Dil Raju: డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో మంచి లాభాలను అందుకొని మొదటిసారిగా దిల్ సినిమాని నిర్మించారు.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఏకంగా ఈ సినిమా పేరు ఆయన ఇంటి పేరుగా పక్కన చేరడంతో ఈయన ఇండస్ట్రీలో దిల్ రాజుగా స్థిరపడిపోయారు.
ఇలా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం వందల కోట్ల బడ్జెట్ సినిమాలను కూడా తెరకెక్కిస్తున్నారు.ఇన్ని రోజులు కేవలం తెలుగు సినిమాలను మాత్రమే నిర్మించిన దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాలను కూడా నిర్మిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో మృతి చెందడంతో తేజస్విని అనే అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ దంపతులకు జూలై 29వ తేదీ పండంటి కుమారుడు జన్మించారు.ఇలా దిల్ రాజు కుటుంబానికి వారసుడు రావడంతో ఎంతో మురిసిపోయిన దిల్ రాజు తన కుమారుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇకపోతే తాజాగా దిల్ రాజు అతని భార్య తేజస్విని కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే స్వామివారి దర్శనం అనంతరం దిల్ రాజు ఆలయం వెలుపలకు రావడంతో మీడియా ఒక్కసారిగా అతనిపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే ఈయన కుమారుడితో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…