Tag Archives: karan

Vijay Devarakonda: లైగర్ కోసం విజయ్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతి పోవాల్సిందే.. ఎన్ని కోట్లో తెలుసా?

Vijay Devarakonda: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అనంతరం పెళ్లిచూపులు సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటుడు విజయ్ దేవరకొండ. మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన వరుస సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈయనకున్న క్రేజ్ చూసి ఏకంగా పాన్ ఇండియా సినిమాలలో నటించే అవకాశాలను కూడా అందుకున్నారు.

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కి ఈనెల 25వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.ఇక ఈ సినిమా ఇటు పూరి జగన్నాథ్ కెరీర్ లోను, విజయ్ దేవరకొండ కెరియర్ లోను భారీ బడ్జెట్ సినిమా అని చెప్పాలి. ఇక ఈ సినిమాని బాలీవుడ్ నిర్మాత జోహార్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

ఇక ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.విజయ్ దేవరకొండ మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కోసం ఏకంగా 35 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.

Vijay Devarakonda: భారీ అంచనాలను పెంచిన ట్రైలర్…

ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా సినిమా అవకాశాలను అందుకొని భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.ఇకపోతే విజయ్ దేవరకొండ ఈ సినిమాతో తన మార్కెట్ మరింత పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్ పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం ఇటు సౌత్ అభిమానులు మాత్రమే కాకుండా నార్త్ అభిమానులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Aamir Khan: వారానికి ఒక్కసారైనా నా మాజీ భార్యలను కలుస్తాను.. అమీర్ ఖాన్ కామెంట్స్ వైరల్!

Aamir Khan:బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.ఈయన నటించిన ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషలలో కూడా పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి కాఫీ విత్ కరణ్ టాక్ షో కి లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్ కోసం నటుడు అమీర్ ఖాన్, నటి కరీనా కపూర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా కరణ్ వీరిద్దరిని ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టారు.

ఈ క్రమంలోనే అమీర్ ఖాన్ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. ఈయన ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరికీ విడాకులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా అమీర్ మాట్లాడుతూ మేము విడాకులు తీసుకున్నప్పటికీ వారితో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నానని తెలిపారు.మా రిలేషన్ షిప్ లో ప్రేమ గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం ఉన్నాయి తప్ప మరే విధమైనటువంటి ఉద్దేశం లేదని తెలిపారు.

Aamir Khan: ఒకే కుటుంబంలా కలిసిపోతాం

ఈ విధంగా తన మాజీ భార్యలు ఇద్దరు తనపై ఎంతో గౌరవం చూపిస్తారని, ఇప్పటికీ తామంతా ఒక కుటుంబం లాగే కలిసి మెలిసి ఉంటామని ఇలా వారిని నేను వారానికి ఒక్కసారైనా కలుస్తూ ఉంటానని అమీర్ ఖాన్ తన వ్యక్తిగత విషయాల గురించి తెలిపారు.విడాకులు ఇచ్చిన తర్వాత కూడా మేమంతా ఒకే కుటుంబంలా తరచూ కలుస్తూ ఉంటామని ఈయన చెప్పిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Karan – Kajol: పబ్లిక్ గా కాజోల్ కి ముద్దు పెట్టిన కరణ్ జోహార్…. ఏకిపారేస్తున్న నెటిజన్లు?

Karan – Kajol: బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మిస్తూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు.ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూ 120 కోట్లతో లైగర్ సినిమాని తెరకెక్కిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Karan – Kajol: పబ్లిక్ గా కాజోల్ కి ముద్దు పెట్టిన కరణ్ జోహార్…. ఏకిపారేస్తున్న నెటిజన్లు?

ఇకపోతే తాజాగా ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ అపూర్వ మోహత పుట్టిన రోజు వేడుకను ఘనంగా జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ పుట్టినరోజు వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా పూరి జగన్నాథ్ లైగర్ టీమ్ పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఇక ఈ పుట్టినరోజు వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ అగర్వాల్ హాజరయ్యారు. బ్లాక్ లాంగ్ ఫ్రాక్ ధరించిన ఈమె ఎంతో హాట్ గా కనిపించారు. ఇక ఈ పుట్టినరోజు వేడుకలకు కాజోల్ రావడంతో నిర్మాత కరణ్ జోహార్ ఆమెకు స్వాగతం పలికి ఏకంగా తన పై ముద్దుల వర్షం కురిపించారు.

పబ్లిక్ ప్లేస్ లో ముద్దులు ఏంటీ…

ఇలా కరణ్ జోహార్ నటి కాజోల్ ఇద్దరూ కలిసి కెమెరాలకు ఫోజులు ఇచ్చారు అనంతరం కరణ్ జోహార్ నటి కాజోల్ కి ముద్దులు పెట్టడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు పెద్దఎత్తున వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా పబ్లిక్ ప్లేస్ లో నటికి ముద్దులు పెట్టడం ఏంటి కరణ్ అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.