Tag Archives: kashmir

Ramcharan: హాలీవుడ్ సినిమాలు చేస్తే దర్శకులకు ఆ కండిషన్ తప్పనిసరి: రామ్ చరణ్

Ramcharan: మెగా పవర్ స్టార్,గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కాశ్మీర్లో జరుగుతున్న g20 సదస్సులో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.మే 22 నుంచి మూడు రోజులు పాటు జరిగే ఈ వేడుకలలో రామ్ చరణ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ తరపున హాజరయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. మన ఇండియాలో ఎంతో అందమైన లొకేషన్లో ఉన్నాయి. కాశ్మీర్ లాంటి అందమైన లొకేషన్లో ఈ సదస్సు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుందని రామ్ చరణ్ తెలియజేశారు.

మన ఇండియాలో కేరళ కాశ్మీర్ వంటి ఎన్నో ఆహ్లాదకరమైన ప్రాంతాలు ఉన్నాయని ఈ ప్రాంతాలన్నింటిని తాను సినిమాల ద్వారా ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నానని చరణ్ తెలిపారు.ఇకపై లొకేషన్ ల కోసమే ఇతర దేశాలకు వెళ్లకూడదని నిర్ణయాన్ని నేను తీసుకుంటున్నానని రామ్ చరణ్ తెలిపారు.

Ramcharan: నార్త్ సౌత్ తేడాలు లేవు…


ఇక తాను భవిష్యత్తులో హాలీవుడ్ సినిమాలు చేసిన హాలీవుడ్ దర్శకులకు కూడా తాను ఇదే కండిషన్ పెడతానని, హాలీవుడ్ దర్శకులకి కూడా ఇండియాలో ఉండే ప్రకృతి అందాలను చూపిస్తాను అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇండియాలో నార్త్ సౌత్ అని రెండు సినిమాలు లేవు ఉన్నది ఒక్కటే అది ఇండియన్ సినిమా అంటూ ఈ సందర్భంగా చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కిడ్నీని అమ్ముతానంటూ పేపర్ లో యాడ్ ఇచ్చిన యువకుడు.. చివరకు..?

కరోనా మహమ్మారి విజృంభణ దేశంలోని వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ రంగం ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాలకు చెందిన వ్యాపారులు లాక్ డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయారు . చాలామంది వ్యాపారులకు లాక్ డౌన్ వల్ల లక్షల్లో నష్టం వాటిల్లింది. దీంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక చాలామంది వ్యాపారులు ఉన్న ఆస్తులను అమ్మేసుకుంటున్నారు. కేంద్రం మారటోరియం ప్రయోజనాలను కల్పించినా వాటి వల్ల లాభం పొందిన వారి సంఖ్య చాలా తక్కువ.

చేసిన అప్పులు తీరకపోవడంతో చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో శరీరంలోని అవయవాలను అమ్మేయాలని చూస్తున్నారు. తాజాగా కశ్మీర్ కు చెందిన వ్యాపారి ఏకంగా తన కిడ్నీలను అమ్మాలనుకుంటున్నానని పేపర్ లో యాడ్ ఇచ్చాడు. 91 లక్షల రూపాయలు అప్పు చేసిన వ్యాపారికి అప్పును ఏ విధంగా తీర్చాలో అర్థం కాలేదు. కిడ్నీ అవసరం ఉన్నవారు తనను సంప్రదించమని అతను పేపర్ లో యాడ్ ఇచ్చాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే కశ్మీర్ లోని కుల్గమ్‌ జిల్లాకు చెందిన సబ్జర్ అహ్మద్ ఖాన్ కారు డీలర్ గా పని చేసేవాడు. లాక్ డౌన్ వల్ల వ్యాపారంలో అప్పటివరకు సంపాదించిన డబ్బు మొత్తం అహ్మద్ కోల్పోయాడు. ఆర్టికల్ 370 సమయంలో లాక్ డౌన్ అమలు వల్ల నష్టపోయిన వ్యాపారి కరోనా వల్ల మరింత నష్టపోయాడు. అయితే పేపర్ యాడ్ వైరల్ కావడంతో పోలీసులు వ్యాపారిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారని తెలుస్తోంది.

మన దేశ చట్టాల ప్రకారం అవయవాలను విక్రయించడం నేరం కావడంతో పోలీసులు వ్యాపారిని సున్నితంగా హెచ్చరించారని దీంతో సదరు వ్యాపారి కిడ్నీ అమ్మాలనే ఆలోచనను విరమించుకున్నాడని తెలుస్తోంది.