Featured

Analyst Damu Balaji : చనిపోయే ముందు రోజు రాత్రి చక్రి గదిలో అసలు ఏం జరిగిందంటే…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : తెలంగాణ మహబూబాబాద్ కి చెందిన గిల్లా చక్రధర్ సినిమా ఇండస్ట్రీలో చక్రి గా బాగా ఫేమస్ అయ్యారు. మ్యూజిక్ రికార్డింగ్ లో మంచి పేరు సంపాదించుకున్నా పూరీ జగన్నాథ్ ‘బాచి’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమయ్యారు. ఆ తరువాత సత్యం, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు అంటూ వరుస హిట్లతో సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగులో స్థిరపడిన చక్రి గారు 2014 డిసెంబర్ 16 న అర్థాంతరంగా నిద్రలోనే కనుమూశారు. ఆయన మరణం తరువాత ఇంట్లో గొడవలు, భార్య చక్రి గారి తల్లి తమ్ముడి మీద కేసులు పెట్టడం వంటివి జరిగాయి. ఇక ఈ విషయాల మీద అనలిస్ట్ దాము బాలాజీ గారు మాట్లాడారు.

ఆయన మరణం వెనుక మిస్టరీ వీడలేదు…

చక్రి గారు ఒక పది సంవత్సరాలలోనే దాదాపు 100 సినిమాలకు మ్యూజిక్ చేసారని అయితే ఆయనకి సక్సెస్ ను హ్యాండిల్ చేయడం రాలేదని దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. మొదటి నుండి చిన్న సినిమాలకు ఎక్కువగా పనిచేసిన ఆయన సక్సెస్ అయ్యాక పెద్ధ సినిమాలకు పనిచేసారు. ఆ సమయంలోనే ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల పార్టీస్ అంటూ ఎక్కువగా తిరిగేవారని, అందులోనూ నైట్ పార్టీస్ ఎక్కువగా చేసుకునేవాడని సక్సెస్ వచ్చాక తాగడం ఎక్కువగా అలవాటు చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయని తెలిపారు. ఇక ఆయన విషయంలో ఎఫైర్స్ గురించి కూడా ఎక్కువగా మాట్లాడేవారని ఇక ఆయన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్నారు. పార్టీలంటూ ఎక్కువగా ఉండే చక్రి డబ్బు అందుకోసం ఎక్కువగా ఖర్చు చేసేవారు అలా కొంత ఆస్తులు పోయాయి.

ఇక ఇంట్లో ఆయన మరణించిన వెంటనే ఎటువంటి వివాదాలు రాకపోయినా నెల రోజులకు ఆయన భార్య తల్లి తమ్ముడు కలిసి ఆస్తి కోస విషం పెట్టి చంపారని కేసు పెట్టింది. ఇక చక్రి గారి తల్లి, తమ్ముడు కూడా రెండో భార్య శ్రావణినే చంపిందని కేసు పెట్టడం జరిగింది అంటూ తెలిపారు. చక్రి మరణించి అప్పటికే నెల కావడం ఆయనను దహనం చేయడం వల్ల దర్యాప్తుకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది అంటూ తెలిపారు. ప్రస్తుతం చక్రి తల్లి, తమ్ముడు తండ్రికి వచ్చే పెన్షన్ డబ్బులతోనే జీవనం సాగిస్తుండగా చక్రి భార్య రెండో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. ఆస్తి అంతా ఆమెకే రావడం వల్ల చక్రి తల్లి, అలాగే వికలాగుడైన తమ్ముడు అవస్థలు పడుతున్నారు అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

5 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

5 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

6 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

6 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

6 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

6 hours ago