Balagam Fame Muralidhar : చిన్న సినిమాగా వచ్చిన ‘బలగం’ సినిమా నేడు రెండు రాష్ట్రాలలోనూ సంచలన విజయాన్ని నమోదు చేసింది. నగరాలు, గ్రామాలు అని తేడా లేకుండా అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తున్న సినిమా బలగం. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్టుకీ ఈ సినిమా మంచి పేరు అలాగే గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో నారాయణ పాత్రలో నటించిన మురళీధర్ గౌడ్ గారు సీనిమా గురించి అందులో అవకాశం ఎలా వచ్చింది వంటి విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఇతను డైరెక్టరా అనుకున్నాను…
సినిమా ఆడిషన్స్ టైములో నాకు కాల్ రావడంతో ఆడిషన్స్ కి వెళ్లగా అక్కడ నారాయణ పాత్రకు నన్ను సెలెక్ట్ చేసారు. అంతకు ముందు ఎపుడూ వేణు గారిని చూసింది లేదు. తన స్కిట్స్ కూడా ఎపుడూ జబర్దస్త్ లో చూడలేదు. కేవలం వేణు ఒక కమెడియన్ అని తెలుసు అంతే అయితే వేణు అక్కడ కూర్చొని ఉంటే తను క్యారెక్టర్ కోసం ఆడిషన్ కి వచ్చాడని మొదట అనుకున్నా కానీ అసిస్టెంట్ ఒకతను వచ్చి చెప్పేవరకు తెలియలేదు తానే డైరెక్టర్ అని, అపుడు ఇతను డైరెక్టరా అనిపించింది.
కానీ ఆ రోజు నా క్యారెక్టర్ ను సెలెక్ట్ చేసి వేణు నాతో మీ క్యారెక్టర్ బాగా వస్తుంది, అందరికీ నచ్చుతుంది, ఖచ్చితంగా మీకు మళ్ళీ మంచి పేరు వస్తుంది చూడండి అని చెప్పాడు. ఇంకా షూటింగ్ కూడా జరగక ముందే చెప్పాడు వేణు అలానే ఇప్పుడు సినిమా విడుదల అయ్యాక ఎంతో మంది నన్ను అభినందిస్తున్నారు అంటూ చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…