా రాజకీయాలలోకి వచ్చారు.ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే నందమూరి తారక రామారావు 58 సంవత్సరాల వయసులో తెలుగుదేశం పార్టీని స్థాపించి పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు. ఇక ఎన్టీఆర్ స్ఫూర్తిగా మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికలలో పోటీ చేసినప్పటికీ ఈయనకు పెద్దగా రాజకీయాలు కలిసి రాకపోవడంతో తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.

ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి కన్నా ముందుగా మరొక టాలీవుడ్ హీరో సొంతంగా రాజకీయ పార్టీని పెట్టారు. అయితే ఈ రాజకీయ పార్టీ గురించి చాలామందికి తెలియదు. ఇలా ఎన్టీఆర్ తర్వాత సొంత రాజకీయ పార్టీ పెట్టిన హీరో మరెవరో కాదు నందమూరి తారక రామారావు కుమారుడు, నటుడు హరికృష్ణ. ఈయన తన తండ్రి తర్వాత సొంత రాజకీయ పార్టీని పెట్టారు.

NTR -Chiranjeevi: అన్న తెలుగుదేశం పార్టీ…

హరికృష్ణ 1999లో అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు.ఇలా సొంత పార్టీని స్థాపించిన ఈయన గంట గుర్తుతో 1999 సార్వత్రిక ఎన్నికలలో పోటీకి దిగారు. అయితే ఈయన పార్టీ ఏ విధమైనటువంటి ప్రభావం చూపకపోవడంతో హరికృష్ణ తిరిగి టిడిపి పార్టీలో క్రియాశీలకంగా మారి పార్టీ వ్యవహారాలను చూసుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ తరపున ఈయన రాజ్యసభ సభ్యునిగా కూడా పనిచేశారు. అయితే ఈయన పెట్టిన అన్న తెలుగుదేశం పార్టీ గురించి చాలామందికి తెలియదు.