Tag Archives: lockdown

రెస్టారెంట్ లో అయిన బిల్లు కంటే నాలుగు రెట్లు అధికంగా చెల్లించిన కస్టమర్.. చివరికి?

సాధారణంగా మనం ఏదైనా రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేసి వస్తే బిల్లుతో పాటు ఏ పదో పాతికో టిప్ ఇచ్చి వస్తాము. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితుల కారణంగా రెస్టారెంట్లు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఈ క్రమంలోనే రెస్టారెంట్ లో పనిచేసే సిబ్బంది ఉపాధిని కోల్పోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ ఆంక్షలకు సడలింపు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే రెస్టారెంట్ తెరుచుకున్నాయి.

రెస్టారెంట్ తెచ్చుకున్నప్పటికీ ప్రజలందరూ ఇంటి భోజనానికి అలవాటుపడ్డారు. ఈ క్రమంలోనే రెస్టారెంట్ కి వెళ్లే వారి సంఖ్య అరకొరగానే ఉంది. ఇలాంటి సమయంలోనే సిబ్బందికి జీతాలు కూడా అలాగే ఇస్తున్నారు. ఇటువంటి కష్ట కాలంలో సర్వర్లకు ఒక యాభై రూపాయలు టిప్ ఇస్తే వారి మొహంలో చెప్పలేనంత ఆనందం కనిపిస్తుంది. అలాంటిది ఏకంగా
16000వేల డాలర్లు టిప్ గా వస్తే.. ఎలా ఫీల్‌ అయివుంటారో మీరే ఆర్ధం చేసుకోవాలి.

అమెరికాలోని ఓ రెస్టారెంట్లో కస్టమర్ చేసిన బిల్లు 40 డాలర్ల కన్నా తక్కువే. కానీ ఆ కస్టమర్ మాత్రం టిప్పుగా చెల్లించింది మాత్రం 16000వేల డాలర్లు. ఇంత పెద్ద మొత్తంలో టిప్ ఇస్తూ అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఎంతో ఆశ్చర్యానికి గురి చేశారు. బిల్లుతో పాటు క్రెడిట్ కార్డు తీసుకున్న సిబ్బంది అది చూసి ఒక్క సారిగా షాక్ అయింది.

ఈ క్రమంలోనే కస్టమర్ పొరపాటున ఇలా చేసి ఉంటారని అతని దగ్గరకు వెళ్లగానే అతను రెస్టారెంట్ లో పనిచేసే సిబ్బందికి టిప్ ఇచ్చినట్లు తెలపడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విధంగా కస్టమర్ ఇచ్చిన టిప్ ఆ సమయంలో పనిచేసే సిబ్బంది మాత్రమే కాకుండా రెస్టారెంట్లో పనిచేసే సిబ్బంది మొత్తం సమానంగా పంచుకొని అతనికి కృతజ్ఞతలు తెలిపారు.

లాక్ డౌన్ లో ఉదారతను చాటుకుంటున్న పోలీసులు.. వైరల్ వీడియో!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఆంక్షలను ఎంతో కఠినంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ విధించడం వల్ల ప్రస్తుతం పోలీసులను చూస్తే ప్రజలు భయంతో ఆమడ దూరం పరుగెడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అంటే కేవలం కఠినత్వం మాత్రమే కాకుండా వారిలో కూడా మానవత్వం ఉంటుందని, వారు సాధారణ ప్రజల పట్ల జాలి, దయ కలిగి ఉంటారని అదిలాబాద్ పోలీసులు రుజువు చేసుకున్నారు.

తెలంగాణలో లాక్ డౌన్ కారణంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పకడ్భందీగా అమలుచేస్తున్నారు. జిల్లాలో లాక్ డౌన్ సమయంలో నిబంధనలు అతిక్రమించిన వారిపట్ల పోలీసులు ఎంతో కఠినంగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే లాక్ డౌన్ పట్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ నిస్సహాయ స్థితిలో ఉన్న వారిపట్ల ఎంతో మానవతా దృక్పథంతో పోలీసులు వారికి సహాయం చేస్తున్నారు.

మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట పట్టణంలోని ఆసుపత్రిలో తమ కూతురిని చూయించేందుకు దండేపల్లి గ్రామానికి చెందిన గుడికందుల సతీష్ భాగ్యలక్ష్మీ దంపతులు కూతురి తీసుకొని వచ్చారు. తిరుగు ప్రయాణంలో వీరికి ఎటువంటి వాహనాలు దొరకకపోవడంతో ఎంతో నిరీక్షణ ఎదురుచూస్తున్నారు. వీరి పడుతున్న ఇబ్బందులను గ్రహించిన మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి వారు ఎక్కడికి వెళ్లాలనే విషయాలను తెలుసుకొని స్వయంగా తమ వాహనంలో వారిని వారి ఇంటి దగ్గర దింపి వారి మంచి మనసు చాటుకున్నారు.

