Movie News

Nayanatara: ఎట్టకేలకు తమ పిల్లల పేర్లు ప్రకటించేసిన నయనతార విగ్నేష్ దంపతులు!

Nayanatara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారక దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి సౌత్ హీరోయిన్ గా ఈమె రికార్డ్
సృష్టించారు. నయనతార దాదాపు పది కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

ఇకపోతే నయనతార గత కొన్ని సంవత్సరాలుగా డైరెక్టర్ విగ్నేష్ శివన్ ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే ఇలా కొంతకాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తూ గత ఏడాది జూన్ నెలలో వివాహం చేసుకున్నారు. ఇక వివాహమైనటువంటి నాలుగు నెలలకే ఈ దంపతులు పండంటి కవల పిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చి తల్లిదండ్రులుగా మారిపోయారు.

ఇలా పిల్లలు పుట్టిన తర్వాత నయనతార తన సినిమా షూటింగ్ పనులతో పిల్లలతోనూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తో కలిసి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్నారు.ఇలా సినిమాలతో బిజీగా ఉంటూనే తల్లిగా బాధ్యతలు కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు.

Nayanatara: ప్రాణం… ప్రపంచం

ఇక నయనతార విగ్నేష్ దంపతులు ఇదివరకు తమ పిల్లల ఫోటోలను అభిమానులతో పంచుకున్నప్పటికీ ఇప్పటివరకు వారి ఫేస్ మాత్రం రీవీల్ చేయలేదు. అయితే తాజాగా నయనతార విగ్నేష్ దంపతులు తమ పిల్లల పూర్తి పేర్లను ప్రకటించారు. ఇక వారి పెద్ద కుమారుడి పేరు ఉయిర్ రుద్రోనీల్ ఎన్ శివన్ కాగా రెండవ కుమారుడు పేరు ఉలగ్ దైవిక్ ఎన్ శివన్. నిజానికి వీరు పుట్టినప్పుడే ఉయిర్, ఉలగం అని చెప్పారు. ఇక తమిళంలో ఉయిర్ అంటే ప్రాణం అని, ఉలగం అంటే ప్రపంచం అని అర్థం. 

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago