Tag Archives: Khushi movie

Nagachaitanya: ఖుషి ట్రైలర్ చూసి బయటకు వచ్చిన చైతు…. వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చిన హీరో!

Nagachaitanya: అక్కినేని నాగచైతన్య సమంత ఇద్దరు విడాకులు తీసుకున్న తరువాత కూడా వీరి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయి దాదాపు మూడు సంవత్సరాలవుతుంది అయినప్పటికీ వీరి కెరియర్ గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి తరచూ ఏదో ఒక వార్త చెక్కరలు కొడుతూనే ఉంటుంది.

ఇకపోతే తాజాగా నటి సమంతా ఖుషి సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కాబోతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సమంత భార్య భర్తలుగా నటించారని చెప్పాలి.ఇకపోతే ఖుషి సినిమా ట్రైలర్ చూసి నాగచైతన్య ఆవేశంతో బయటకు వచ్చారు అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.

ఇటీవల సుప్రియ యార్లగడ్డ నిర్మాణంలో వచ్చిన బాయ్స్ హాస్టల్ సినిమా ఈనెల 26వ తేదీ విడుదలైంది అయితే ఈ సినిమా విడుదల ముందు ప్రీమియర్ షో వేశారట. ఈ ప్రీమియర్ షో చూడటానికి నాగచైతన్యను కూడా ఆహ్వానించారు. అయితే ఈ షో చూస్తున్న సమయంలోనే ఖుషి సినిమా ట్రైలర్ రావడంతో ఈయన కోపంతో బయటకు వచ్చారని వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలు పై స్పందించిన నాగచైతన్య అదంతా అవాస్తవమని తెలియజేశారు.

Nagachaitanya: కావాలని సృష్టించిన రూమర్లు….

ఒక ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి నాగచైతన్య ఈ విషయం గురించి స్పందిస్తూ..తాను థియేటర్ నుంచి వెళ్లిపోయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. అవన్నీ పూర్తిగా అవాస్తవాలు, కావాలని సృష్టించిన రూమర్స్. ఈ ఫేక్ న్యూస్ గురించి నా దృష్టికి వచ్చింది. దీనితో సదరు మీడియాకి ఆ వార్తలని సరి చేయమని సూచించినట్లు నాగచైతన్య వెల్లడించారు.

Samantha: విజయ్ దేవరకొండకు కాబోయే భార్య అలాగే ఉండాలి… సమంత కామెంట్స్ వైరల్!

Samantha: సమంత నటుడు విజయ్ దేవరకొండతో కలిసి జంటగా నటించిన చిత్రం ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోని విజయ్ దేవరకొండ గురించి ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడుగుతూ సమంత నుంచి సమాధానాలు రాబట్టారు.

ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ షూటింగ్ లొకేషన్లోకి రాగానే మొదటగా ఏం మాట్లాడుతారు అనగానే సమంత సమాధానం చెబుతూ శివ ఈరోజు ఏం షూట్ చేయబోతున్నావు అని అడుగుతారు అంటూ సమంత సమాధానం చెప్పారు. ఇక షూటింగ్ సెట్లో ఈయన ఎక్కువగా ఎవరితో ఫోన్ కాల్స్ మాట్లాడతారు అని కూడా ప్రశ్నించగా సమంత మాత్రం ఈయన ఫోన్ కాల్స్ మాట్లాడరు కానీ చాటింగ్ చేస్తూ ఉంటారని సమంత సమాధానం చెప్పారు.

ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సమంత విజయ్ దేవరకొండకు కాబోయే భార్యలో ఉండాల్సిన క్వాలిటీస్ గురించి కూడా తెలియజేశారు. సమంత ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అందరితోనూ కలిసిపోయే అమ్మాయి అయ్యుండాలి ముఖ్యంగా ఫ్యామిలీతో కలిసి పోయే అమ్మాయి అయితే బాగుంటుందని విజయ్ భావిస్తున్నారు.

Samantha: బూతులు మాట్లాడతారు…


ఇలా ఫ్యామిలీతో కలిసిపోయే అమ్మాయి విజయ్ దేవరకొండకు భార్యగా వస్తే బాగుంటుందని విజయ్ భావిస్తున్నారంటూ ఈ సందర్భంగా ఈమె చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా సమంత మాట్లాడుతూ విజయ్ దేవరకొండ ఎక్కువగా సంతోషంలో ఉంటే ఆయన నోటి వెంట బూతు పదాలు కూడా వస్తాయి అంటూ సమంత షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Samantha: దేవుని దయవల్ల విజయవాడలో ఇడ్లీ స్టాల్ పెట్టుకొని పరిస్థితి రాలేదు… సమంత షాకింగ్ కామెంట్స్!

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి సమంత ప్రస్తుతం ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించారు. అయితే ఈమె నటించిన ఖుషి సినిమా ప్రమోషన్లలో మాత్రం పాల్గొంటున్నారు. తాజాగా ఖుషి సినిమా మ్యూజిక్ కన్సర్ట్ కార్యక్రమంలో భాగంగా సమంత పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో సమంతా లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చి సందడి చేశారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా సమంత మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలియచేశారు. ఈ సినిమా తనకు ఎంతో అద్భుతంగా నచ్చిందనీ ముఖ్యంగా పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయని తెలిపారు మీ అందరితో పాటు తాను కూడా ఒకటవ తేదీ ఈ సినిమా చూడటానికి ఎదురుచూస్తున్నానని వెల్లడించారు.

