Tag Archives: Malli pelli

Malli Pelli Movie: నరేష్ మళ్లీ పెళ్లి సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఉందా… అసలు విషయం రివీల్ చేసిన టీమ్!

Malli Pelli Movie: సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ జంటగా మళ్లీ పెళ్లి అనే సినిమాని చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ సినిమాపై అంచనాలను పెంచేశారు.నరేష్ తన వ్యక్తిగత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టంగా ఈ సినిమా ట్రైలర్ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది.

నరేష్ ఇప్పటికే ముగ్గురిని వివాహం చేసుకొని ముగ్గురు భార్యలను వదిలేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ముగ్గురు భార్యలను వదిలేసిన ఈయన నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత జీవితం గురించి మళ్లీ పెళ్లి అనే సినిమా చేశారని ఈ సినిమాకు ఈయన విజయకృష్ణ మూవీస్ బ్యానర్ తిరిగి ప్రారంభించి నిర్మాతగా వ్యవహరించారని కూడా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో కృష్ణ, విజయనిర్మల పాత్రలు కూడా ఉండబోతున్నాయని ఇందులో కృష్ణ పాత్రలో శరత్ బాబు విజయనిర్మల పాత్రలో జయసుధ కూడా నటించారు. అయితే ఇది కృష్ణ కుటుంబ విషయానికి సంబంధించినది కావడంతో మహేష్ బాబు పాత్ర కూడా ఇందులో ఉండబోతుందని చాలామంది భావించారు. అయితే తాజాగా ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర గురించి మళ్లీ పెళ్లి టీమ్ స్పందించారు.

Malli Pelli Movie: మహేష్ బాబు పాత్ర ఉంటుంది…


ఈ సందర్భంగా మహేష్ బాబు పాత్ర గురించి చిత్ర బృంధం నుంచి వస్తున్న సమాచారాలను బట్టి.. ఈ సినిమాలో మహేష్ పాత్ర ఉంటుంది కానీ డైరెక్ట్ గా లేకుండా కేవలం మాటల్లో మాత్రమే మహేష్ బాబుని ప్రస్తావించే లాగా అతని పాత్ర ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా నరేష్ మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకులలో భారీ హైప్ పెంచారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆత్రుతగా కూడా ఎదురుచూస్తున్నారు.

Actor Naresh: నటుడు నరేశ్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా…. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Actor Naresh: ప్రముఖ నటి విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నరేష్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు. హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన నరేష్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఏడాదికాలంగా నరేష్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

మొదటి ఇద్దరి భార్యలకు చట్టపరంగా విడాకులు ఇచ్చిన నరేష్ మూడో భార్య రమ్య రఘుపతికి చట్టపరంగా విడాకులు ఇవ్వకుండానే క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడు.
ఈ విషయాన్ని నరేష్, పవిత్ర లోకేష్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో వీరిద్దరి రిలేషన్ గురించి నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి సంచలన వ్యాఖ్యలు చేసింది. చాలా కాలంగా వీరి ముగ్గురి మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది.

ఇదిలా ఉండగా ఇప్పటికే ఎన్నో సినిమాలలో కలిసి నటించిన నరేష్, పవిత్ర లోకేష్ తాజాగా ‘ మళ్లీ పెళ్లి ‘ సినిమాలో జంటగా నటించారు. నరేష్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే నరేష్ మాత్రం ఇది తన బయోపిక్ కాదని ఖండిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి నరేష్ నిర్మాతగా వ్యవహరించాడు.

Actor Naresh: వేల కోట్ల ఆస్తులు….

ఈ క్రమంలో నరేష్ ఆస్తుల వివరాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నరేష్ కి తల్లి విజయనిర్మల ఇచ్చిన ఆస్తులు మాత్రమే కాకుండా తాను సినిమాలలో నటించి సంపాదించిన ఆస్తులు కూడా పెద్ద మొత్తంలో ఉన్నట్లు తెలుస్తోంది. నరేష్ కి వందల కోట్ల రూపాయలు విలువ చేసి ఆస్తులు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం. అయితే నరేష్ పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమాలో నరేష్ జీవితంలో జరిగిన యదార్థ సంఘటనలు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ క్రమంలో ఈ సినిమా లో ఒక సన్నివేశంలో ‘ మీకెంటి సర్ 1000 కోట్ల ఫిగర్ ‘ అనే డైలాగ్ బట్టి చూస్తే నరేష్ కి వేలకోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నరేష్ ఆస్తులు వివరాల తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.

Naresh -Pavitra Lokesh: సొంత గ్రామంలో సందడి చేసిన నరేష్ పవిత్ర లోకేష్…. ఫోటోలు వైరల్!

Naresh -Pavitra Lokesh: సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నరేష్ పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరిద్దరూ కలిసి జంటగా పలు సినిమాలలో నటించారు. అయితే ఇలా సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తుంది.

ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చిన నరేష్ ప్రస్తుతం పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉంటున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాము అంటూ వెల్లడించారు. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోకపోయినా సహజీవనం చేస్తూ ఉన్నారు.

ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ జంటగా వెళుతూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. అయితే తాజాగా నటుడు నరేష్ పవిత్ర లోకేష్ తో కలిసి తన సొంత గ్రామానికి వెళ్ళాడు. నరేష్ తల్లి విజయనిర్మల పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పాడుకి చెందిన అమ్మాయి. అయితే తాజాగా పవిత్ర లోకేష్ తో కలిసి నరేష్ ఏలూరుపాడుకు వెళ్లారు

Naresh -Pavitra Lokesh అమ్మవారి సన్నిధిలో నరేష్ పవిత్ర…


ఇలా వీరిద్దరూ ఇక్కడ ఒక ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరై అనంతరం కూడలిలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే ఏలూరుపాడు అమ్మవారి సన్నిధిలో కూడా సందడి చేశారు. అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేయించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

.