Aamir Khan:బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.ఈయన నటించిన ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషలలో కూడా పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి కాఫీ విత్ కరణ్ టాక్ షో కి లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్ కోసం నటుడు అమీర్ ఖాన్, నటి కరీనా కపూర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా కరణ్ వీరిద్దరిని ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టారు.
ఈ క్రమంలోనే అమీర్ ఖాన్ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు. ఈయన ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరికీ విడాకులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సందర్భంగా అమీర్ మాట్లాడుతూ మేము విడాకులు తీసుకున్నప్పటికీ వారితో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నానని తెలిపారు.మా రిలేషన్ షిప్ లో ప్రేమ గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం ఉన్నాయి తప్ప మరే విధమైనటువంటి ఉద్దేశం లేదని తెలిపారు.
ఈ విధంగా తన మాజీ భార్యలు ఇద్దరు తనపై ఎంతో గౌరవం చూపిస్తారని, ఇప్పటికీ తామంతా ఒక కుటుంబం లాగే కలిసి మెలిసి ఉంటామని ఇలా వారిని నేను వారానికి ఒక్కసారైనా కలుస్తూ ఉంటానని అమీర్ ఖాన్ తన వ్యక్తిగత విషయాల గురించి తెలిపారు.విడాకులు ఇచ్చిన తర్వాత కూడా మేమంతా ఒకే కుటుంబంలా తరచూ కలుస్తూ ఉంటామని ఈయన చెప్పిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…