Featured

Director Geetha Krishna : నాటు నాటు ఒక చెత్త పాట ఆస్కార్ రావడామేమిటి… శివశక్తి దత్త వ్యాఖ్యల గురించి హాట్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ గీతా కృష్ణ…!

Director Geetha Krishna : ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత ప్రభావం చూపిందో అందరికీ తెలుసు. అందులోనూ జక్కన్న డైరెక్షన్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నటన సినిమాను మరో రేంజ్లో నిలబెట్టాయి. అయితే వారి కష్టానికి ఫలితంగా నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్, అలాగే ఆస్కార్ అవార్డులు వచ్చాయి. మన ఇండియన్ సినిమా అందునా తెలుగు సినిమాకు రావడంతో అందరికీ ఈ అవార్డు ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులు నాటు నాటు పాటకు రావడంతో తెలుగు ప్రేక్షకులే కాకుండా అటు ఇండియన్స్ మొత్తం గర్వంగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ పాట స్వరకర్త కీరవాణి కి ఆస్కార్ రావడం గురించి ఆయన తండ్రి మాట్లాడుతూ నాటు నాటు అంత గొప్ప పాటేమీ కాదు అంటూ వ్యాఖ్యనించారు. అయితే ఇదే విషయం గురించి డైరెక్టర్ గీతా కృష్ణ గారు మాట్లాడారు.

నాటు నాటు చెత్త పాట…

డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఈ ఇష్యూ గురించి మాట్లాడుతూ నాటు నాటు పాట బాగోలేదని ఉద్దేశంలో శివ శక్తి దత్త గారు మాట్లాడుండరు. కేవలం అంతకన్నా గొప్ప పాటలు ఇంకా కీరవాణి కెరీర్ లో ఉన్నాయని, వాటికి రాకుండా ఈ పాటకు రావడం పట్ల ఆయన అలా అని ఉండవచ్చు అంటూ వివరించారు. నలభై ఏళ్లుగా శివ శక్తి దత్త గారు తనకు తెలుసునని కీరవాణి నాకు మంచి మిత్రుడంటూ చెప్పిన ఆయన శివశక్తి దత్త గారు మంచి ఆర్టిస్ట్ అలాగే కథలను బాగా రాస్తారని, ఇప్పటికి ఆయన వయసు తొంభై ఏళ్లకు పైనే ఉన్నా ఆయన సినిమా దర్శకత్వం వహించాలని అనుకుంటున్నారు అంటూ తెలిపారు.

ఇక ఏఆర్ రెహమాన్ కు స్లమ్ డాగ్ మిలినియర్ సినిమాకు మ్యూజిక్ కి అవార్డు వచ్చినపుడు కూడా ఇలాంటి వాదనే వినిపించింది. స్లమ్ డాగ్ కంటే గొప్పగా మ్యూజిక్ చేసిన పాటలు ఏఆర్ రెహమాన్ వి ఎన్నో ఉన్నాయి. అయితే ఆ సినిమా వాళ్ళు లాబీంగ్ చేసారు కాబట్టి ఆ సినిమాకు అవార్డు వచ్చిందని తెలిపారు. అలాగే ఆర్ఆర్ఆర్ కంటే ముందు ఎన్నో మంచి పాటలు ఉన్నాయి. నిజానికి ఆర్ఆర్ఆర్ లో కూడా ఆ పాట కంటే మంచి పాటలు ఉన్నాయి కానీ ఆ పాటకు వచ్చింది అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago