Featured

Prabhas: సీతారామం డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా.. ఆనందంలో అభిమానులు?

Prabhas: బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్టు కె, సలార్ వంటి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా మరొకవైపు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్, ప్రభాస్ కాంబినేషన్లో రూపొందుతున్న ఆదిపురుష్ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ వంటి ప్రముఖులు నటిస్తున్న ఈ సినిమా జూన్ 16న రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. ఇదిలా ఉండగా ప్రభాస్ మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే సలార్, ప్రాజెక్ట్ కె వంటి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలలో నటిస్తున్న ప్రభాస్ ప్రస్తుతం ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాధే శ్యామ్ సినిమా డిజాస్టర్ తర్వాత ప్రభాస్ ఇప్పటివరకు లవ్ స్టోరీస్ లో నటించలేదు.

ఇక ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సీతారామం వంటి క్లాసిక్ లవ్ స్టోరీని ప్రేక్షకులకు అందించిన హను రాఘవపూడి దర్శకత్వంలో మరొక లవ్ స్టోరీలో నటించటానికి ప్రభాస్ అంగీకరించినట్లు వార్తల వినిపిస్తున్నాయి. సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హను రాఘవపూడితో ఇటీవల ప్రభాస్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. సీతారామం సినిమా తర్వాత ఓ పాన్ ఇండియా స్టార్ హీరోతో సినిమా చేయాలని హను రాఘవపూడి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Prabhas: లవ్ స్టోరీ సినిమాతో రానున్న ప్రభాస్….


ఈ క్రమంలో ఇప్పటికే ముగ్గురు నలుగురు స్టార్లకు కథలను కూడా సిద్ధం చేశాడట. ఈ క్రమంలోనే ఇటీవల ప్రభాస్ ను కలిసి.. ఓ ప్రేమకథ వినిపిస్తే.. ప్రభాస్ ఇంప్రెస్ అయ్యి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. రాధే శ్యామ్ తర్వాత వరుసగా యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలలో నటిస్తున్న ప్రభాస్ ఇలా హనురాగవపూడి తో కలిసి లవ్ స్టోరీ చేస్తున్నాడని తెలియడంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రానున్న సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన అక్టోబర్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago