Samantha: ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చి అందరిని తన మాటలతో నటనతో మాయ చేసిన సమంత సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన సంగతి అందరికీ తెలిసిందే . ఇటీవల శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సమంత ఊహించని విధంగా డిజాస్టర్ ఎదుర్కొంది. సమంత కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా చెప్పవచ్చు.
ఇక ఆ సినిమా తర్వాత ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. ఈ సినిమా జూన్ 16వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన సమంత ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమా నుండి విడుదలైన పాట కూడా ట్రెండింగ్ లో ఉంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
నాగచైతన్యతో విడిపోయిన సమయంలో, అలాగే ఇటీవల మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సమయంలో కూడా సమంత చాలా ఒంటరితనం అనుభవించింది. ఇక తాజాగా ఒంటరితనం గురించి సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది.
తాజాగా సమంత ఖుషి సినిమాలోని తన లుక్ షేర్ చేస్తూ…. “నిశ్శబ్దంగా ఉండడం, ఒంటరి జీవితాన్ని అనుభవించడం వల్ల మీరు జీవితంలో మరింత శక్తివంతంగా మారతారు. చిన్న చిన్న బాధలు మిమ్మల్ని ఏమి చేయలేవు”.. అంటూ ఓ మోటివేషనల్ కోట్ షేర్ చేసింది.
ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలో నెటిజన్స్ కూడా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. గతంలో కూడా శాకుంతలం సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న సమయంలో కూడా ” కర్మ ఫలితం అనుభవించక తప్పదు” అంటూ సమంత ఒక కోట్ షేర్ చేసింది. ఇలా సమంత తరచూ మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం సమంత చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…