అదేవిధంగా లాక్ డౌన్ కారణంగా అదిలాబాద్ జిల్లాలోని పలుచోట్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్న వృద్ధులను, గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డల తల్లులు వారు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన పోలీస్ అధికారులు వారిని ప్రత్యేక వాహనాలలో లేదా ఉత్తమ పోలీసుల వాహనాలలో వారు చేరాల్సిన గమ్యానికి చేరవేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. పోలీసులు అంటే కేవలం కఠిన హృదయమే కాకుండా, మంచి మనసు, మానవత్వం కూడా ఉంటుందని పోలీసులు నిరూపించుకుంటున్నారు.

అతని మరణంతో సెల్ఫ్ లాక్‌డౌన్‌లోకి హీరో నిఖిల్ కుటుంబం!

రెండవ దశ కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ ప్రభావం సినిమా రంగంపై పడటంతో ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వాలు థియేటర్లను మూసివేయాలని ఆదేశించాయి. అదేవిధంగా కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గేవరకు సినిమా షూటింగ్ వాయిదా వేసుకొని హీరోలు మరోసారి ఇంటికే పరిమితమయ్యారు.

ఈ క్రమంలోనే హీరో నిఖిల్ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ ఉదృతి తగ్గేవరకు తమ కుటుంబం మొత్తం సెల్ఫ్ లాక్‌డౌన్‌లోకి వెళ్తున్నట్లు ప్రకటించాడు. నిఖిల్ ప్రస్తుతం ‘18 పేజెస్’, ‘కార్తీకేయ-2’ చిత్రాలలో నటిస్తుండగా కరోనా ప్రభావం వల్ల ఆ సినిమాలు వాయిదా పడ్డాయి. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక తిరిగి షూటింగ్లో పాల్గొననున్నారు.

హీరో నిఖిల్ కి బాగా పరిచయం ఉన్న వ్యక్తి కరోనా వైరస్ తో మృతి చెందాడు. అతని వయస్సు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. అదేవిధంగా కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఇకపోతే వృత్తిరీత్యానిఖిల్ భార్య పల్లవి డాక్టర్ కావడంతో ఇప్పటికే ఆమె రెండు డోస్ ల వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు. తను కూడా త్వరలోనే వ్యాక్సిన్ వేయించుకోబోతున్నానని అందరూ కూడా.. వ్యాక్సిన్ వేయించుకొని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు

కొడుకు మాటతో కన్నీరుమున్నీరైన అనసూయ.. ఏం జరిగిందంటే..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర యాంకర్ గా యాంకర్ అనసూయకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ షోను హోస్ట్ చేసినా అనసూయ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇటు బుల్లితెరతో పాటు అటు వెండితెరపై కూడా విజయాలు సొంతం చేసుకుంటున్న అనసూయ కొడుకు మాటతో కన్నీరుమున్నీరయ్యానని తాజాగా సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.

యాంకర్ అనసూయ అంతలా బాధ పడటానికి కారణమేమిటంటే ఆమె తొమ్మిదేళ్ల కొడుకు అనసూయతో కరోనా వైరస్, లాక్ డౌన్, వరదల వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతుండటంతో అనసూయ కొడుకు ఆమెతో తాను గడిచిన కాలానికి వెళ్లాలనుకుంటున్నానని చెప్పాడు. 2017, 2018, 2019 సంవత్సరాలలో తాను ఎంతో సంతోషంగా జీవించానని తనకు మళ్లీ అలాంటి రోజులు కావాలని తల్లికి తెలిపాడు. అప్పుడు కరోనా, వరదలు లేకపోవడంతో సంతోషంగా జీవనం సాగించానని చెప్పాడు.

అవకాశం వస్తే తాను గడిచిన వెళ్లాలని అనుకుంటున్నానని కొడుకు తనతో చెప్పాడని ఆమె వెల్లడించారు. కొడుకు అలా చెప్పిన తర్వాత తాను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానని.. కన్నీరు పెట్టుకున్నానని తెలిపారు. రాబోయే తరాల వారికి మనం ఏం అందించనున్నాం…? మనం ఎలాంటి పరిస్థితులను కొని తెచ్చుకున్నానం..? అంటూ ఆమె ట్వీట్ లో పేర్కొన్నారు. అనసూయ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వినియోగం మనుషుల జీవితంలో భాగమైపోయింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వరదలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. గతేడాదిలా సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఇంకా చాలా సమయమే పట్టేలా ఉంది. దేశంలో కరోనా అంతమైతే మాత్రమే ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించగలిగే అవకాశం ఉంది.

పాఠశాలల మూసివేతతో భారత్ ఎంత నష్టపోయిందో తెలుసా..!

కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ వల్ల 2020 సంవత్సరం మార్చి నెల 3వ వారం నుంచి దేశంలో పాఠశాలలు మూతబడ్డాయి. ఆ తరువాత పాఠశాలలు ఇప్పటివరకు తెరుచుకోలేదు. రోజులు గడుస్తున్నా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూ ఉండటంతో పాఠశాలలు తెరిచినా విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను పాఠశాలలకు పంపించే అవకాశాలు సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు. దేశంలోని చాలా విద్యాసంస్థలు ఆన్ లైన్ ద్వారా బోధన జరుపుతున్నాయి.