ఇక తన ఆరోగ్యం గురించి కూడా మాట్లాడుతూ ప్రస్తుతం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నానని పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు తిరిగి వస్తాను అంటూ కూడా తన ఆరోగ్యం గురించి తెలియజేశారు అయితే ఈ కార్యక్రమంలో సమంతా మాట్లాడుతూ దేవుడు దయవల్ల తనకు విజయవాడ సెంటర్లో ఇడ్లీ స్టాల్ పెట్టుకునే పరిస్థితి ఇంకా రాలేదని తెలియజేశారు. అయితే ఉన్నఫలంగా సమంత ఇలాంటి కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి అని ఆరాతీస్తున్నారు.

Samantha: సమంతను విమర్శించారా…


సమంత అనారోగ్యంగా ఉన్న సమయంలో తన గురించి ఎవరైనా ఇలాంటి విమర్శలు చేశారా అందుకే వారికి కౌంటర్ ఇచ్చే క్రమంలోనే సమంత ఈ వేదికపై తనకు ఇంకా అలాంటి పరిస్థితి రాలేదు అంటూ కామెంట్స్ చేశారా అన్న సందేహాలు కలుగుతున్నాయి ఏది ఏమైనా తన పట్ల విమర్శలు చేస్తున్నటువంటి వారికి ఈ మధ్య కాలంలో సమంత ఘాటుగానే సమాధానం చెబుతున్నారు. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Samantha: నిర్మాతలు నన్ను అర్థం చేసుకొని ఓపికగా ఎదురు చూశారు… ఆరోగ్యంతోనే తిరిగి వస్తా: సమంత

Samantha: సమంత ప్రస్తుతం ఏడాది పాట సినిమాలకు విరామం ప్రకటించి తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు. అయితే ఈమె నటించిన ఖుషి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో సమంత పాల్గొని సందడి చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

ఇందులో భాగంగా ఈ సినిమా మ్యూజిక్ కాన్సర్ట్ హైదరాబాదులో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో సమంత పాల్గొని సందడి చేయడమే కాకుండా అనంతరం మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలియచేశారు.తాను మయోసైటిసిస్ కి గురైన తర్వాత సినిమా షూటింగ్ కు దూరమయ్యాను అయితే నాకోసం నిర్మాతలు ఎంతో కాలం పాటు చాలా ఓపికగా ఎదురు చూశారు అందుకు వారికి నేను రుణపడి ఉంటాను అని తెలిపారు.

Samantha: మీకోసం హార్డ్ వర్క్ చేస్తున్న…


ఇక ఈ సినిమాలోని ప్రతి ఒక్క పాట తనకు ఎంతో అద్భుతంగా నచ్చాయని తాను కూడా మీ అందరితో పాటు సెప్టెంబర్ ఒకటవ తేదీ ఈ సినిమా చూడటం కోసం ఎదురుచూస్తున్నానని సమంత తెలియజేశారు. అభిమానులను ఉద్దేశిస్తూ ఈమె మాట్లాడుతూ ప్రస్తుతం సినిమాలకు తాను దూరంగా ఉన్నానని తొందరలోనే మీ ముందుకు రావడం కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నానని త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి మీ ముందుకు వస్తాను అంటూ ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Samantha: ఒంటరితనం మరింత బలాన్ని ఇస్తుంది.. మోటివేషనల్ పోస్ట్ షేర్ చేసిన సమంత..?

Samantha: ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చి అందరిని తన మాటలతో నటనతో మాయ చేసిన సమంత సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన సంగతి అందరికీ తెలిసిందే . ఇటీవల శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సమంత ఊహించని విధంగా డిజాస్టర్ ఎదుర్కొంది. సమంత కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా చెప్పవచ్చు.

ఇక ఆ సినిమా తర్వాత ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. ఈ సినిమా జూన్ 16వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన సమంత ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమా నుండి విడుదలైన పాట కూడా ట్రెండింగ్ లో ఉంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

నాగచైతన్యతో విడిపోయిన సమయంలో, అలాగే ఇటీవల మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సమయంలో కూడా సమంత చాలా ఒంటరితనం అనుభవించింది. ఇక తాజాగా ఒంటరితనం గురించి సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.
తాజాగా సమంత ఖుషి సినిమాలోని తన లుక్ షేర్ చేస్తూ…. “నిశ్శబ్దంగా ఉండడం, ఒంటరి జీవితాన్ని అనుభవించడం వల్ల మీరు జీవితంలో మరింత శక్తివంతంగా మారతారు. చిన్న చిన్న బాధలు మిమ్మల్ని ఏమి చేయలేవు”.. అంటూ ఓ మోటివేషనల్ కోట్ షేర్ చేసింది.


Samantha: చిన్న చిన్న బాధలు ఏమి చేయలేవు..

ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో నెటిజన్స్ కూడా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. గతంలో కూడా శాకుంతలం సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న సమయంలో కూడా ” కర్మ ఫలితం అనుభవించక తప్పదు” అంటూ సమంత ఒక కోట్ షేర్ చేసింది. ఇలా సమంత తరచూ మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.