Nandamuri Mokshagna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. నందమూరి తారక రామారావు అనంతరం ఆయన వారసులుగా హరికృష్ణ బాలకృష్ణ వంటి వారి ఇండస్ట్రీలోకి వచ్చారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ వంటి వారు నందమూరి వారసులుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఇకపోతే నందమూరి నట సింహం బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారని నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా నుంచి మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ ఉంటుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అధికారక ప్రకటన వెలబడలేదు. ఇక మోక్షజ్ఞను వివి వినాయక్, రాజమౌళి, అనిల్ రావిపూడి, కొరటాల శివ వంటి డైరెక్టర్లు లాంచ్ చేయబోతున్నారని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఈ విధంగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎన్నో వార్తలు వచ్చిన ఏ విధమైనటువంటి అధికారక ప్రకటన లేకపోవడంతో నందమూరి అభిమానుల సైతం ఎంతో నిరాశ వ్యక్తం చేశారు. అయితే తాజాగా వినిపిస్తున్న కథనం ప్రకారం ఈసారి మోక్షజ్ఞ ఎంట్రీ పక్కాగా ఉంటుందని ఈ సినిమాకి అప్పుడే టైటిల్ కూడా ఖరారు చేశారని వార్తలు వినపడుతున్నాయి. ఇక మోక్షజ్ఞ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో చేయబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి.
మోక్షజ్ఞను ఇండస్ట్రీకి లాంచ్ చేసే అవకాశం బాలకృష్ణ రాహుల్ కి ఇచ్చినట్టు సమాచారం. ఇక మోక్షజ్ఞ మాస్ యాక్షన్ చిత్రంతో కాకుండా సాఫ్ట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారని తెలుస్తుంది.ఇక ఈ సినిమాకి ప్రేమించి చూడు అనే టైటిల్ కూడా ఖరారు చేశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి.ఇక ఈ విషయంపై బాలకృష్ణ అధికారిక ప్రకటన తెలియజేయాల్సి ఉంది. ఇదే కనుక నిజమైతే నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు ఉండమని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…