Tag Archives: krishna death

Krishna Death: కృష్ణ చనిపోవడానికి ముందు జరిగిన విషయాలను బయటపెట్టిన ఆదిశేషగిరిరావు.. ఏమైందంటే?

Krishna Death: నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్తను ఇప్పటికీ అభిమానులు సినీ సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణ అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా కృష్ణ మరణ వార్త ఎంతో మంది అభిమానులను కలచి వేసింది. ఇకపోతే కృష్ణ చనిపోవడానికి ముందు రోజు ఏం జరిగింది తనతో ఎలాంటి విషయాలు మాట్లాడారనే విషయాలు గురించి కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు పలు విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ కృష్ణ గారికి గుండెపోటు వచ్చే ముందు ఆదివారం ఉదయం నేను తన వద్దకు వెళ్లానని తెలిపారు. అప్పుడు అంతా కూడా అన్నయ్య తమ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని నవ్వుకున్నారు. ఇద్దరం కలిసి సైకిల్ పై సినిమాలకు వెళ్లే వాళ్ళమని ఇలా చిన్ననాటి జ్ఞాపకాలు అన్నింటిని గుర్తు చేసుకొని బాగా నవ్వుకున్నారు.

ఆ సమయంలో అన్నయ్యకు ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్య ఉన్నట్టు అనిపించలేదు. ఇక తనని అక్కడే భోంచేసి వెళ్ళమని చెప్పగా తన ఇంటికి ఇతరులు భోజనానికి వస్తున్నారని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మరోసారి వస్తా అని చెప్పి ఇంటికి వెళ్ళా. ఆరోజు అర్ధరాత్రి 12:30 గంటలకు అన్నయ్య దగ్గర ఉన్నటువంటి ఒక అబ్బాయి తన గదిలో నుంచి గురక శబ్దం రాలేదని గమనించి వెళ్లి పల్స్ చెక్ చేశారు. ఏదో తేడాగా ఉండడంతో వెంటనే నాకు ఫోన్ చేశారు.

గుండెపోటు ప్రభావం ఇతర భాగాలపై పడింది..

తనని వెంటనే హాస్పిటల్ కి తీసుకు రమ్మని చెప్పి నేను కూడా అక్కడికి వెళ్లాను అయితే అప్పటికే అతనికి గుండెపోటు వచ్చి దాదాపు 30 నిమిషాలు కావడంతో ఆ ప్రభావం శరీరంలోని ఇతర భాగాలపై అలాగే రక్తప్రసరణ వ్యవస్థ పై పడటంతో అతని అవయవాలు కూడా పూర్తిగా పనిచేయకుండా పోయాయని డాక్టర్లు సుమారు 30 గంటల పాటు కష్టపడినప్పటికీ ఫలితం లేదంటూ ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు కృష్ణ చనిపోవడానికి ముందు జరిగిన విషయాలన్నింటినీ బయట పెట్టారు.

Super Star Krishna: కృష్ణ మృతికి కారణాలు వెల్లడించిన కాంటినెంటల్ వైద్యులు.. ఏమన్నారంటే?

Super Star Krishna: నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ నేడు తెల్లవారుజామున 4 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు.ఇలా ఈయన మరణించారనే వార్త తెలియగానే చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. గుండెపోటు రావడంతో ఈయనని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ కృష్ణ మరణించారు. ఇక ఈయన మరణం గురించి కాంటినెంటల్ వైద్యుడు గురు ఎన్ రెడ్డి స్పందించారు.

ఈ సందర్భంగా ఈయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ మరణించడానికి గల కారణాలను తెలియజేశారు. ఆదివారం రాత్రి రెండు గంటల సమయంలో సూపర్ స్టార్ కృష్ణ గారిని ఆసుపత్రికి తీసుకువచ్చారు అప్పటికే ఆయన స్పృహ లేకుండా పడిపోవడంతో దాదాపు 20 నిమిషాల పాటు కష్టపడి సిపిఆర్ చేసి ఆయనని స్పృహలోకి తీసుకు వచ్చాము. అయితే అప్పటికే ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉందని గురు ఎన్ రెడ్డి తెలిపారు.

ఇలా స్పృహలోకి వచ్చిన ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించామని అయితే గంట గంట ఆయన పరిస్థితి విషమంగా మారిందని తెలిపారు.ఇలా ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించినప్పటికీ ఆయనకు మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బ తినడంతో ఆయనకు నాలుగు గంటల తర్వాత డయాలసిస్ కూడా చేశామని డాక్టర్ వెల్లడించారు. అయితే గడిచే కొద్ది ఆయన పరిస్థితి విషమించడంతో చికిత్స అందించిన ఫలితం ఉండదని భావించి ఇదే విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు తెలియజేశాము.

Super Star Krishna: బ్రెయిన్ డ్యామేజ్ కూడా జరిగింది..

ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చనీ కుటుంబ సభ్యులకు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ వచ్చాము. ఇక అతనికి చికిత్స అందించిన ప్రయోజనం లేదని భావించి చివరి క్షణాలలో తనని ఇబ్బంది పెట్టకూడదనీ భావించామని డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు. ఇక ఈయనకు మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బ తినడమే కాకుండా బ్రెయిన్ లో డామేజ్ కూడా ఉండడంతో ఈయన పరిస్థితి విషమించి మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయన తుది శ్వాస విడిచారని కృష్ణ మరణం గురించి కాంటినెంటల్ వైద్యుడు మీడియా సమావేశంలో తెలియజేశారు.