Tag Archives: Koratala Siva

Nandamuri Mokshagna: ఈసారి మోక్షజ్ఞ ఎంట్రీ పక్కా.. మోక్షజ్ఞ మూవీ టైటిల్ ఇదే!

Nandamuri Mokshagna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. నందమూరి తారక రామారావు అనంతరం ఆయన వారసులుగా హరికృష్ణ బాలకృష్ణ వంటి వారి ఇండస్ట్రీలోకి వచ్చారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ వంటి వారు నందమూరి వారసులుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

ఇకపోతే నందమూరి నట సింహం బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారని నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా నుంచి మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ ఉంటుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అధికారక ప్రకటన వెలబడలేదు. ఇక మోక్షజ్ఞను వివి వినాయక్, రాజమౌళి, అనిల్ రావిపూడి, కొరటాల శివ వంటి డైరెక్టర్లు లాంచ్ చేయబోతున్నారని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ విధంగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎన్నో వార్తలు వచ్చిన ఏ విధమైనటువంటి అధికారక ప్రకటన లేకపోవడంతో నందమూరి అభిమానుల సైతం ఎంతో నిరాశ వ్యక్తం చేశారు. అయితే తాజాగా వినిపిస్తున్న కథనం ప్రకారం ఈసారి మోక్షజ్ఞ ఎంట్రీ పక్కాగా ఉంటుందని ఈ సినిమాకి అప్పుడే టైటిల్ కూడా ఖరారు చేశారని వార్తలు వినపడుతున్నాయి. ఇక మోక్షజ్ఞ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో చేయబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి.

Nandamuri Mokshagna: ప్రేమ కథ చిత్రంతో మోక్షజ్ఞ ఎంట్రీ…

మోక్షజ్ఞను ఇండస్ట్రీకి లాంచ్ చేసే అవకాశం బాలకృష్ణ రాహుల్ కి ఇచ్చినట్టు సమాచారం. ఇక మోక్షజ్ఞ మాస్ యాక్షన్ చిత్రంతో కాకుండా సాఫ్ట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారని తెలుస్తుంది.ఇక ఈ సినిమాకి ప్రేమించి చూడు అనే టైటిల్ కూడా ఖరారు చేశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి.ఇక ఈ విషయంపై బాలకృష్ణ అధికారిక ప్రకటన తెలియజేయాల్సి ఉంది. ఇదే కనుక నిజమైతే నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు ఉండమని చెప్పాలి.

Koratala Siva : ‘సింహా’ చిత్రానికి రచయితగా పనిచేసాను కానీ నా పేరు టైటిల్స్ లో వేయలేదు.. ఆయన ఓ రాక్షసుడు.. : కొరటాల శివ

‌Koratala Siva : కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు గల సామాజిక కార్యకర్తల కుటుంబంలో కొరటాల జన్మించారు.ఆ తర్వాత మామ పోసాని కృష్ణ మురళి దగ్గర సినిమాలకు స్క్రీన్ రైటింగ్ అసిస్టెంట్ గా పనిచేశాడు. ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, మరియు ఊసరవెల్లి వంటి చిత్రాలకు సంభాషణ రచయితగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు.’

2013లో అతను ప్రభాస్ నటించిన మిర్చితో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అది బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. 2015లో శ్రీమంతుడు అనే యాక్షన్-డ్రామా చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇది వాణిజ్యపరంగా విజయవంతమైంది మరియు మూడు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, ఆరు IIFA అవార్డులు మరియు ఆరు SIIMA అవార్డులు అందుకున్నారు. 2016 చిత్రం జనతా గ్యారేజ్‌లో  మోహన్‌లాల్ మరియు NT రామారావు జూనియర్ నటించారు.

ఈ కథ “జనతా గ్యారేజ్” పేరుతో పెద్ద ఆటోమొబైల్ సేవా కేంద్రాన్ని నిర్వహించడం మరియు వారి ఆటోమొబైల్ మెకానిక్‌ల సమూహం ద్వారా చట్టాన్ని అమలు చేయడం వంటిది ఎందుకంటే చట్టపరమైన ఏజెన్సీలు సరిపోవని భావించారు. కొరటాల ఈ చిత్రంతో దర్శకుడిగా వరుసగా మూడో విజయాన్ని సాధించాడు. అతను తిరిగి దర్శకత్వం వహించిన నటుడు మహేష్ బాబు పొలిటికల్ యాక్షన్ డ్రామా చిత్రం భరత్ అనే నేను మరియు బాక్సాఫీస్ వద్ద తన విజయ పరంపరను కొనసాగించింది. ఈ చిత్రం బాక్స్-ఆఫీస్ వద్ద ₹ 225 కోట్లు వసూలు చేసింది. కొరటాల తదుపరి దర్శకత్వం చిరంజీవి మరియు రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ఆచార్య చిత్రాన్ని ప్రారంభించాడు. ఏప్రిల్ 2022లో విడుదలైన ఈ చిత్రం ప్రతికూల సమీక్షలను అందుకుంది.

అయితే ఈ మధ్యకాలంలో కొరటాల శివ ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. బాలకృష్ణ నటించిన “సింహా ” చిత్రానికి తాను రచయితగా పనిచేశానని కానీ ఆ సినిమా టైటిల్స్ లో తన పేరు వేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఏదైతేనేం తాను దర్శకుడిగా మారడానికి కూడా అదొక కారణమని చెప్పారు. అలాగే సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో పోసాని కృష్ణ మురళి దగ్గర అసిస్టెంట్ రైటర్ గా చేరానని అలా నెలకి 25వేల రూపాయల వేతనం ఇచ్చే వారని.. పోసాని కృష్ణమురళి ఒక పని రాక్షసుడని కేవలం మూడు నుంచి నాలుగు గంటలు నిద్రపోతే సరిపోతుందని తరచూ వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయాలని చెబుతూ ఉండేవారని ఆయన ఆ ఇంటర్వ్యూలో తన గురువు పోసాని గురించి వివరించారు.