Naresh -Pavitra Lokesh: సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నరేష్ పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరిద్దరూ కలిసి జంటగా పలు సినిమాలలో నటించారు. అయితే ఇలా సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తుంది.
ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చిన నరేష్ ప్రస్తుతం పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉంటున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాము అంటూ వెల్లడించారు. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోకపోయినా సహజీవనం చేస్తూ ఉన్నారు.
ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ జంటగా వెళుతూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. అయితే తాజాగా నటుడు నరేష్ పవిత్ర లోకేష్ తో కలిసి తన సొంత గ్రామానికి వెళ్ళాడు. నరేష్ తల్లి విజయనిర్మల పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పాడుకి చెందిన అమ్మాయి. అయితే తాజాగా పవిత్ర లోకేష్ తో కలిసి నరేష్ ఏలూరుపాడుకు వెళ్లారు
ఇలా వీరిద్దరూ ఇక్కడ ఒక ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరై అనంతరం కూడలిలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే ఏలూరుపాడు అమ్మవారి సన్నిధిలో కూడా సందడి చేశారు. అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేయించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…