కరోనా వైరస్ కు సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పాటు సాధారణ పరిస్థితులు ఏర్పడితే మాత్రమే విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆన్ లైన్ ద్వారా విద్యా బోధాన జరిగినా పిల్లలకు ఆన్ లైన్ క్లాసులు అర్థం కావడం లేదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా విద్యార్థులు ఈ అకాడమిక్ ఇయర్ పూర్తిగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదే సమయంలో స్కూళ్లు మూసివేయడం వల్ల భారత్ కు భారీ నష్టం వాటిల్లుతోందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. విద్యాసంస్థలు మూసివేయడం వల్ల ఏకంగా భారత్ కు 29 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని వెల్లడించింది. కరోనా, లాక్ డౌన్ దేశ ఆర్థికవ్యవస్థపై మాత్రమే ప్రభావం చూపలేదని విద్యార్థుల్లో చదువుకోవాలనే ఆసక్తి తగ్గడానికి కూడా కారణమైందని వెల్లడించింది.

పపంచ బ్యాంకు దక్షిణాసియాలో విద్యాసంస్థల మూసివేత వల్ల 880 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని వెల్లడించింది. ప్రపంచ బ్యాంక్ నుంచి “బీటెన్ ఆర్ బ్రోకెన్.. ఇన్ ఫర్మాలిటీ అండ్ కోవిడ్-19 ఇన్ సౌతిండియా” అనే పేరుతో ఈ మేరకు నివేదిక విడుదలైంది. కరోనా, లాక్ డౌన్ విద్యార్థుల ఉత్పాదకతపై జీవితకాల ప్రభావం చూపుతుందని.. దాదాపు 50 లక్షల మంది విద్యార్థులు డ్రాపవుట్స్ గా మిగిలిపోయే అవసరం ఉందని.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కరోనా, లాక్ డౌన్ కోలుకోలేని దెబ్బ తీసిందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది.

అమ్మమ్మపై ప్రేమతో 2,800 కిలోమీటర్ల దూరం నడిచిన బాలుడు..?

మారుతున్న కాలంతో పాటే మనుషుల్లో ఓపిక తగ్గిపోతోంది. కిలోమీటర్ దూరం నడవాలంటే కూడా చాలామంది భారంగా ఫీలవుతున్నారు. మూడు నాలుగు కిలోమీటర్లు నడిస్తే ఇక తమ వల్ల కాదని ఆగిపోతున్నారు. అయితే ఒక బాలుడు మాత్రం అమ్మమ్మ కోసం ఏకంగా 2,800 కిలోమీటర్లు నడిచాడు. ఇటలీలోని సిసిలీ నుంచి లండన్ వరకు నడుచుకుంటూ వెళ్లాడు. అంత దూరం ప్రయాణం చేసిన ఆ బాలుడి పేరు రోమియో.

పూర్తి వివరాల్లోకి వెళితే సిసిలీలో తల్లిదండ్రులతో నివశించే రోమియోకు అమ్మమ్మ అంటే పంచప్రాణాలు. లండన్ లో నివశించే అమ్మమ్మను ప్రతి సంవత్సరం సెలవుల్లో తల్లిదండ్రులతో వెళ్లి కలిసేవాడు. అయితే ఈ సంవత్సరం కరోనా, లాక్ డౌన్ వల్ల బాలుడికి అమ్మమ్మను కలవడం సాధ్యం కాలేదు. దీంతో బాలుడు అమ్మమ్మపై బెంగ పెట్టుకున్నాడు. అమ్మమ్మను కలవాలని ఉందంటూ మారాం చేశాడు.

దీంతో బాలుడి తల్లిదండ్రులకు సైతం టెన్షన్ పట్టుకుంది. బాలుడు ఎంత చెప్పినా వినకపోవడం, అంతదూరం ప్రయాణం చేయడానికి వాహనాలు అందుబాటులో లేకపోవడంతో నడుచుకుంటూ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. జూన్ 20న బాలుడు, బాలుడి తండ్రి ప్రయాణం మొదలుపెట్టగా సెప్టెంబర్ 21న లండన్ కు చేరుకున్నారు. ప్రయాణ సమయంలో ఎన్ని సమస్యలు వచ్చినా చివరకు గమ్యస్థానానికి చేరుకున్నారు.

ప్రస్తుతం బాలుడు తన తండ్రితో కలిసి ఐసోలేషన్ లో ఉన్నాడు. ఐసోలేషన్ తరువాత అమ్మమ్మను కలుసుకోనున్నాడు. త్వరలో అమ్మమ్మను కలుసుకోనుండటంతో బాలుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు బాలుడు ప్రయాణ సమయంలో ఫండ్ రైజింగ్ ద్వారా 11.4 లక్షల రూపాయలు సంపాదించాడు. ఆ డబ్బులను శరణార్థుల పిల్లల చదువు కోసం వినియోగిస్తానని రోమియో చెప్పాడు.